రేపే మదర్స్ డే అమ్మ కోసం మీ రోజును ఇలా ప్రత్యేకంగా ప్లాన్ చేసుకోండి, అమ్మ చాలా సంతోషిస్తుంది!-a comprehensive guide to celebrate mothers day making may 11th truly special for mom ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  రేపే మదర్స్ డే అమ్మ కోసం మీ రోజును ఇలా ప్రత్యేకంగా ప్లాన్ చేసుకోండి, అమ్మ చాలా సంతోషిస్తుంది!

రేపే మదర్స్ డే అమ్మ కోసం మీ రోజును ఇలా ప్రత్యేకంగా ప్లాన్ చేసుకోండి, అమ్మ చాలా సంతోషిస్తుంది!

Ramya Sri Marka HT Telugu

మదర్స్ డే 2025 స్పెషల్: మదర్స్ డే వచ్చేస్తోంది. తల్లుల నిస్వార్థ సేవకు కృతజ్ఞతలు తెలియజేసేందుకు ఈ రోజును జరుపుకుంటారు. ఈ రోజున అమ్మను ఇంప్రెస్ చేయడం కోసం ఇప్పటివరకూ మీరు ఏం ప్లాన్ చేయకపోతే ఈ టిప్స్ మీ కోసమే. అమ్మను సంతోషపెట్టడం కోసం మీరు రోజంతా ఏమేం చేయచ్చో ఇక్కడుంది.

మదర్స్ డే రోజున అమ్మను ఇంప్రెస్ చేయడం ఎలా?

మదర్స్ డే వేడుకలను జరుపుకునేందుకు ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఈ ప్రత్యేకమైన రోజు మహిళలందరికీ, ముఖ్యంగా తల్లులకు ఎంతో ప్రాముఖ్యమైనది. పిల్లలను కనిపెంచి, పోషించి, ఎనలేని ప్రేమతో వారి జీవితాలకు వెలుగునిచ్చిన తల్లులందరినీ గౌరవించుకోవడానికి, వారికి కృతజ్ఞతలు తెలియజేయడానికి ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఈ మదర్స్ డేను జరుపుకుంటారు. ఈ సంవత్సరం మే 11 ఆదివారం నాడు మదర్స్ డే జరుపుకుంటున్నారు.

ఒక బిడ్డకు తల్లే మొదటి గురువు, జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాలును ఎదుర్కోవడానికి ఆమె ధైర్యాన్నిస్తుంది. అంతేకాదు తల్లి తన పిల్లలకు ఒక మంచి స్నేహితురాలిగా కూడా ఉంటుంది, వారి సంతోషంలో పాలుపంచుకుంటుంది, కష్టాల్లో ఓదారుస్తుంది. అలాంటి తల్లి కోసం మదర్స్ డే సందర్భంగా పిల్లలు ఏదో ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని లేదా బహుమతులను ప్లాన్ చేయడానికి ప్రయత్నిస్తారు. మీరు కూడా ఈ సంవత్సరం మీ అమ్మగారి కోసం మదర్స్ డేను మరింత ప్రత్యేకంగా చేసుకోవాలనుకుంటే, దాని కోసం ఇప్పటి వరకూ ఏం ప్లాన్ చేయకపోతే ఇది మీకోసమే. మదర్స్ డే సందర్భంగా మీ రోజును ఎలా ప్లాన్ చేసుకోవచ్చో ఉదయం నుంచి సాయంత్రం వరకూ అమ్మను ఇంప్రెస్ చేసేందుకు ఏమేం చేయచ్చో ఇక్కడ ఉంది. ప్లాన్ నచ్చితే ఫాలో అయిపోండి..

పువ్వులిచ్చి మదర్స్ డే శుభాకాంక్షలు చెప్పండి:

ప్రతి రోజు అందరికన్నా ముందు లేచి అన్నీ సిద్ధం చేసేది అమ్మ. అయితే మదర్స్ డే రోజున అమ్మ కన్నా ముందు మీరే నిద్రలేచి ఆమెను లేపండి. అమ్మకు నచ్చిన పువ్వులిచ్చి డే శుభాకాంక్షలు తెలియజేయండి. వీలైతే అమ్మ కోసం మంచి టీ లేదా కాఫీ చేసి ఇవ్వండి.

అమ్మ కోసం వంట చేయండి:

మదర్స్ డే రోజున అమ్మ కోసం ప్రత్యేకమైన బ్రేక్ ఫాస్ట్ ప్లాన్ చేయండి. మీ చేతులతో ఏదైనా తయారు చేయడానికి ప్రయత్నించండి. చిన్న చిన్న వంటకాలు అయినా సరే ఆరోగ్యకరమైనవి అయి ఉండేలా అమ్మకు నచ్చినవి అయి ఉండేలా ప్లాన్ చేయండి.

మధ్యాహ్నం అమ్మను మురిపించండి:

మదర్స్ డే రోజున మీ అమ్మకు మీ ప్రేమను తెలియజేయడానికి ఆమెకు హాయినిచ్చేలా మసాజ్, ఫేషియల్, పెడిక్యూర్, మానిక్యూర్ వంటివి చేయడం లేదా చేయించడం వంటివి చేయండి. ఇలా చేయడం వల్ల మీ అమ్మ చాలా స్పెషల్‌గా ఫీలవుతుంది. అలాగే బయట మంచి రెస్టారెంట్‌లో కలిసి భోజనం చేయండి.

బహుమతితో మెప్పించండి:

బయటికి చెప్పుకోకపోయిన బహుమతులు అందరికీ ఇష్టం. కాబట్టి మదర్స్ డే సందర్భంగా మీ అమ్మకు ఏమి ఇష్టమో మీకు తెలిస్తే ఆమెకు నచ్చే మంచి గిఫ్ట్ ఆర్డర్ చేసి సర్‌ప్రైజ్ చేయండి. ఇది కేక్, నగలు, హ్యాండ్‌బ్యాగ్ లేదా మరేదైనా కావచ్చు. పెద్దదో చిన్నదో ఈ రోజున అమ్మకు ఇవ్వడం వల్ల ప్రత్యేకంగా నిలుస్తుంది. మదర్స్ డే రోజున ప్రేమకు చిహ్నంగా మీ అమ్మకు గుర్తుంటుంది.

సాయంత్రాన్ని చిరస్మరణీయంగా చేసుకోండి:

అమ్మను ఇంప్రెస్ చేయాలంటే చాలా మందిని పిలిచి పార్టీ చేయవలసిన అవసరం లేదు. మదర్స్ డేని ప్రత్యేకంగా చేసుకోవడానికి ఇంట్లో ఉన్నవారితో అద్భుతమైన సాయంత్రం గడపండి. దీని కోసం కొద్దిగా అలంకరణ చేసి, రుచికరమైన స్నాక్స్ తయారు చేయండి లేదా ఆర్డర్ చేయండి. పాటలు పెట్టి డ్యాన్స్ చేయడంతో పాటు కొన్ని ఆటలు ఆడండి. అలాగే మీ అమ్మకు ఇష్టమైన సినిమాను అంతా కలిసి చూడండి. మదర్స్ డేని మరింత ప్రత్యేకంగా చేసుకోవడానికి అమ్మ చేత కేక్ కట్ చేయించండి.

రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.