ప్రసవం అనేది ఒక స్త్రీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు. ఈ సమయంలో ఆమె శరీరం అనేక మార్పులకు గురవుతుంది. తన ఆరోగ్యంపై, శిశువు ఆరోగ్యంపై ప్రత్యేక జాగ్రత్తగా తీసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా శిశువుకు పాలివ్వడం అనేది ప్రధాన ప్రక్రియ. ఇది తల్లి శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. సమయంలో తల్లి సరైన పోషకాహారం తీసుకోవడం చాలా కీలకం.
బలమైన పోషణ కేవలం తల్లి త్వరగా కోలుకోవడానికి మాత్రమే కాదు, ఆమె రోగనిరోధక శక్తిని పెంచడానికి, శక్తివంతంగా ఉండటానికి కూడా సహాయపడుతుంది. అంతేకాదు తల్లి తీసుకునే ఆహారం నేరుగా ఆమె పాల నాణ్యతను ప్రభావితం చేస్తుంది. శిశువు ఎదుగుదల, అభివృద్ధికి తల్లి పాలు అత్యంత ముఖ్యమైన పోషకాహార వనరు. కాబట్టి, తల్లి తీసుకునే ఆహారం శిశువు ఆరోగ్యానికి చాలా ముఖ్యం.
బెంగళూరులోని శేషాద్రిపురంలోని అపోలో ఆసుపత్రిలో క్లినికల్ డైటీషియన్, హెచ్ఓడి డాక్టర్ పద్మిని బి. హెచ్టి లైఫ్స్టైల్తో మాట్లాడుతూ ప్రసవానంతర కాలంలో పోషకాహార ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.ఆమె ప్రకారం.. చాలా సందర్భాలలో తల్లులు తమ పిల్లల అవసరాలకు మొదటి ప్రాధాన్యత ఇస్తారు కానీ తమ సొంత ఆరోగ్యం గురించి నిర్లక్ష్యం చేస్తారు. డాక్టర్ పద్మిని ఈ విషయాన్ని గుర్తు చేస్తూ తల్లి పాలిచ్చే సమయంలో తల్లి ఏం తింటుందో చూడటం కూడా అంతే ముఖ్యమని అన్నారు.
ఆమె మాట్లాడుతూ "తల్లి పాలిచ్చే దశలో పోషకాహారం ప్రాముఖ్యతను చాలా మంచి నిర్లక్ష్యం చేస్తారు. దీనికి కారణం అందరి దృష్టి ఎదుగుతున్న శిశువుపైనే ఉండటం. కానీ తల్లి పాలిచ్చేటప్పుడు, సమతుల్యమైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం. ఇది తల్లి జీవితంలో ఒక కీలకమైన, సున్నితమైన కాలం. తల్లి పాలిచ్చే కాలం తక్కువగా ఉండవచ్చు కానీ ఇది చాలా ప్రత్యేకమైనది. సరైన ఆహారం తల్లికి శక్తిని, ఓర్పును అందిస్తుంది. ఇది ఆమె తన పిల్లలను, కుటుంబాన్ని దీర్ఘకాలికంగా చూసుకోవడానికి సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన ఆహారం శిశువు కోసం తల్లి పాల పోషక విలువలను పెంచుతుంది. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు తల్లి పాల ఉత్పత్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయి." అన్నారు.
మీ ఆహారం ఇనుము, జింక్, మెగ్నీషియం, విటమిన్ డి, విటమిన్ ఇ, ఫోలిక్ యాసిడ్ నిండి ఉండేలా తీర్చేలా చూసుకోండి.
కెఫిన్ లేని ద్రవాలు ఎక్కువగా తాగాలి.
రోజుకు కనీసం 2–3 లీటర్ల నీరు క్రమం తప్పకుండా తీసుకోవాలి.