Majjiga Types : 3 రకాల రుచులతో మజ్జిగ.. ఈ వేసవిలో ట్రై చేయండి-3 types of majjiga know how to make butter milk with different types ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Majjiga Types : 3 రకాల రుచులతో మజ్జిగ.. ఈ వేసవిలో ట్రై చేయండి

Majjiga Types : 3 రకాల రుచులతో మజ్జిగ.. ఈ వేసవిలో ట్రై చేయండి

Anand Sai HT Telugu
Feb 26, 2024 04:00 PM IST

Majjiga Types : వేసవిలో మజ్జిగ తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే ఎప్పుడూ ఒకేలాగా కాకుండా కాస్త కొత్తగా ట్రై చేయండి.

మజ్జిగ రకాలు
మజ్జిగ రకాలు (Unsplash)

వేసవిలో రోజుకు ఒక గ్లాసు మజ్జిగ లేదా రెండు పూటలా తీసుకుంటే బాగుంటుంది. ఈ మజ్జిగను అనేక రుచుల్లో తయారు చేసుకోవచ్చు. మజ్జిగ తాగితే ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుంది. అయితే మజ్జిగను చేసే విధానం కూడా దాని రుచిని మారుస్తుంది. 3 రకాల మజ్జిగలు ఎలా చేయాలో తెలుసుకుందాం..

మజ్జిగను అనేక విధాలుగా తయారు చేయవచ్చు, కొంతమంది పాలలో వెనిగర్ లేదా నిమ్మరసం కలిపి మజ్జిగ తయారు చేస్తారు. కానీ ఈ విధంగా తయారుచేసిన మజ్జిగలో క్రీమ్ ఉంటుంది. భారతదేశంలో క్రీమ్ తొలగించి మజ్జిగ చేసే సంప్రదాయ పద్ధతి ఉంది. ఇది ఉత్తమమైనది. కూలింగ్ కూడా అందిస్తుంది.

టైప్ 1 మజ్జిగ తయారీ విధానం

2 కప్పుల పెరుగు, 2 కప్పుల నీరు, నల్ల ఉప్పు, వేయించిన జీలకర్ర పొడి 2 టేబుల్ స్పూన్లు, 1 తరిగిన పచ్చిమిర్చి, కావాలనుకుంటే కొన్ని కొత్తిమీర ఆకులు తీసుకోవాలి.

గట్టి పెరుగును గిన్నెలో వేసి నీళ్లు పోసి చేత్తో చేసుకోవచ్చు. ఇప్పుడు కొందరు మిక్సీలో కూడా తయారు చేస్తున్నారు. ఇప్పుడు ఈ మజ్జిగ నీళ్లలో జీలకర్ర పొడి, నల్ల ఉప్పు, కొత్తిమీర తరుగు వేసి కలిపితే మజ్జిగ రెడీ.

టైప్ 2 మజ్జిగ

1 టేబుల్ స్పూన్ తాజా నిమ్మరసం లేదా తెలుపు వెనిగర్ తీసుకోవాలి. 2 కప్పుల పెరుగు, కొత్తిమీర 1 అంగుళం అల్లం, ఉప్పు, నీరు పెట్టుకోవాలి. ఈ పదార్థాలన్నీ మిక్సీలో వేసి రెండు రౌండ్లు తిప్పితే అల్లం మజ్జిగ రెడీ.

టైప్ 3 మజ్జిగ

1 కప్పు పెరుగు, 2 పుదీనా ఆకులు, 1 అంగుళం అల్లం, 1/2 tsp ధనియాలు, కొత్తిమీర తీసుకోవాలి. మీరు మొదట పెరుగు, అల్లం, వేసి మెత్తగా చేయాలి. ఆపై వేయించిన కొత్తిమీర గింజలను జోడించాలి. అంతే మజ్జిగ రెడీ అయినట్టే.

మజ్జిగ ఎంతకాలం ఉపయోగించాలి?

మజ్జిగలో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఎక్కువసేపు అలాగే ఉంచితే పుల్లగా, చేదుగా మారుతుంది. మజ్జిగను ఎక్కువ సేపు వాడకూడదు. మజ్జిగ ఈరోజు చేస్తే రేపటి వరకు వాడుకోవచ్చు. మీరు దీన్ని ఎక్కువ కాలం ఉపయోగించాలనుకుంటే, ఫ్రిజ్‌లో ఉంచవచ్చు. కానీ చాలా రోజులు పెట్టుకుని మాత్రం తాగకూడదు. మజ్జిగ చెడిపోతే వాసన పుల్లగా, దుర్వాసన, రంగు మారుతుంది.

మజ్జిగ ప్రయోజనాలు

మజ్జిగ మజ్జిగ ఎసిడిటీని తగ్గిస్తుంది. దీనిని పెరుగుతో తయారు చేస్తారు.. కడుపులోని ఆమ్లతను తగ్గిస్తుంది. భోజనం తిన్న తర్వాత తరచుగా యాసిడ్ రిఫ్లక్స్‌ను అనుభవిస్తే మజ్జిగ తాగడం మెుదలుపెట్టండి. భోజనం తర్వాత గ్లాసు మజ్జిగ తాగితే జీర్ణక్రియకు హాయినిచ్చి ఎసిడిటీని తగ్గిస్తుంది. శొంఠి లేదా మిరియాలు వంటివి వేస్తే ప్రయోజనాలు పొందవచ్చు.

మలబద్ధకం, సంబంధిత సమస్యలను నివారించడానికి మజ్జిగ సహజమైన చికిత్స. దీనిలోని అధిక ఫైబర్ కంటెంట్ పేగు కదలికలకు సహాయపడుతుంది. మీ శరీరాన్ని హైడ్రేట్​గా ఉంచడానికి మజ్జిగ సహాయం చేస్తుంది. హైడ్రేట్‌గా లేకుంటే.. డీహైడ్రేషన్ అనారోగ్య సమస్యలను, అసౌకర్యాన్ని కలిగిస్తుంది. అధిక ఎలక్ట్రోలైట్ కంటెంట్ కారణంగా మజ్జిగ మీ శరీరంలో నీటిని కోల్పోకుండా ఆపుతుంది.