Acne Tells Health : మెుటిమలు మీ ఆరోగ్యం గురించి చెబుతాయి.. మీకు ఎక్కడ ఉన్నాయి?-acne tells about health and where is pimples on your face know health problems ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Acne Tells Health : మెుటిమలు మీ ఆరోగ్యం గురించి చెబుతాయి.. మీకు ఎక్కడ ఉన్నాయి?

Acne Tells Health : మెుటిమలు మీ ఆరోగ్యం గురించి చెబుతాయి.. మీకు ఎక్కడ ఉన్నాయి?

Anand Sai HT Telugu Published Jun 16, 2024 04:30 PM IST
Anand Sai HT Telugu
Published Jun 16, 2024 04:30 PM IST

Acne On Health : మీకు ఉన్న మొటిమలు మీ ఆరోగ్యంలో ఏదో లోపం ఉందని మీకు తెలియజేస్తాయి. మొటిమలు మీ ఆరోగ్యం గురించి చెప్పే దాని గురించి మరింత సమాచారం తెలుసుకోండి..

మెుటిమలు మీ ఆరోగ్య సమస్యలు చెబుతాయి
మెుటిమలు మీ ఆరోగ్య సమస్యలు చెబుతాయి

మీ ముఖంపై కనిపించే విషయాలు.. మీ ఆరోగ్యానికి లింగ్ చేసి ఉంటాయి. అందుకే ఒక చోట చిన్న మొటిమ, పొక్కు కనిపిస్తే శరీరంలో మరెక్కడైనా సమస్య ఉందని అర్థం అంటున్నారు వైద్యులు. ముఖం మీద మెుటిమలు ఉండే రకాన్ని బట్టి మీ ఆరోగ్యాన్ని చెప్పవచ్చు. ఆ విషయాలు పూర్తిగా తెలుసుకోండి.

నుదిటిపై మొటిమ

నుదిటిపై మొటిమలు నేరుగా మీ కడుపు, ఆహార వినియోగానికి సంబంధించినవి. జంక్ ఫుడ్ మానేయండి, ఎక్కువ చక్కెర తీసుకోకండి. ఎక్కువ నీరు తాగండి. ముఖంపై మెుటిమలు కడుపు ఇన్ఫెక్షన్ల వంటి పెద్ద సమస్యలకు కూడా దారి తీస్తుంది.

కనుబొమ్మల మధ్య మొటిమలు

మీ కనుబొమ్మల మధ్య ఉన్న చిన్న మొటిమ మీ కాలేయం ఆరోగ్యం గురించి చెబుతుంది. ఆల్కహాల్, మాంసాహారం, ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి. అర్థరాత్రి స్నాక్స్‌ని తగ్గించి, మంచి నిద్రను పొందండి. వారానికోసారి సాత్విక ఆహారాన్ని తినండి. మీ శరీరానికి శక్తినివ్వండి. శుభ్రమైన ఆహారాన్ని తినడం మంచిది.

మీ నుదిటి చుట్టూ మొటిమలు

మీ మూత్రాశయంలో సమస్య ఉన్నట్లు సంకేతమని నిపుణులు చెబుతున్నారు. మీ శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవడానికి చాలా నీరు తాగండి. వాటర్ బాటిల్ చేతిలో ఉంచుకుని తరచుగా తాగాలి. అలాగే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ను మీ డైట్ లో చేర్చుకోండి. డీహైడ్రేషన్ కు సంకేతం.

ముక్కు మీద మొటిమలు

మీ ముక్కుపై మొటిమ ఉంటే మీరు ప్రేమలో ఉన్నారని కాదు.. అది మీ గుండెకు సంబంధించిన సమస్య అని అర్థం చేసుకోవాలి. మీ రక్తపోటు ఎక్కువగా ఉన్నా లేదా తక్కువగా ఉన్నా లేదా మీకు విటమిన్ బి లోపం ఉన్నట్లయితే మీ ముక్కు దాని సంకేతాలను చూపుతుంది. ఆ మొటిమలను తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. వ్యాయామం చేయండి. విటమిన్ బి సప్లిమెంట్లను తీసుకోండి.

బుగ్గలపై మెుటిమలు

మీరు ధూమపానం చేసే వారైనా లేదా మీకు శ్వాస తీసుకోవడంలో సమస్యలు ఉన్నా మీ బుగ్గలపై మొటిమలు లేదా రెండు ఉండే అవకాశాలు ఉన్నాయి. ధూమపానం తగ్గించి, ఉదయాన్నే వ్యాయామం చేయండి. మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోండి. మీ ఆహారంలో కూల్ ఫుడ్స్, దోసలాంటివి చేర్చండి. ఇది శరీరం నుండి అధిక వేడిని తొలగిస్తుంది. చెంపపై మొటిమలు వస్తే అది హార్మోన్ల అసమతుల్యత అని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

మెుటిమలు రాకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.

రోజూ తగినంత నీరు తాగాలి

కలబందను ముఖానికి రాసుకోవచ్చు.

రోజూ పండ్లు తినండి

గ్రీన్ టీని రోజుకు రెండుసార్లు తాగాలి

ఒత్తిడిని తగ్గించండి

రోజూ వ్యాయామం చేయండి

ఇవి మొటిమలు, మీ ఆరోగ్య సమస్యలకు పరిష్కారంగా ఉంటాయి. కానీ మీ మొటిమలు మాయమవడం లేదని మీరు భావిస్తే, మీ శరీరంలోని లోపం ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. చికిత్స చేయాలి. వైద్యుడిని సంప్రదించండి. మెుటిమలు ఎక్కువగా ఉంటే అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. వెంటనే వైద్యులను సంప్రదించాలి. వాటికి తగిన చికిత్స తీసుకోవాలి. సరిగా నీరు తాగాలి. మంచి ఆహారం తీసుకోవాలి

Whats_app_banner