Colour Combinations: హలో లేడీస్! ఈ కలర్ కాంబినేషన్స్ ట్రై చేశారంటే అందరి కళ్లూ మీ మీదే ఉంటాయి!
Colour Combinations: స్టైల్ అండ్ అట్రాక్టివ్ లుక్ రావాలంటే కేవలం స్టైల్ గా కనిపించే బట్టలు వేసుకుంటే సరిపోదు. సరైన కలర్ కాంబినేషన్ కూడా చాలా ముఖ్యం. పర్ఫెక్ట్ కలర్ కాంబినేషన్లో డ్రెస్ చేసుకోవడం వల్ల అందిరిలోనూ అందంగా, ఆకర్షణీయంగా కనిపించవచ్చు.
స్టైల్‌గా హుందాగా కనిపించాలంటే స్టైలీష్ డ్రెస్ వేసుకుంటే మాత్రమే చాలదు.. సరైన రంగులను కూడా ఎంచుకోవాల్సి ఉంటుంది. కలర్ కాంబినేషన్స్ అనేవి మన లుక్ ను పూర్తిగా మార్చేస్తాయి. ముఖ్యంగా లేడీస్ కొన్ని కలర్ కాంబినేషన్స్ ట్రై చేశారంటే చాలా అందంగా, కాన్ఫిడెంట్ గా కూడా కనిపిస్తారు. పర్ఫెక్ట్ కలర్ కాంబినేషన్లో డ్రెస్ చేసుకొండి అందరిలోనూ అందంగా, ఆకర్షణీయంగా కనిపించండి. ఆడవారికి సరైన రంగుల కలయికలోంటో ఇక్కడ తెలుసుకుందాం.
1. ఎరుపు & నలుపు
ధైర్యం, ఆకర్షణ కలగలిపి హుందాగా క్లాసిక్ గా కనిపించేలా చేసే రంగులు ఎరువు, నలుపు.రాత్రిపూట పార్టీలు, ఫార్మల్ అకేషన్ప్ లేదా ఇతర వేడుకలకు ఈ రెండిటినీ కలిపి ట్రై చేశారంటే వావ్ అనిపించేస్తారు.
2. నేవీ బ్లూ & తెలుపు
నేవీ బ్లూ కలర్ చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తుంది. అలాగే తెలుపు చాలా ఫ్రెష్ లుక్ ని ఇస్తుంది.ఈ కలయిక అద్భుతంగా వర్కవుట్ అవుతుంది. డే టైం అవుటింగ్‌లు, ఆఫీస్ వేర్, లేదా సెమీ-ఫార్మల్ ఈవెంట్స్ కి ఈ కలర్ కాంబినేషన్లో డ్రెస్ చేసుకొండి.
3. బ్లష్ పింక్ & బంగారం
బ్లష్ పింక్ సున్నితమైన, మృదువైన రంగు. గోల్డ్ కలర్ లగ్జరీయస్ గా కనిపిస్తుంది. ఈ రెండు రంగుల కలయిక చాలా హుందాగా, అందంగా ఉంటుంది. వివాహాలు, ఫార్మల్ ఈవెంట్స్, లేదా రొమాంటిక్ రాత్రులకు పర్ఫెక్ట్ గా ఉంటుంది.
4. ఎమరాల్డ్ గ్రీన్ & క్రీం
ఎమరాల్డ్ గ్రీన్ చాలా రిచ్ గా కనిపించే రంగు, క్రీం (లేదా ఆఫ్-వైట్) సాఫ్ట్ కాన్ట్రాస్ట్‌ను ఇస్తుంది. ఈ కలయిక ఇతరుల శ్రద్ధను ఆకర్షిస్తుంది. ప్రత్యేక సందర్భాలు, డిన్నర్లు, లేదా అవుట్డోర్ ఈవెంట్స్ కోసం ఈ కలర్ కాంబినేషన్ ట్రే చేయండి.
5. నలుపు & తెలుపు
బ్లాక్ అండ్ వైట్ అనేది ఎవర్ గ్రీన్ క్లాసిక్ కాంబినేషన్. ఇవి స్టైలింగ్ లో ఎప్పుడూ ముందుంటాయి. ఈ కలయిక క్లీన్, స్లీక్ ,మోడర్న్ లుక్‌ను సృష్టిస్తుంది.ఆఫీస్ వేర్, ఫార్మల్ ఈవెంట్స్, లేదా మినిమలిస్ట్-శిక్ స్టైల్ సందర్భాల్లో ఈ కలర్ కాంబినేషన్ తో అదరగొట్టచ్చు.
6. లావెండర్ & గ్రే
లావెండర్ చాలా ప్రశాంతంగా కనిపించే రంగు, ఇక గ్రే న్యూట్రల్ అండ్ రిఫైన్డ్ కలర్. ఈ రెండింటి కలయిక చాలా క్లాసిక్ గా, గ్రేస్ ఫుల్ గా కనిపిస్తుంది. డే-టూ-డే వేర్, క్యాజువల్ గ్యాథరింగ్స్, లేదా పార్టీల సమయాల్లో ఇవి చక్కటి కాంబినేషన్.
7 పీచ్ & మింట్ గ్రీన్
పీచ్ చాలా కూల్ గా, గ్లోయిష్ గా కనినించే రంగు అలాగే గ్రీన్ పీస్ ఫుల్ అండ్ ఫ్రెష్ కలర్. ఈ రెండింటి కలయిక చాలా బ్యాలెన్పింగ్ గా స్టన్నింగ్ గా కనిపించేలా చేస్తుంది. ఎప్పుడూ మీకు ఫ్రెష్ లుక్ ను ఇస్తుంది. ఫెస్టివ్ అవుటఫిట్స్, క్యాజువల్ వేర్, లేదా అవుట్డోర్ ఈవెంట్స్ కు ఇది చక్కటి కాంబినేషన్.
8. బ్లష్ పింక్ & ఛార్కోల్ గ్రే
బ్లష్ పింక్ సున్నితమైన, ఆడంకోని రంగు, ఛార్కోల్ గ్రే అట్ట్రాక్టివ్ అండ్ కారిక్యులర్ కాంట్రాస్ట్ కలర్. ఈ రెండింటి కలయిక పాష్ అండ్ పాలిషింగ్ గా ఉంటుంది. ఆఫీస్ వేర్, బిజినెస్ క్యాజువల్, లేదా స్మార్ట్-క్యాజువల్ ఓకేజన్స్ ఇవి మంచి ఆప్షన్.
9. మస్టర్డ్ యెల్లో & ఒలివ్ గ్రీన్
మస్టర్డ్ యెల్లో చాలా హాట్ గా కనిపించేలా చేస్తుంది. అలాగే ఓలివ్ గ్రీన్ ఎర్తీ లుక్ ను ఇస్తుంది. ఈ రెండింటి కలయిక చాలా హుందాగా, క్లాసీగా కనిపించేలా చేస్తుంది. క్యాజువల్ వేర్, ఫెస్టివ్ అవుటఫిట్స్, లేదా ట్రావెల్ ఈ కలర్ కాంబినేషన్ బెస్ట్ .
10. వైన్ రెడ్ & గ్రే
వైన్ రెడ్ చాలా రిచ్ కలర్, గ్రే ఒక న్యూట్రల్ అండ్ ఇంట్రెస్టింగ్ కలర్. ఈ రెండు రంగుల కలయిక బ్యాలెన్స్ అండ్ అట్రాక్టివ్ లుక్ ను ఇస్తుంది. ఫార్మల్ వేర్, బిజినెస్ సెట్టింగ్స్, లేదా రాత్రిపూట అవుటింగ్స్ ఈ కలర్ కాంబినేషన్ తప్పక ట్రే చేయండి.