Friday Motivation: సమయానికి విలువనిచ్చే వ్యక్తి ఎప్పటికైనా విజేతగా నిలుస్తాడు
Friday Motivation: జీవితంలో సమయానికి ఎంతో విలువ ఉంటుంది. సమయం ఒక్కసారి గడిచిపోతే ఒక్క సెకను కూడా వెనక్కి తీసుకురాలేం. ఎవరైతే సమయానికి విలువనిచ్చి ప్రతి పనిని చేస్తారో... వారు ఎప్పుడో ఒకసారి కచ్చితంగా గెలిచి తీరుతారు.
Friday Motivation: టైం మేనేజ్మెంట్ ఇది అందరికీ రాదు. కొంతమందికి మాత్రమే వస్తుంది. అందుకే అందరూ విజేతలుగా నిలవరు, ఎవరైతే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారో వారు మాత్రమే విజేతలుగా నిలుస్తారు. అలాంటి వారిని వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. జీవితంలో సమయానికి విలువనిచ్చే వ్యక్తులు దాన్ని చక్కగా వినియోగించుకొని విజయాన్ని సాధిస్తారు.
ఎవరైతే సమయాన్ని వృధా చేస్తూ ఉంటారో... వారు కచ్చితంగా విఫలం చెందుతారు. ఏదైనా ప్రణాళికాబద్ధంగా సమయానికి అనుగుణంగా చేసుకుంటూ వెళ్లాలి. అప్పుడే విజయం అవుతుంది.
ఈ ప్రపంచంలో విజయం సాధించిన ప్రతి ఒక్కరి జీవితాలను ఒక్కసారి తరచి చూడండి. వారంతా కూడా సమయానికి చేయాల్సిన పనులను కచ్చితంగా చేసేవారు. సమయాన్ని వృధా చేసేవారు కాదు. తాము అనుకున్నది సాధించే వరకు వేరే ఆలోచన లేకుండా ముందుకు సాగేవారు. ఇలా ఎవరైతే పనులను సరైన సమయంలో పూర్తి చేస్తారో... వారు ఏ రంగంలో కావాలనుకుంటే ఆ రంగంలో విజేతలుగా నిలుస్తారు.
ఏ విజేతనైనా నిర్ణయించేది సమయాన్ని ప్రకారం చేసే పనులే. సమయపాలన లేని వ్యక్తి విజయవంతం అయ్యే అవకాశాలు చాలా తక్కువ. ప్రతి క్షణాన్ని వినియోగించుకోవడానికి ప్రయత్నించాలి. సమయపాలన అనేది రోజువారి జీవితంలో భాగం చేసుకోవాలి. విద్యార్థులైనా, ఉద్యోగులైనా, వ్యాపారస్తులైనా, వ్యవస్థాపకులైనా... సమయపాలన ఉంటేనే లక్ష్యాలను సాధించడం సులభతరం అవుతుంది.
సమయపాలన అలవర్చుకోవాలంటే కొన్ని అలవాట్లను నేర్చుకోవాలి. ఏ సమయానికి, ఏ పని చేయాలో ముందుగానే షెడ్యూల్ చేసుకోవాలి. ఆ షెడ్యూల్ ప్రకారమే పనులు చేస్తూ వెళ్లాలి. మీ పనులకు ఆటంకం కలిగించే స్నేహితులు, బంధువులు ఎంతోమంది ఉంటారు. అలాంటి వారిని దూరం పెట్టడం చాలా అవసరం. ముఖ్యంగా సోషల్ మీడియా, ఫోన్ కాల్స్, మెసేజులు... ఇలాంటివి తగ్గించుకోవాలి. వాటి ధ్యాసలో పడిపోయి మీకు తెలియకుండానే సమయం కరిగిపోతుంది.
ఒకేసారి ఎక్కువ పనులు చేయాలనుకోకండి. షెడ్యూల్ ప్రకారం ప్రతి పనిని చేసుకుంటూ వెళ్ళండి. ఒకేసారి ఎక్కువ పనులు చేయాలనుకుంటే తలకు మించిన భారం మారుతుంది. దీనివల్ల ఏ పని కూడా సవ్యంగా అవదు. కాబట్టి ఒక్కో పనిని పూర్తి చేసుకుంటూ వెళ్తే మానసిక ఒత్తిడికి గురికాకుండా ఉంటారు.
ఆరోగ్యం పైన శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. పని ఒత్తిడిలో ఆరోగ్యం చెడిపోతే ఏ పనీ పూర్తికాదు. అందుకే కొంత విరామం తీసుకుని రిఫ్రెష్ అయ్యి మళ్ళీ పనులను పూర్తి చేసుకుంటూ ఉండాలి. విశ్రాంతి తీసుకోవడం మీకంటూ ఒక సమయాన్ని కేటాయించుకోవడం చాలా అవసరం. ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వడం కూడా నేర్చుకోండి. టైం మేనేజ్మెంట్ గురించి మరింత విశ్లేషణగా తెలుసుకుంటే.. మీ ఆరోగ్యానికీ, కెరీర్‌కు కూడా ఎంతో ఉపయోగపడుతుంది.
టాపిక్