Telugu News  /  Lifestyle  /  Acer Televisions Launched In India At Affordable Prices
Acer I series
Acer I series

Acer I Series TVs | సరసమైన ధరల్లోనే ఏసర్ నుంచి ఆండ్రాయిడ్ టీవీలు, ఫీచర్లు ఇవే!

21 July 2022, 14:33 ISTHT Telugu Desk
21 July 2022, 14:33 IST

Acer బ్రాండ్ నుంచి I సిరీస్ లో 4 టీవీలు మార్కెట్లో విడుదలయ్యాయి. ఇవి Android 11 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేస్తాయి. కాబట్టి గూగుల్ వాయిస్ అసెస్టింట్ ఇతర ఫీచర్లు ఇన్-బిల్ట్ గా వస్తున్నాయి. వీటి ధరలు, ఇతర వివరాలు తెలుసుకోండి.

Acer బ్రాండ్ తాజాగా I సిరీస్ టీవీలను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇవి Android 11 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేస్తాయి. సరసమైన ధరలోనే లభించే ఈ టీవీలు ప్రధాన ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు అలాగే ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌లలో అందుబాటులో ఉన్నాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. విశేషమైన లైబ్రరీని అందిస్తాయి.

ట్రెండింగ్ వార్తలు

I-సిరీస్ నాలుగు స్క్రీన్ పరిమాణాలలో అందుబాటులో ఉంటాయి. బేస్ మోడల్ 32-అంగుళాల మోడల్ హై-డెఫినిషన్ డిస్‌ప్లే రిజల్యూషన్‌ను కలిగి ఉండగా, రెండోవది 43-అంగుళాలు, మూడవది 50-అంగుళాలు అలాగే టాప్ స్పెక్ 55-అంగుళాలతో అల్ట్రా హై డెఫినిషన్ డిస్‌ప్లేతో వచ్చాయి.

అన్ని మోడల్‌లు డ్యూయల్ బ్యాండ్ వైఫై, 2-వే బ్లూటూత్ ఫీచర్‌లతో పాటు డాల్బీ ఆడియో సపోర్ట్ చేసే శక్తివంతమైన 30-వాట్ స్పీకర్ సిస్టమ్‌లను కూడా కలిగి ఉన్నాయి.

ఇంకా ఏమేం ఫీచర్లు ఉన్నాయి, ఒక్కో మోడల్ ధర ఎంత తదితర విషయాలను ఈ కింద తెలుసుకోవచ్చు.

ఏసర్ టెలివిజన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

ఈ సరికొత్త ఏసర్ I సిరీస్ టీవీలు ఎడ్జ్-టు-ఎడ్జ్ డిస్‌ప్లే, ఫ్రేమ్‌లెస్ డిజైన్‌ను కలిగి ఉంటాయి. అవి కూడా బెజెల్-లెస్ అని చెబుతున్నారు. మెరుగైన వీక్షణ కోసం వైడ్ కలర్ గామట్+, HDR 10+, సూపర్ బ్రైట్‌నెస్, బ్లాక్ లెవెల్ ఆగ్మెంటేషన్, 4K అప్‌స్కేలింగ్ ఫీచర్లు ఉన్నాయి.

కంటిపై భారం పడకుండా మరింత సౌకర్యవంతమైన వీక్షణ కోసం అంతర్నిర్మిత స్మార్ట్ బ్లూ లైట్ రిడక్షన్ టెక్నాలజీతో కూడా కలిగి ఉన్నాయి. యూజర్ల అభిరుచులకు తగినట్లుగా కావాల్సినంత కంటెంట్ లైబ్రరీ అందుబాటులో ఉందని కంపెనీ పేర్కొంది.

ఇవి ఆండ్రాయిడ్ టీవీలు అయినందున Google అసిస్టెంట్, Chromecast వంటివి ఇన్-బిల్ట్ గా వస్తున్నాయి.

32HD మోడల్ ధర రూ. 19,990, 43UHD మోడల్ ధర రూ. 34,990, 50UHD మోడల్ ధర రూ. 40,990 ఉండగా, టాప్ స్పెక్ మోడల్ 55UHD ధర రూ. 47,990/- గా ఉన్నాయి.

టాపిక్