Samanta: న్యూ ఇయర్ రిజల్యూషన్ విషయంలో సమంతను చూసి ఎంతో నేర్చుకోవాలి, వైరల్ అవుతున్న ఇంటెన్సివ్ వర్కవుట్ వీడియో-a new years resolution to learn from samanthas intense workout video that is going viral ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Samanta: న్యూ ఇయర్ రిజల్యూషన్ విషయంలో సమంతను చూసి ఎంతో నేర్చుకోవాలి, వైరల్ అవుతున్న ఇంటెన్సివ్ వర్కవుట్ వీడియో

Samanta: న్యూ ఇయర్ రిజల్యూషన్ విషయంలో సమంతను చూసి ఎంతో నేర్చుకోవాలి, వైరల్ అవుతున్న ఇంటెన్సివ్ వర్కవుట్ వీడియో

Haritha Chappa HT Telugu
Jan 16, 2025 02:00 PM IST

సమంత రతు ప్రభు రీసెంట్ గా వర్కవుట్ వీడియోను ఇన్ స్టాలో పోస్టు చేసింది. అందులో ఆమె న్యూ ఇయర్ తీర్మానాలకు కట్టుబడి ఉండటంలో విఫలమైనవారికి స్పూర్తినిచ్చేలా కోట్స్ చెప్పింది.

సమంత వర్కవుట్స్
సమంత వర్కవుట్స్

సమంత ఫిట్నెస్ కు ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది. నిత్యం వర్కవుట్స్ చేస్తూ కనిపిస్తుంది. ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తుంది. అందుకే సమంత మంచి శరీర సౌష్టవంతో కనిపిస్తుంది. ఆమె విడాకులు తీసుకున్న ఎంతోమంది మహిళలకు మార్గదర్శకంగా నిలిచింది. పెళ్లి, విడాకులు అనేవి ఒక మహిళ విజయాన్ని ఆపలేవని నిరూపించింది. అయితే మరో స్పూర్తికరమైన రీల్ తో మీ ముందుకు వచ్చింది.  న్యూ ఇయర్ రిజల్యూషన్స్ తీసుకుని రెండు రోజుల పాటించి వదిలేసిన వారు అధైర్యపడాల్సిన అవసరం లేదని, తిరిగి రిజల్యూషన్ పాటించాలని ఆమె తన రీల్ లో చెప్పింది. 

కొత్త ఏడాదికి న్యూఇయర్ రిజల్యూషన్ తీసుకునేవారు ఎంతో మంది. కొంతమంది బరువు తగ్గేందుకు ప్రతిరోజూ వర్కవుట్స్ చేయాలని రిజల్యూషన్ తీసుకుంటారు. కానీ రెండు రోజులు చేశాక దాన్ని వదిలేస్తారు.  మీరు నిర్దేశించుకున్న సంకల్పం గతంగా మారిపోతుంది.  నటి సమంత షయంలోనూ ఇలాంటిదే జరిగింది. కానీ ఆమె మళ్లీ తన వర్కవుట్స్ ను మొదలుపెట్టింది. 

సమంత వీడియో

జిమ్ లో వివిధ రకాల వ్యాయామాలు చేస్తున్న పలు మాంటేజ్ లతో కూడిన వర్కవుట్ వీడియోను సమంత గురువారం షేర్ చేసింది. 'రెండు చెడు రోజులు నన్ను ఆపుతాయా?' అనే ఆడియో బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతుండగా నటి వర్కవుట్స్ చేస్తూ కనిపించింది. ఆమె రింగ్ పుల్-అప్స్, వెయిటెడ్ హీల్ డిప్స్, కెటిల్ బాల్,  డంబెల్ లేటరల్ ఆర్మ్ ఎత్తడం, డంబెల్ ఓవర్ హెడ్ వంటి వ్యాయామాలు చేసింది. ఆలివ్ గ్రీన్ స్పోర్ట్స్ బ్రా, యోగా టైట్స్ ధరించి సమంత రొటీన్ గానే కనిపించింది.

సమంత వ్యాయామ ప్రేరణతో పాటు కొన్ని ఆరోగ్య సలహాలను కూడా తన కొత్త రీల్ లో అందించింది. 'కొత్త సంవత్సరం వచ్చి రెండు వారాలు పూర్తయింది, మీ తీర్మానాలు ఇప్పటికే మారిపోయాయా?' అని ఆమె వీడియో మొదలవుతుంది. తాను కూడా అలా ఎన్నోసార్లు న్యూఇయర్ రిజల్యూషన్లను పక్కన పెట్టినట్టు ఒప్పుకుంది.  అయితే, కొన్ని ఎదురుదెబ్బలు ఎవరినీ వెనక్కు నెట్టకూడదు. కొన్నిసార్లు విశ్రాంతి తీసుకోవడం, కొన్నిసార్లు బద్దకించడం వంటి పనుల ద్వారా కూడా రిజల్యూషన్లను వదిలేస్తాము అని చెప్పుకొచ్చింది.  

కొత్త ఏడాది తీర్మానాలకు  కట్టుబడి ఉండకపోవడం అనేది పెద్ద విషయమేమీ కాదని సమంత అన్నారు. ఈ ఏడాది డిఫరెంట్ గా ట్రై చేస్తానని. రాబోయే రెండు వారాల పాటు, తాను చేసే వ్యాయామాలను అందరితో పంచుకుంటానని ఆమె వివరించింది. 

సమంత హెల్త్ అప్డేట్

సమంత తనకు చికున్ గున్యా ఉందని, దాని నుంచి కోలుకుంటున్నానని ఇటీవల వెల్లడించింది.  2022లో తనకు మయోసిటిస్ అనే ఆటో ఇమ్యూన్ కండిషన్ ఉందని సమంత వెల్లడించింది. దాని వల్ల ఆమె ఎంతో తీవ్రంగా ప్రభావితమైంది. 

ఇదిలా ఉంటే సమంత చివరిసారిగా వరుణ్ ధావన్ తో కలిసి సిటాడెల్: హనీ బన్నీ అనే యాక్షన్ సిరీస్ లో నటించింది. సీతా ఆర్ మీనన్ రాసిన ఈ చిత్రానికి రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు.

Whats_app_banner