Bathing: స్నానంతో లక్.. ఎలానో తెలుసుకోండి!-add these ingredients to bathing water for luck and health according to astrology ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Bathing: స్నానంతో లక్.. ఎలానో తెలుసుకోండి!

Bathing: స్నానంతో లక్.. ఎలానో తెలుసుకోండి!

Chatakonda Krishna Prakash HT Telugu
Dec 09, 2024 10:30 AM IST

Luck: స్నానపు నీటిలో కొన్ని పదార్థాలు వేసుకుంటే అదృష్టం కలిసి వస్తుందని జ్యోతిషం చెబుతోంది. వాటి వల్ల అదృష్టంతో పాటు అందం, ఆరోగ్యం ఉంటాయని పేర్కొంది. అవేంటో ఇక్కడ చూడండి.

Luck: స్నానం చేసే నీటిలో ఇవి వేసుకుంటే అదృష్టం, ఆరోగ్యం! (Photo: Freepik)
Luck: స్నానం చేసే నీటిలో ఇవి వేసుకుంటే అదృష్టం, ఆరోగ్యం! (Photo: Freepik)

చాలా మంది తమ అదృష్టాన్ని తెలుసుకునేందుకు జ్యోతిషాన్ని విశ్వసిస్తారు. జీవితంలోని చాలా అంశాల్లో జ్యోతిషాన్ని నమ్ముతారు. అదృష్టం మెండుగా ఉండాలని ఆశిస్తారు. స్నానపు నీటిలో ఎలాంటి పదార్థాలు కలిపితే అదృష్టం పెరుగుతోందో కూడా జ్యోతిషం పేర్కొంది. ఇవి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. అందం కూడా పెంచుతాయి. జ్యోతిషం ప్రకారం, స్నానం చేసి నీటిలో ఏం కలుపుకుంటే అదృష్టం పెరుగుతుందో ఇక్కడ చూడండి.

yearly horoscope entry point
  1. వేపాకులు

శరీరం నుంచి నెగెటివ్ ఎనర్జీని వేపాకులు తొలగిస్తాయని జ్యోతిషం పేర్కొంది. అందుకే వేపాకులను స్నానపు నీటిలో వేసుకోవాలని చెబుతోంది. వేపాకులో ఔషధ గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆయుర్వేదంలో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. వేపాకులో యాంటీవైరల్, యాంటీఫంగల్, యాంటీబ్యాక్టీరియల్ గుణాలు మెండుగా ఉంటాయి. ఆరోగ్యానికి ఇవి చాలా రకాలుగా మేలు చేస్తాయి. గోరువెచ్చటి నీటిలో వేపాకులను వేసుకొని స్నానం చేస్తే చాలా లాభాలు ఉంటాయి.

వేపాకులు
వేపాకులు (Pixabay)
  • 2. పసుపు

నీటిలో కాస్త పసుపు కలుపుకొని స్నానం చేస్తే అదృష్టం పెరుగుతుందని జ్యోతిషం చెబుతోంది. ప్రతీ ఇంట్లో వినియోగించే పసుపులో ఔషధ గుణాలతో పాటు సౌందర్య గుణాలు కూడా మెండుగా ఉంటాయి. అందుకే పసుపును నీటిలో వేసుకొని స్నానం చేస్తే అదృష్టంతో పాటు చర్మానికి మేలు జరుగుతుంది.

పసుపు
పసుపు
  • 3. గంధపు చెక్క

స్నానపు నీటిలో గంధం చెక్క వేసుకుంటే అదృష్టం కలిసి వస్తుందని, సంపద, ప్రతిష్ట, విజయాలు దక్కుతాయని జ్యోతిషం చెబుతోంది. గంధపు చెక్కను స్కిన్‍కేర్ ప్రొడక్టుల్లో, సెంట్లలో, ఫ్రేగ్సెన్సుల్లో అధికంగా ఉపయోగిస్తారు. గంధపు చెక్క, గంధం నూనె, గంధం పొడి దేన్నైనా కలిపి నీటితో స్నానం చేస్తే ప్రశాంతంగా అనిపిస్తుంది. ఒత్తిడి తగ్గి పాజిటివ్ ఎనర్జీ పెరిగినట్టు అనిపిస్తుంది.

గంధపు చెక్క
గంధపు చెక్క

4 .గులాబీ రేకులు

గులాబీ రేకులను నీటిలో కలుపుకొని స్నానం చేస్తే సక్సెస్, ప్రేమ, సంతోషం లభిస్తాయని జ్యోతిషం చెబుతోంది. గులాబీ రేకులను చర్మ సౌందర్య ప్రొడక్టుల్లో, ఫ్రేగ్రెన్స్‌ల్లో ఎక్కువగా వినియోగిస్తారు. వీటికి గుబాలించే సువాసన ఉంటుంది. ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. గులాబీ రేకులు కలిపిన నీటితో స్నానం చేస్తే ఒత్తిడి తగ్గుతుంది. శరీరం రిలాక్స్ అయినట్టుగా ఫీల్ అవుతుంది.

గులాబీ
గులాబీ (Unsplash)
  • 5. తులసి

తులసి మొక్కను అత్యంత పవిత్రంగా హిందువులు భావిస్తారు. ఈ తులసి ఆకులను స్నానపు నీటిలో కలిపితే విజయం, సౌభాగ్యం కలుగుతాయని జ్యోతిషం చెబుతోంది. తులసి ఆకుల్లో ఔషధ గుణాలు లెక్కకు మిక్కిలి ఉంటాయి. రోగ నిరోధక శక్తిని తులసి పెంచుతుంది. తులసి ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీఇన్‍ఫ్లమేటరి గుణాలు ఉంటాయి. వీటిని నీటిలో కలుపుకొని స్నానం చేస్తే మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది. పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది.

తులసి
తులసి
Whats_app_banner