Chanakya Niti : భర్తకు ఇబ్బందులు కలిగించే భార్య అలవాట్లు ఇవే
Chanakya Niti On Wife : చాణక్యుడు తన చాణక్య నీతిలో వివాహ బంధం గురించి చాలా విషయాలు చెప్పాడు. భార్యకు ఉంటే అలవాట్లతో భర్త జీవితం ఎలా నాశనం అవుతుందో వివరించాడు.
వివాహం అనేది పవిత్రమైన సంబంధం. వివాహం తరువాత స్త్రీ తన భర్త, కుటుంబం ఆనందానికి బాధ్యత వహిస్తుందని చాణక్యుడు చెప్పాడు. భార్య ఇంటికి కోడలిగా మాత్రమే రాకూడదు, ఆమె కుటుంబానికి వెన్నెముక అవుతుంది. భార్యాభర్తల సంబంధం బలంగా ఉంటేనే కుటుంబం బాగుంటుంది. పెళ్లయిన స్త్రీ ప్రతి పనిని చాలా జాగ్రత్తగా చేయాలి. భార్య సత్ప్రవర్తన కలిగి ఉంటే, ఆమె చెడు స్వభావం ఉన్న వ్యక్తిని కూడా మార్చగలదు. తన భర్త వైఫల్యాలను విజయంగా మార్చే శక్తి భార్యకు ఉందని నమ్ముతారు.
భార్య ప్రవర్తన వింతంగా ఉంటే కుటుంబంలోని ప్రతి సభ్యుడు దాని పర్యవసానాలను ఎదుర్కోవలసి వస్తుందని చాణక్య నీతి చెబుతుంది. భర్త కూడా జీవితంలో ఆనందాన్ని అనుభవించలేడు. కుటుంబంలో భార్య పాత్ర సరిగా లేకుంటే.. చాలా కష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది. చాణక్యుడు భార్యకు ఉండే 6 అలవాట్లతో కుటుంబ జీవితం నాశనం అవుతుందని చెప్పాడు.
మాటలు అదుపులో లేకపోవడం
చాణక్యనీతి ప్రకారం భార్య తన మాటలను అదుపు చేసుకోకుండా, చాలా కఠినమైన పదాలను ఉపయోగిస్తే తన భర్తకు హాని కలిగిస్తుంది. అలాంటి భార్యతో ఎన్ని రోజులు ఉన్న మీకు ఇబ్బందులే. అలాంటి స్త్రీ మీ కుటుంబానికి హాని కలిగిస్తుంది. అలాంటి స్త్రీలు ఇతరుల భావాలను పట్టించుకోరు. ఇతరులు కూడా మీకు దూరమవుతారు. బంధువులలో మీరు తక్కువైపోతారు.
అతిగా కోపం
కోపం మానవ సహజం. ఒకరి ప్రవర్తన కోపంగా ఉన్నప్పుడు తన చుట్టూ ఉన్న వ్యక్తులకు జీవితాన్ని కష్టతరం చేస్తారు. అందుకే నీకూ, నీ కుటుంబానికీ సంతోషం ఉండాలంటే భార్య కోపం తగ్గించుకోవాలి. కోపంలో ఉన్న భార్యతో భర్త అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాడు.
గొడవలు సృష్టించే భార్య
ఇంట్లో గొడవలు సృష్టించే భార్యతో జీవించడం ఎప్పుడూ సుఖంగా ఉండదు. ఇలాంటి భార్య ప్రవర్తన పరిణామాలను మొత్తం తరం అనుభవించవలసి ఉంటుంది. అలాంటి స్త్రీలు తమ పిల్లలకు మంచి లక్షణాలను నేర్పించలేరు. కుటంబంలో చీలికలు తీసుకొస్తారు. వ్యక్తిగతంగానూ నష్టపోతారు.
అబద్ధాలు చెప్పే భార్యతో సమస్యలు
చాణక్య నీతి ప్రకారం కొంతమంది మహిళలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం అబద్ధాలు చెబుతారు. చాణక్యుడు ప్రకారం, ఈ అలవాటు చిన్నప్పటి నుండి వారికి అలవడుతుంది. కొన్ని పరిస్థితులను నివారించడానికి మహిళలు అబద్ధాలు చెప్పడానికి వెనుకాడరు. అలాంటి మహిళలు కూడా ద్రోహం చేస్తారు. భర్తకు కొన్నిసార్లు అన్యాయం చేస్తారు.
మోసం చేసే స్త్రీలు
కొందరు స్త్రీలు మోసం చేయడంలో తెలివి చూపిస్తారని చాణక్య నీతి చెబుతోంది. చాణక్యుడు ప్రకారం తమ స్వార్థపూరిత కారణాల కోసం ఇతరులను మోసం చేసేందుకు కొందరు ప్రణాళికలు వేస్తారు. మీకు, మీ కుటుంబానికి ఆనందం కావాలంటే అలాంటి స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి.
డబ్బుపై అత్యాశ
ఎక్కువ డబ్బు సంపాదించాలనే కోరిక కూడా మహిళల్లో బలంగా ఉంటుంది. డబ్బు, ఆభరణాలు, బట్టలు మొదలైన వాటితో వారి మనస్సు ఎప్పుడూ సంతృప్తి చెందదు. అయితే డబ్బు కోసం తప్పుడు దారుల్లో వెళితే చాలా ఇబ్బందులు వస్తాయి. కుటుంబ భవిష్యత్ సమస్యలో పడుతుందని చాణక్య నీతి చెబుతుంది.