Ayurveda: ఆయుర్వేదం ప్రకారం ఈ మూడింటిని తింటే ఆ లోపమే రాదు, పిల్లలు మహిళలు కచ్చితంగా తినాల్సిందే
Ayurveda: శరీరంలో ఐరన్ లోపం ఉంటే ఎన్నో సమస్యలు వస్తాయి. ఆయుర్వేదం ప్రకారం కొన్ని ఆహారాలను తినడం వల్ల ఇనుము లోపం రాకుండా ఉంటుంది. ఇవి హిమోగ్లోబిన్ స్థాయిని వేగంగా పెంచడానికి సహాయపడతాయి.
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ప్రజల్లో ఐరన్ లోపం అధికంగా ఉంటుంది. ముఖ్యంగా పిల్లలు, మహిళల్లో ఈ లోపం కనిపిస్తుంది. ఇనుము అత్యంత సాధారణ పోషక లోపంగా మారిపోయింది. ఇనుము లోపం వల్ల అనేక రకాల వ్యాధులు వస్తాయి. కాబట్టి ఇనుము అధికంగా ఉన్న ఆహారాలను కచ్చితంగా తినాలి. ఎలాంటి ఆహారాల్లో ఇనుము అధికంగా ఉంటుందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.

ఇనుము లోపం లక్షణాలు
ఇనుము లోపంతో బాధపడే వారిలో కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి. వారు తీవ్రంగా అలసిపోతారు. చిన్నపని చేసినా కూడా వారికి అలసట వస్తుంది. బలహీనంగా అనిపిస్తుంది. ఇనుము లోపం వల్ల చర్మం పసుపు రంగులోకి మారిపోతుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. మానసిక ఎదుగుదల సరిగా ఉండదు. ఏదైనా నేర్చుకోవాలన్నా కూడా ఎంతో ఇబ్బంది పడతారు. మెదడులో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అదే సమయంలో చేతులు, కాళ్ల గోళ్లు చాలా సన్నగా, బలహీనంగా మారతాయి. అలాగే, కాళ్లలో అసౌకర్యంగా అనిపిస్తుంది. రక్తం లేకపోవడం వల్ల ఇలా వస్తుంది. ఆయుర్వేదంలో, శరీరంలో రక్తం లోపాన్ని తీర్చే, ఇనుము స్థాయిని పెంచే ఇటువంటి ఆహారాలను వివరించారు. ఇనుము స్థాయిలను పెంచడంలో సహాయపడే అలాంటి మూడు ప్రత్యేక ఆహారాలను తెలుసుకోండి.
నల్ల నువ్వులు
నల్లని నువ్వులు ప్రతి ఇంట్లో ఉండాల్సిన అవసరం ఉంది. రక్తాన్ని ఉత్పత్తి చేయడంలో ఇది ఉత్తమ వనరు. నల్ల నువ్వులు ప్రతిరోజూ తినడం వల్ల శరీరంలో ఇనుము స్థాయిని పెంచడమే కాకుండా కాల్షియం, మెగ్నీషియం, రాగి, జింక్, సెలీనియం, విటమిన్లు బి6, ఇ మరియు ఫోలేట్ కలిగి ఉంటుంది. నల్ల నువ్వులను రోజూ వేయించి తినడం వల్ల ఇనుము లోపం తగ్గుతుంది. కాబట్టి పిల్లలకు నల్లనువ్వులతో చేసిన ఆహారాలు తినిపిస్తూ ఉండాలి. అలాగే మహిళలు కూడా నల్ల నువ్వులు తినడం వల్ల నెలసరి సమస్యలు తగ్గిపోతాయి.
బెల్లం, శెనగపిండి
బెల్లం, శెనగపిండిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో రక్తం లోపాన్ని తీరుస్తుంది. శెనగపిండిని కొమ్ము శెనగలతో తయారుచేస్తారు. వీటిలో ప్రోటీన్, ఫైబర్, మాంగనీస్ తో పాటు ఇనుము పుష్కలంగా ఉన్నాయి. శెనగపిండిలో బెల్లం కలిపి తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది. ఈ రెండింటినీ కలిపి పరగడుపున తినాలి. శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడానికి సహాయపడుతుంది.
రోజుకో ఉసిరికాయ
రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉసిరి ఉత్తమ వనరు. ఇందులో అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీన్ని ప్రతిరోజూ ఒకటి తినేందుకు ప్రయత్నించండి. తేనె, నల్ల మిరియాల పొడి కలిపి తింటే.. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. బదులుగా, ఇనుము శరీరంలో విటమిన్ లోపాన్ని కూడా తీరుస్తుంది. ఆయుర్వేదం ప్రకారం, ఇది శరీరంలో పోషకాలను సులువుగా శోషించుకునేలా చేస్తుంది. మంచి పోషణను అందిస్తుంది.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)