Relationship Is Over । మీ మధ్య ఈ సంకేతాలు గమనిస్తే.. మీ బంధం ముగింపుకు వచ్చిందని అర్థం!-5 signs that says your relationship is over
Telugu News  /  Lifestyle  /  5 Signs That Says Your Relationship Is Over
Relationship Is Over
Relationship Is Over (Pexels)

Relationship Is Over । మీ మధ్య ఈ సంకేతాలు గమనిస్తే.. మీ బంధం ముగింపుకు వచ్చిందని అర్థం!

25 May 2023, 20:20 ISTHT Telugu Desk
25 May 2023, 20:20 IST

Relationship Is Over: సంబంధాలు అనేవి చాలా సున్నితమైనవి మీ బంధం ముగింపుకు వచ్చింది అని చెప్పటానికి కొన్ని సంకేతాలు ఉంటాయి, అవి ఇక్కడ తెలుసుకోండి.

Relationship Is Over: సంబంధాలు అనేవి చాలా సున్నితమైనవి, వాటిని చాలా జాగ్రత్తగా చూసుకున్నప్పుడే అవి పదిలంగా ఉంటాయి. చిన్నమాట కూడా బల్లెంపోటులా మారి బంధాలను విచ్ఛిన్నం చేయవచ్చు. జరిగిన నష్టం తర్వాత బాధపడటం, చింతించడం తప్ప ఏమీ మిగలదు.

ఏ సంబంధమైన దానికదే చెడిపోదు, అందులో మరొకరి ప్రమేయం కచ్చితంగా ఉంటుంది. అనేక అంశాలు ముడిపడి ఉంటాయి. పగిలిన అద్దాన్ని మళ్ళీ అతికించనట్లే, ఒకసారి విరిగిన మనసును మళ్లీ బాగు చేయలేం. మీ బంధం ముగింపుకు వచ్చింది అని చెప్పటానికి కొన్ని సంకేతాలు ఉంటాయి, అవి ఇక్కడ తెలుసుకోండి.

కమ్యూనికేషన్ బ్రేక్డౌన్

ఏది మాట్లాడినా వెంటనే కోపంగా ప్రతిస్పందించడం, సంభాషణలు వాడివేడిగా సాగటం, మాటామాటా అనుకోవడం, మాటల్లో నిజాయితీ కొరవరడం ఇవన్నీ వారి మధ్య సరైన కమ్యూనికేషన్ లేదని సూచిస్తాయి. వాగ్వివాదం జరుగుతుందంటే ఇద్దరి మధ్య భావోద్వేగ సంబంధం కోల్పోయిందని సూచిస్తుంది. సమర్థవంతమైన కమ్యూనికేషన్ లేకపోవడం, అపార్థాలు, ఆగ్రహాలు వంటివి భాగస్వాముల మధ్య దూరం పెరగడానికి దారితీస్తుంది. కమ్యూనికేషన్ చెడిపోయిందంటే బంధం ముగింపుకు వచ్చిందని అర్థం.

నిరంతరమైన సంఘర్షణ

ఇద్దరి మధ్య విభేదాలు పెరిగిపోవడం, పగ ప్రతీకారాలతో రగిలిపోవడం, అపరిషృత సమస్యలు, ఇకదాని తర్వాత మరొక చిక్కుముడులతో నిరంతరమైన సంఘర్షణ కొనసాగించడం జరిగితే, ఆ సంబంధం పునాదినే క్షీణింపజేసినట్లు సూచించవచ్చు. ప్రతికూల భావనలు విషపూరిత వాతావరణాన్ని సృష్టించగలదు, ఇద్దరు భాగస్వాములు ఆనందం అనుభవించకుండా నిరోధించవచ్చు.

ఎమోషనల్ డిస్‌కనెక్ట్

ఇద్దరికి సంబంధించిన జ్ఞాపకాలు, కలలు, ఆకాంక్షలు ఇకపై అదే ప్రాముఖ్యతను కలిగి ఉండని పక్షంలో వారి మధ్య భావోద్వేగ విచ్ఛేదం జరిగిందని అర్థం. ఇటువంటి సందర్భంలో ఇద్దరికీ ఒకరిపై ఒకరికి ఎలాంటి ఎమోషనల్ ఫీలింగ్స్ ఉండవు. సంబంధం దాని కనెక్షన్ కోల్పోయిందని చెప్పడానికి ఇది ముఖ్యమైన సూచిక. ఇద్దరూ ఒకేచోట ఉన్నప్పతికీ ఒంటరితనం , అసంతృప్తి ఉంటాయి.

సాన్నిహిత్యం లేకపోవడం

ఇద్దరి మధ్య ప్రేమతో కూడిన శారీరక బంధం, మనసుతో మాట్లాడే అవకాశం లేని సందర్భంలో వారి మధ్య సాన్నిహిత్యం అనేది ఉండదు. సాన్నిహిత్యం లేనపుడు ఆప్యాయత, అనురాగాలు క్షీణిస్తాయి. దూరం పెరిగిపోతుంది. ఇది బంధం కొనసాగించలేని పరిస్థితికి సూచన.

నమ్మకం కోల్పోవడం

ఏదైనా సంబంధానికి నిలనడటానికి నమ్మకమే మూలస్తంభం. నమ్మకం లేనిచోట ప్రేమ ఉండదు, ప్రేమలేని చోట బంధం నిలవదు. పదేపదే నమ్మకం విచ్ఛిన్నమైతే లేదా పూర్తిగా విచ్ఛిన్నమైతే, ఆ నమ్మకాన్ని తిరిగి నిర్మించడం సవాలుతో కూడుకున్న పని. విశ్వాసం కోల్పోయినపుడు అభద్రత, అనుమానం, సందేహాల పెరుగుతాయి. ఇది సంబంధం పునాదిని నాశనం చేస్తుంది.

సంబంధిత కథనం