Natural Mosquito Repellents : ఈ 4 మెుక్కలు ఇంట్లోకి ఒక్క దోమను కూడా రానివ్వవు!
Naturally Repel Mosquitoes : దోమలతో అనేక రోగాలు వస్తాయి. వీటిని తరమికొట్టేందుకు మార్కెట్లో దొరికే ఉత్పత్తులను ఉపయోగిస్తుంటాం. ఇంటి చుట్టూ కొన్ని రకాల మెుక్కలను పెంచుకుంటే దోమల బెడద ఉండదు.
దోమలు రాకుండా ఉండేందుకు ఎంత ప్రయత్నం చేసినా ఎలా వస్తాయి? అనే ప్రశ్న మీలో ఎప్పుడైనా తలెత్తిందా? దోమలు రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. మనుషులు ఉన్న చోటుకు వచ్చేందుకు కూడా చాలా కారణాలు ఉన్నాయి. శరీర చెమట, ధూళి లేదా పాదాల వాసనతో సహా మానవ శరీరం నుండి ఒక నిర్దిష్ట వాయువు విడుదల అవుతుంది. ఆ వాసనకు దోమలు వచ్చి మనల్ని కుడతాయి. 100 అడుగుల దూరంలో ఉన్నా.. వాసన పసిగట్టి వస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
దోమలు పొట్ట నింపుకొనేందుకు మనల్ని కుడుతూ రోగాలను కూడా తెచ్చిపెడుతుంది. దోమలు అనేక ప్రాణాంతక వ్యాధులను కలిగిస్తాయి. అందుకే దోమలను చంపి తరిమికొట్టేందుకు మార్కెట్‌లో ఎన్నో ఉత్పత్తులు ఉన్నాయి. కానీ ఇది రసాయనలతో తయారై ఉంటాయి. శరీరానికి ముప్పుగా మారుతుంది. ఇంట్లోకి దోమలు రాకుండా సహజసిద్ధంగా ఏం చేయాలో తెలుసుకుందాం. కొన్ని రకలా మెుక్కలను పెంచితే చాలు.
ఏడాది పొడవునా బంతి పువ్వులు పూస్తాయి. ఈ మొక్క పువ్వులు దోమలను తరిమికొడతాయి. వాతావరణ మార్పులతో వచ్చే దోమలను నివారించడానికి ఈ మొక్కను ఆరుబయట లేదా బాల్కనీలో పెంచవచ్చు. ఈ మొక్క ఎక్కడైనా సులభంగా పెరుగుతుంది. బంతి మెుక్క దోమలను తరిమికొట్టడమే కాకుండా దాని పువ్వులను పూజకు కూడా ఉపయోగించవచ్చు. ఈ మొక్క నుండి వచ్చే పైరేత్రమ్, సపోనిన్ లాంటి వాటితో మీ ఇంటి నుండి దోమలను దూరంగా ఉంచుతాయి.
తులసి మొక్క అనేక ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందింది. దోమలను తరిమికొడుతుంది. దాని నుండి వచ్చే వాసన కారణంగా, మొక్క చుట్టూ దోమ కూడా రాకుండా ఉంటుంది. మీరు దానిని స్ప్రే చేసి మీ చేతులకు, కాళ్ళకు పూస్తే దోమ మిమ్మల్ని కుట్టదు. కొన్ని తులసి ఆకులతో రెండు గ్లాసుల నీటిని మరిగించండి. చల్లారిన తర్వాత స్ప్రే బాటిల్‌లో పోసి, సాయంత్రం బయటకు వెళ్లినప్పుడల్లా చేతులు, మెడ, కాళ్లపై స్ప్రే చేయాలి. ఇది మీ చుట్టూ ఉన్న దోమలను నియంత్రిస్తుంది.
లావెండర్ మంచి వాసన ఉంటుంది. దీని పూలు చాలా అందంగా ఉంటాయి. ఇది అరోమాథెరపీ, మూలికా ఔషధాలలో ఉపయోగిస్తారు. ఈ మొక్కలు ఈగలు, దోమలు, సాలెపురుగులు, చీమలను తిప్పికొట్టడానికి పని చేస్తాయి. దోమ కాటు వల్ల కలిగే దురదకు ఇది హెర్బల్ రెమెడీగా కూడా పనిచేస్తుంది. కావాలనుకుంటే, మొక్క యొక్క ఆకులను తీసుకొని నేరుగా చర్మానికి పూయవచ్చు. ఆకుల నుండి విడుదలయ్యే నూనె కీటకాల నుండి రక్షణను అందిస్తుంది. మీ ఇంట్లో పెంచుకుంటే దోమల బెడద తగ్గించుకోవచ్చు.
రోజ్మేరీ మెుక్క ఇది ఒక సుగంధ మొక్క. దీని సూదిలాంటి, సన్నగా, కోణాల ఆకులు చాలా అందంగా ఉంటాయి. ఈ మొక్క కాండం వాసన దోమలను తరిమికొడుతుంది. ఈ మొక్క తెలుపు, నీలం పువ్వులను కలిగి ఉంటుంది. ఇది నూనె రూపంలో కూడా అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. మీరు దానిని కొని మీ శరీరంపై రుద్దవచ్చు. ఈ మెుక్కను ఇంట్లో పెంచుకుంటే ఫలితం ఉంటుంది.