2022 Maruti Suzuki S-Presso । మైరుగైన మైలేజ్, అదనపు ఫీచర్లతో మినీ SUV విడుదల!-2022 maruti suzuki s presso mini suv launched at rs 4 25 lakh ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  2022 Maruti Suzuki S-presso Mini Suv Launched At Rs. 4.25 Lakh

2022 Maruti Suzuki S-Presso । మైరుగైన మైలేజ్, అదనపు ఫీచర్లతో మినీ SUV విడుదల!

HT Telugu Desk HT Telugu
Jul 18, 2022 01:06 PM IST

సేల్స్ పడిపోతుండటంతో మారుతి సుజుకి తమ మినీ SUV ప్రెస్సోను అప్‌డేట్ చేసింది. ఇంజన్ ఇంకా ఫీచర్లను రీఫైన్ చేసింది. ఇప్పుడు మైలేజ్ పెరుగుతుందని కంపెనీ చెబుతోంది.

2022 Maruti Suzuki S-Presso
2022 Maruti Suzuki S-Presso

కార్ల తయారీదారు మారుతి సుజుకి తమ తమ మైక్రో SUV S-ప్రెస్సోను అప్‌డేట్ చేసింది. పనితీరును మరింత మెరుగుపరుస్తూ సరికొత్త వెర్షన్‌లో 2022 Maruti Suzuki S-Presso వాహనాన్ని విడుదల చేసింది. ఇది మునుపటి వెర్షన్ కంటే 17 శాతం ఎక్కువ మైలేజీని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. కొత్త 2022 మారుతి సుజుకి S-ప్రెస్సో ధర ఎక్స్-షోరూమ్ వద్ద రూ. 4.25 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

ఈ కొత్త మోడల్‌లో మరిన్ని అదనపు ఫీచర్లతో పాటు మరింత ఇంధన-సమర్థవంతమైన పవర్‌ట్రెయిన్‌ను అందిస్తోంది. నెక్ట్స్ జెన్ K-సిరీస్ 1.0L డ్యూయల్ జెట్, ఐడిల్-స్టార్ట్-స్టాప్ టెక్నాలజీతో సరికొత్త S-ప్రెస్సోను విడుదల చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇందులో వివిధ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి.

స్టాండర్డ్ లేదా బేస్ వేరియంట్ Std/Lxi MT లీటరుకు 24.12 కిమీ మైలేజ్ అందిస్తుంది. దీని ధర రూ. 4,25,000 నుంచి రూ. 4,95,000 వరకు ఉంది.

Vxi/Vxi+ MT వేరియంట్ లీటరుకు 24.76 కిమీ మైలేజ్ అందిస్తుంది. దీని ధర రూ. 5,15,000 నుంచి 5,49,000 వరకు ఉంది

టాప్ ఎండ్ Vxi(O)/Vxi+(O) AGS వేరియంట్ లీటరుకు 25.30 కిమీ మైలేజ్ అందిస్తుంది. దీని ధర రూ. 5,65,000 నుంచి 5,99,000 వరకు ఉంది.

వీటిలో Vxi(O) అలాగే Vxi+(O) AGS ఆటోమేటిక్ మోడల్స్ ఈ రెండు వేరియంట్లలో విత్ హిల్ హోల్డ్ అసిస్ట్, ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల ORVMలు (బయటి వైపు ఉండే సైడ్ మిర్రర్లు) స్టాండర్డ్‌గా వస్తున్నాయి.

2022 Maruti Suzuki S-Pressoఫీచర్లు, స్పెసిఫికేషన్లు

సరికొత్త Maruti Suzuki S-Pressoలో అత్యంత సమర్థవంతమైన నెక్ట్స్ జెన్ K-సిరీస్ 1.0L డ్యూయల్ జెట్, ఐడిల్ స్టార్ట్-స్టాప్ టెక్నాలజీతో కూడిన డ్యూయల్ VVT ఇంజిన్‌ను అమర్చారు. ఇది 5500rpm వద్ద 49kW శక్తిని అలాగే 3500rpm వద్ద 89Nmటార్క్‌ను అందిస్తుంది.

ఇంకా డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, ఫ్రంట్ సీట్‌బెల్ట్ రిమైండర్‌తో కూడిన ప్రీ-టెన్షనర్, ఫోర్స్ లిమిటర్ ఫ్రంట్ సీట్‌బెల్ట్‌లు, హై-స్పీడ్ అలర్ట్ సిస్టమ్, అన్ని వేరియంట్‌లలో రివర్స్ పార్కింగ్ సెన్సార్‌లు, హిల్ హోల్డ్ అసిస్ట్‌తో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP) వంటి భద్రతా ఫీచర్లను అందిస్తున్నారు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్