శవం కనిపిస్తే తినేస్తారు.. సూప్ చేసుకుని తాగేస్తారు.. ఎక్కడో తెలుసా?-a tribe from amazonian society consumes the dead in the part of death ritual ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  A Tribe From Amazonian Society Consumes The Dead In The Part Of Death Ritual

శవం కనిపిస్తే తినేస్తారు.. సూప్ చేసుకుని తాగేస్తారు.. ఎక్కడో తెలుసా?

Manda Vikas HT Telugu
Dec 28, 2021 09:38 AM IST

శవానికి దహన సంస్కారాలు నిర్వహిస్తారు. అనంతరం ఆ బూడిదను, ఎముకలను పొడిగా చేసి ఈ మిశ్రమాన్ని అరటి, మొక్కజొన్నతో తయారు చేసిన ఒక సూప్ లాంటి ద్రావణంలో కలుపుకొని వారి కుటుంబ సభ్యులంతా కలిసి తాగేస్తారు.

Representational Image
Representational Image (AFP)

ఎక్కడైనా చనిపోయిన వారికి దహన సంస్కారాలు నిర్వహించిన అనంతరం వారి అస్థికలను ఏ నదిలోనో, సముద్రంలోనో కలిపే ఆచారం మనకు తెలుసు. కానీ ఇది వినటానికి కాస్త భయంకరంగా అనిపించినా, ఇదొక భయంకరమైన నిజం. చనిపోయిన తర్వాత శవాన్ని కాల్చి, బూడిద చేసి ఆపై బూడిదను, అస్థికలను సూప్ లాగా చేసుకొని తాగేస్తున్నారు. ఇలా చేసేది యానోమామి తెగకు చెందిన ప్రజలు.

వెనిజులా- బ్రెజిల్ సరిహద్దును ఆనుకుని ఉండే అమెజాన్ రెయిన్‌ఫారెస్ట్‌ పరివాహక ప్రాంతంలో ఈ యానోమామి తెగకు చెందిన వారు ఎక్కువగా నివసిస్తారు. వీరిలో ఎవరైనా వ్యక్తి చనిపోతే వారి శవాన్ని పాతిపెట్టరు. ఆ శవానికి దహన సంస్కారాలు నిర్వహిస్తారు. అనంతరం ఆ బూడిదను, ఎముకలను పొడిగా చేసి ఈ మిశ్రమాన్ని అరటి, మొక్కజొన్నతో తయారు చేసిన ఒక సూప్ లాంటి ద్రావణంలో కలుపుకొని వారి కుటుంబ సభ్యులంతా కలిసి తాగేస్తారు. ఇలా తాగడం ఈ తెగ నిర్వహించే కర్మకాండల్లో ఒక ఆచారం.

ఎందుకు తాగుతారంటే..

అయితే ఇలా ఎందుకు చేస్తారంటే.. ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయినపుడు వారి ఆత్మ ఆ భౌతికకాయం చుట్టే తిరుగుతుందని, అలాంటపుడు ఆ ఆత్మకు శాంతి చేకూరదని వీరి నమ్మకం. కాబట్టి ఆత్మకు భౌతిక జాడ లేకుండా చేసేందుకు శవాన్ని పూర్తిగా దహనం చేసి ఆ బూడిదను కుటుంబ సభ్యులు తాగుతారు. అంతేకాకుండా ఇలా చేయడం ద్వారా తమ ప్రియమైన వ్యక్తి తమ మధ్య నుంచి భౌతికంగా దూరమైనా, వారి ఆత్మ తమలోనే నిక్షిప్తమై ఉంటుందని యానోమామి తెగ ప్రజలు విశ్వసిస్తున్నారు.

నరమాంసం తిని తర్వాత తాగుతారు.. 

ఇదే తెగలో మరో వర్గం కూడా ఉంది. వీరైతే ఏకంగా ముందుగా శవాన్ని ముక్కలుగా కోసుకొని తిని, ఆ తర్వాత మిగిలిన ఎముకలను సూప్ చేసుకొని తాగుతారు. ఇలా నరమాంస భక్షణ చేసే ఆచారాన్ని అక్కడ ఎండోకనిబాలిజం అని పిలుస్తారు. డిజిటల్ యుగంలో కూడా అమెరికా లాంటి మోడ్రన్ దేశాలలోని కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ ఇలాంటి వింత ఆచారాలు పాటించే తెగలు ఉండటం నిజంగా విచిత్రమే.

WhatsApp channel