ఓటీటీలోకి ఎప్పటికప్పుడు విభిన్నమైన జోనర్స్‌లో డిఫరెంట్ కంటెంట్‌తో సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుంటాయి. ప్రతివారం సరికొత్త కథనాలతో ఓటీటీ సినిమాలు సందడి చేసేందుకు రెడీ అవుతుంటాయి. అలా, ఈ వారం కూడా ఓ స్పెషల్ మూవీ అలరించేందుకు సిద్ధంగా ఉంది.
ఆ సినిమానే జియామ్. ఇది ఒక సర్వైవల్ హారర్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ. అయితే, ఇది ఒక జాంబీ కాన్సెప్ట్ సినిమా. ఒక వైరస్ వల్ల మనుషులు మరో మనిషిని కిరాతకంగా చంపి తింటారు. ఈ కాన్సెప్ట్‌తో ఇప్పటివరకు ఎన్నో ఓటీటీ సినిమాలు, ఓటీటీ సిరీస్‌లు కుప్పలుతెప్పలుగా వచ్చాయి.
వీటిలో స్టోరీ అన్నింట్లో లాగే సాధారణంగా ఉంటుంది. ఒక అవుట్ బ్రేక్ జరగడం (వైరస్ స్ప్రెడ్ అవడం), దాని నుంచి హీరో లేదా కుటుంబం, తనకు సంబంధించిన వాళ్లను కాపాడుకోవడం వంటి సీన్లతోనే కథ సాగుతుంది. అయితే, వాటిని ఎంత థ్రిల్లింగ్, హారర్, సర్వైవల్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కించామనేదాన్ని బట్టే ఆ సినిమా సక్సెస్ ఆధారపడి ఉంటుంది.
ఇక జియామ్ సినిమా స్టోరీ కూడా దాదాపుగా అలాగే ఉందని ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. ఫైటర్ అయిన హీరో తన గర్ల్‌ఫ్రెండ్‌ను కలవడానికి వెళ్లిన చోట ఓ వైరస్ వ్యాప్తి చెంది మనుషులంతా చనిపోతారు. చనిపోయిన మనుషులు ఇతర మనుషులను అతి ఘోరంగా చంపి తింటుంటారు. వారి నుంచి తన ప్రేయసిని ఆ ఫైటర్ ఎలా కాపాడుకున్నదే జియామ్ స్టోరీ అని ట్రైలర్ చూస్తే అనిపిస్తోంది.
అయితే, జియామ్ టేకింగ్ మాత్రం చాలా కొత్తగా అనిపిస్తోంది. జియామ్‌లో హీరో ఒక ఫైటర్ కావడం, జాంబీలతో ఫైట్ చేసే సర్వైవల్ సీన్స్ అద్భుతంగా ఉన్నాయి. అలాగే, రక్తపాతం, హింస, ఒళ్లు గగుర్పొడిచే సీన్లతో జియామ్ నిండిపోయినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇందులో జాంబీల మేకోవర్ కూడా మిగతా సినిమాలతో పోలిస్తే చాలా భయంకరంగా ఉంది.
జాంబీ హారర్ కాన్సెప్ట్‌తో వచ్చిన జియామ్‌ను చాలా వరకు మేకర్స్ కొత్తగా తెరకెక్కించే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది. ఇప్పుడు ఈ హారర్ సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్ జియామ్ ఓటీటీలోకి వచ్చేయనుంది. నెట్‌ఫ్లిక్స్‌లో జియామ్ ఓటీటీ రిలీజ్ కానుంది. అది కూడా మరో రెండు రోజుల్లో థాయి జాంబీ హారర్ మూవీ జియామ్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.
అంటే, జులై 9 (బుధవారం) నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో థియేట్రికల్ రిలీజ్ లేకుండా డైరెక్ట్‌గా జియామ్ డిజిటల్ ప్రీమియర్ కానుంది. అయితే, ఇప్పటివరకు ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో కేవలం థాయి భాషలోనే గంట 35 నిమిషాలు ఉన్న జియామ్ ఓటీటీ రిలీజ్ కానుందని సమాచారం. ఆ తర్వాత తెలుగులో జియామ్ ఓటీటీలో అందుబాటులో ఉంటుందో వేచి చూడాలి.
సంబంధిత కథనం