Toxins in body: ఈ 7 ఆహారాలు తింటే ఆయుర్వేదం ప్రకారం మీ శరీరంలోని విషాలు, వ్యర్ధాలు బయటికి పోతాయి
Toxins in body: ఆయుర్వేదం మన ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో మంచి చిట్కాలను అందిస్తుంది. ఇప్పుడు మన శరీరంలో చేరిన విషాలను, వ్యర్ధాలు తొలగించుకునేందుకు ఏడు ఆహారాలు గురించి చెబుతోంది.
ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటేనే ఏ వ్యక్తి అయినా ఎక్కువకాలం జీవించగలడు. అతని ఆయుష్షు అతడు తినే ఆహారం, జీవనశైలిపైనే ఆధారపడి ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం ఏడు రకాల ఆహారాలు శరీరంలోని అన్ని రకాల విషయాలను తొలగించే శక్తిని కలిగి ఉంటాయి. అవేంటో ఆయుర్వేదం వివరిస్తుంది. వీటిని ప్రతిరోజు తినేందుకు ప్రయత్నిస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది.
ఇప్పుడు ఎన్నో రకాల కూరగాయలను పురుగుల మందులు, రసాయనాలతో పండిస్తున్నారు. అవి తినడం వల్ల శరీరంలో హానికరమైన విషాలు చేరిపోతున్నాయి. కాబట్టి వాటిని తొలగించుకోవాలంటే మరికొన్ని ఆహారాలను ప్రత్యేకంగా తినాల్సిన అవసరం ఉంది.
నెయ్యి
ప్రతి ఇంట్లో నెయ్యి ఉంటుంది. ఇది మంచి కొవ్వును కలిగి ఉంటుంది. జీర్ణక్రియకు, చర్మ ఆరోగ్యానికి, కంటి ఆరోగ్యానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. మీ శరీరంలోని విషాలను బయటకు పంపించేందుకు కూడా నెయ్యి ఉత్తమంగా పనిచేస్తుంది. కాబట్టి ప్రతిరోజు ఒక స్పూను నెయ్యి తినేందుకు ప్రయత్నించండి.
తేనె
ఆయుర్వేదం ప్రకారం తేనే మనకు చేసే మేలు ఇంతా అంతా కాదు. జీర్ణాశయంతర పేగుల ఆరోగ్యాన్ని కాపాడడంలో ఇది ముందుంటుంది. అలాగే ఇది గొంతుకు కూడా ఎంతో మేలు చేస్తుంది. యాంటీ యాంగ్జైటీగా పనిచేస్తుంది. అంటే మానసిక ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. కాబట్టి ప్రతిరోజు ఒక స్పూన్ తేనె తినడం వల్ల శరీరంలో పేర్కొన్న అనవసర వ్యర్ధాలు బయటికి పోతాయి. అలా అని అతిగా తేనె తినకండి.
వెన్న
వెన్నను ఇంట్లోనే తయారు చేసుకోవాలి. మజ్జిగను చిలకరించడం ద్వారా వెన్నను తీస్తారు. ఈ వెన్నను పరాటాలపైన రాసుకొని తింటూ ఉంటారు. అలాగే ఈ వెన్నతోనే నెయ్యి కూడా తయారు చేస్తూ ఉంటారు. ఆ వెన్నను ప్రతిరోజూ తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కీళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. శరీరం పోషకాలు శోషించుకునేలా చేస్తుంది. శరీరంలోని వ్యర్ధపదార్థాలను మూత్రపిండాల ద్వారా బయటికి పంపిస్తుంది.
రాతి ఉప్పు
రాతి ఉప్పు లేదా హిమాలయన్ సాల్ట్ ఏదైనా కూడా ఆరోగ్యానికి మంచిదే. ఇవి ప్రాసెస్ చేయని ఉప్పు రకాలు. ఇంట్లో వాడే టేబుల్ సాల్ట్ కు బదులుగా వీటిని వాడితే మంచిది. ఆయుర్వేదం ప్రకారం ఈ ఉప్పును ఉపయోగించడం అన్ని రకాలుగా మంచిది. ఇది ఒత్తిడి, శ్వాసకోశ సమస్యలు నుంచి కాపాడుతుంది. జీర్ణక్రియకు బలాన్ని ఇస్తుంది. రక్తంలో ఎలాంటి విషాల, వ్యర్ధాలు లేకుండా చూస్తుంది.
పిప్పలి
ఆయుర్వేదంలో పిప్పలిని మూలికలుగా వాడుతారు. ఇది ఒక రకమైన మిరియాలు. పొడవుగా ఉంటాయి. వీటిని తినడం వల్ల దగ్గు నియంత్రణలోకి వస్తుంది. శ్లేష్మం కూడా ఏర్పడకుండా ఉంటుంది. వాయు మార్గాలు క్లియర్ గా ఉంటాయి. ఆయుర్వేదం ప్రకారం ప్రతిరోజు పిప్పలిని తక్కువ పరిమాణంలో తీసుకుంటే శ్వాసకోశ సమస్యలు రావు. విషాలు తొలగిపోతాయి.
శొంఠి
ఎండు అల్లం పొడిని శొంటి అంటారు. దీనిలో శోథ నిరోధక లక్షణాలు ఎక్కువ. దగ్గు, జలుబు నుంచి మనల్ని కాపాడతాయి. కీళ్ల నొప్పులు రాకుండా సహాయపడతాయి. గోరువెచ్చని నీటిలో చిటికెడు శొంటి పొడి కలుపుకొని తాగితే ఎంతో ఆరోగ్యం శరీరం పూర్తిగా శుభ్రపడుతుంది.
నల్ల మిరియాలు
మిరియాలను వాడే వారి సంఖ్య తక్కువగానే ఉంది. నిజానికి ప్రతీ కూరలో కూడా మిరియాల పొడిని వేయవచ్చు. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఎక్కువ రక్తంలో చక్కెరను పెరగకుండా అడ్డుకుంటాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. క్యాన్సర్ తో పోరాడే శక్తిని ఇస్తాయి. కాబట్టి మిరియాలు పొడిని ప్రతిరోజు ఆహారంలో ఉండేలా చూసుకుంటే ఎంతో మంచిది.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)
సంబంధిత కథనం