వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమేనని నిరూపిస్తోంది చైనాకు చెందిన 92 ఏళ్ల లీ అనే బామ్మ. హునాన్ ప్రావిన్స్‌కు చెందిన ఈ బామ్మ తన కఠినమైన వ్యాయామ దినచర్యతో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. రోజుకు 200 పుష్-అప్‌లు, 100 సిట్-అప్‌లతో ఆమె ఫిట్‌నెస్ రహస్యం చాలా మందికి స్ఫూర్తినిస్తోంది.
లీ తన ఉదయం పూట చేసే వ్యాయామ దినచర్యలో భాగంగా 200 పుష్-అప్‌లు, 100 సిట్-అప్‌లు మాత్రమే కాకుండా, హులా-హూప్ కూడా తిప్పుతుంది. క్రమశిక్షణ, ఆటవిడుపు, సహజమైన పద్ధతులతో లీ తన శారీరక, మానసిక ఆరోగ్యం పట్ల సీనియర్ సిటిజెన్లు ఎలా ఉండాలనే దానిపై కొత్త ఆలోచనలకు నాంది పలుకుతోంది. 92 ఏళ్ల బామ్మ 30 ఏళ్ల వారి కంటే ఎలా ఫిట్‌గా ఉంటుందో తెలుసుకుందాం.
'సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్' ప్రకారం, తొంభైలలో ఉన్న లీ, ఇరవైలు లేదా ముప్పైలలో ఉన్న చాలా మందికి కూడా కష్టంగా అనిపించే వ్యాయామాలు చేస్తుంది. ఆమె రోజువారీ దినచర్యలో ఉండే వ్యాయామం ఇదీ..
తన పుష్-అప్ చేసే పద్ధతి పరిపూర్ణంగా ఉండకపోవచ్చని లీ ఒప్పుకుంది. కానీ క్రమశిక్షణే తన విజయ రహస్యం అంటుంది. "నేను పుష్-అప్‌లు చేసే పద్ధతి సరిగా లేకపోవచ్చు. కానీ రోజుకు 200 కంటే తక్కువ చేయడం నాకు ఇష్టం లేదు" అని ఆమె గట్టిగా చెప్పింది.
హునాన్‌లోని జియాంగ్‌హువా యావో అటానమస్ కౌంటీలో నివసించే లీకి వర్షం తరచుగా కురవడం వల్ల బయట కార్యకలాపాలు పరిమితంగా ఉంటాయి. దీంతో ఆమె తన వ్యాయామాలను ఇంట్లోనే చేసుకునేలా మార్చుకుంది. ఆమె ఇంట్లో చేసే వ్యాయామాలలో ఇవీ..
లీ ఆరోగ్య నియమాలు కేవలం వ్యాయామంతో ఆగవు. ఆమె రాత్రిపూట కాళ్లు, పాదాలను గోరువెచ్చని నీటిలో ఉంచుతూ ఒకప్పుడు తనను వేధించిన కండరాల తిమ్మిర్లను తగ్గించుకున్నట్టు చెబుతోంది. "నాకు ఒకప్పుడు కాళ్ళలో తిమ్మిర్లు వచ్చేవి. కానీ కాళ్ల స్నానం చేయడం ప్రారంభించిన తర్వాత అవి మళ్లీ రాలేదు" అని ఆమె పంచుకుంది. ఆశ్చర్యకరంగా లీ తన క్రమశిక్షణతో కూడిన జీవనశైలి వల్ల మరో అద్భుతమైన ప్రయోజనాన్ని కూడా గమనించింది. ఒకప్పుడు పూర్తిగా తెల్లగా ఉన్న ఆమె జుట్టు మళ్లీ సహజమైన నలుపు రంగును సంతరించుకోవడం ప్రారంభించింది.