Need More Sleep Signs : మీకు నిద్ర మరింత అవసరం అని చెప్పే 7 సంకేతాలు
Sleeping Tips : మనిషికి నిద్ర అనేది చాలా ముఖ్యమైనది. సరైన నిద్రలేకుంటే రోజంతా అలసటగా ఉంటుంది. ఏ పని సరిగా చేయలేరు. మీకు తగినంత నిద్రలేదు అని చెప్పేందుకు కొన్ని సంకేతాలు ఉంటాయి. అవేంటో చూడండి.
నిద్రలేకుంటే చాలా ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. దీంతో శరీరం మెుత్తం డీలా పడిపోతుంది. రోజూ సరైన నిద్ర అవసరం. నిద్రలేకుంటే చాలా ఇబ్బందులు చూస్తారు. జ్ఞాపకశక్తి మందగిస్తుంది. పనిపై ప్రభావం పడుతుంది. నిద్రలేక రాత్రంతా మంచంపై దొర్లుతూ ఉండేవారు మనలో చాలా మందే ఉన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా నిద్ర సరిగా రాదు. సమయానికి పడుకున్నా.. నిద్ర రాదు. దాదాపు సగం రాత్రి నిద్రదేవత కోసం కళ్లు కాయలు కాసేలా చూస్తుంటాం. తగినంత నిద్ర లేకపోవడం వల్ల, శరీరం అలసిపోతుంది. బలహీనమవుతుంది. నిద్రలేమికి సంబంధించిన వ్యాధులు శరీరంలో అనేకం అవుతాయి.

నిజానికి పెద్దలకు రాత్రికి ఏడెనిమిది గంటల నిద్రపోతే మంచిది. తగినంత నిద్ర లేకపోవడం ఆరోగ్యం, శరీర పనితీరుపై తీవ్రమైన ప్రభావాలను చూపుతుంది. మీరు కింద చెప్పుకొనే లక్షణాలు అనుభవిస్తే.. మీకు మరింత నిద్ర అవసరమని గుర్తుంచుకోవాలి.
తగినంత నిద్ర పొందడం వలన మీరు అలారం లేకుండా సమయానికి మేల్కొంటారు. నిద్ర లేవడానికి ముందు స్నూజ్ బటన్‌ను పదే పదే నొక్కితే అది తగినంత లేదా నిద్ర లేకపోవడానికి స్పష్టమైన సంకేతం. మీరు ఎంత లేవాలి అనుకున్నా లేవలేరు. కాసేపు పడుకుందాంలేనని నిర్లక్ష్యంతో ఉంటారు. ఇది రోజూవారీ దినచర్యపై ప్రభావం చూపిస్తుంది.
శరీరం అలసిపోయినా లేదా నిద్ర లేకపోయినా, ఏదైనా పని చేస్తున్నప్పుడు వణుకు లేదా మగతగా అనిపిస్తుంది. ఒకానొక సమయంలో మీరు కూడా నిద్రపోవచ్చు. చాలా మంది రాత్రుళ్లు నిద్ర సరిగా పోక.. ఆఫీసులో అలసటతో ఉంటారు. దీని ప్రభావం పనిపై పడుతుంది. ఫలితంగా బాస్ నుంచి ఛివాట్లు తినాల్సి వస్తుంది.
ఉదయాన్నే కళ్లు తెరిచి ఒక కప్పు బెడ్ టీ లేదా కప్పు కాఫీ సిప్ చేయడం చాలామందికి అలవాటు. అయితే శరీరానికి శక్తిని చేకూర్చేందుకు, మెలకువగా ఉండేందుకు రోజంతా టీ, కాఫీలు తాగడం అస్సలు చేయకూడదు. అదీకాక నిద్ర సరిగా పట్టకపోతే వేపుడు, జంక్ ఫుడ్ తినాలనిపిస్తుంది. టీలు, కాఫీలు అతిగా తాగాలి అనిపిస్తుంది. ఇవన్నీ నిద్రలేమికి కారణాలు. అందుకే నిద్ర సరిగా పోతే శరీరాన్ని పాడు చేసే అలవాట్లను దూరం చేసుకోవచ్చు.
శరీరం అలసిపోయినా, నిద్ర సరిగా లేకుంటే ఏ పని మీదా దృష్టి పెట్టలేక ఏకాగ్రత తక్కు అవుతుంది. పనిలో తప్పులు పునరావృతమవుతాయి. మీరు సులభంగా గందరగోళానికి గురవుతారు. అలాగే, నిద్ర లేకపోవడం జ్ఞాపకశక్తిపై చెడు ప్రభావం చూపుతుంది. పని చేసినా సరిగా చేయలేరు. ఏకాగ్రత అస్సలు కుదరదు.
శరీరం అలసిపోయినా లేదా తగినంత నిద్ర లేకపోయినా మానసిక స్థితి సరిగా ఉండదు. ఫలితంగా, మీరు నిరాశ, ఆత్రుత లేదా నిరాశకు గురయ్యే అవకాశం ఉంది. చాలామంది నిద్ర సరిగా లేక ఆందోళనకు గురవుతూ ఉంటారు. ఇది మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది.
తగినంత నిద్ర లేకపోతే, శరీరం బలహీనంగా మారుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. దీని వల్ల శరీరం ఏ వ్యాధితోనూ పోరాడదు. మీరు ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనితో మానసికంగానూ, శరీరకంగానూ కుంగిపోతారు.
నిద్రలేనివారిలో తరచూ చూసే అసలు సమస్య కోపం. చాలా మంది నిద్రసరిగా లేక అవతలి వారి మీద కోపం చూపిస్తుంటారు. చీటికిమాటికి చిరాకు పడుతుంటారు. ఆఫీసులో ఇలా చేస్తే పనిపై ప్రభావం పడుతుంది. మీకు తగినంత నిద్ర ఉంటే కోపం అనేది రాదు. పైన చెప్పిన కారణాలన్నీ నిద్ర సరిగాలేకుంటే వచ్చే సమస్యలు. అందుకే తగినంద నిద్రపోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.