Zee5 OTT Releases: ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో జీ5 కూడా ఒకటి. ఈ మధ్యకాలంలో ఈ ఓటీటీ కూడా కాస్త దూకుడు పెంచుతోంది. ఆర్ఆర్ఆర్, సంక్రాంతికి వస్తున్నాంలాంటి బ్లాక్‌బస్టర్ తెలుగు సినిమాల స్ట్రీమింగ్ హక్కులు దక్కించుకున్న ఈ ఓటీటీలోకి ఈ మధ్యే ఐదు థ్రిల్లర్, క్రైమ్ థ్రిల్లర్, హారర్ జానర్ సినిమాలు వచ్చాయి.
లాగౌట్ (Logout) ఓ సైబర్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్ తనయుడు బాబిల్ ఖాన్ నటించిన మూవీ ఇది. ఈ తరం యువతను సోషల్ మీడియా, మొబైల్ ఫోన్ ఓ వ్యసనంలా మారి ఎలా వేధిస్తోందో ఈ సినిమా ద్వారా మేకర్స్ చూపించే ప్రయత్నం చేశారు. 10 మిలియన్ ఫాలోవర్ల కోసం తాపత్రయ పడే ప్రత్యూష్ దువా (బాబిల్ ఖాన్) అనే ఓ యువకుడి ఫోన్ ను అతని అభిమానే చోరీ చేసి అతనితో ఎలా ఆడుకున్నదనేదే ఈ సినిమా స్టోరీ.
దావీద్ ఓ మలయాళ యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ఆంటోనీ వర్గీస్ నటించిన సినిమా ఇది. ఓ మాజీ బాక్సింగ్ ఛాంపియన్ ఓ ప్రమాదం తర్వాత మరోసారి ఎలా బాక్సింగ్ రింగులోకి వస్తాడు? ఓ అంతర్జాతీయ బాక్సింగ్ ఛాంపియన్ తో తలపడతాడన్నది ఈ దావీద్ మూవీ స్టోరీ. ఆశిక్ అబూ (ఆంటోనీ వర్గీస్) అనే బాక్సర్ చుట్టూ తిరిగే ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది.
మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ నటించిన హారర్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ కింగ్‌స్టన్. ఓ ఊరికి పట్టుకున్న శాపాన్ని తొలగించడానికి ఓ మత్స్యకారుడు సముద్రంలోకి వెళ్లి ఎలాంటి సాహసం చేస్తాడన్నది ఈ సినిమాలో చూడొచ్చు. కింగ్‌స్టన్ అనే పాత్రలో జీవీ ప్రకాశ్ నటించాడు. తెలుగులోనూ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
విజయ్ సేతుపతి లీడ్ రోల్లో నటించిన పీరియడ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ విడుదల పార్ట్ 2. విడుదల మూవీకి ఇది సీక్వెల్. పెరుమాల్ వాతియార్ అనే ఓ నక్సలైట్ జీవితం చుట్టూ తిరిగే స్టోరీ ఇది. ఓ టీచర్ ఉద్యమకారుడిగా ఎలా మారాడన్నది ఇందులో చూడొచ్చు.
కాఫిర్ 2019లో వచ్చిన థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఆ సిరీస్ నే ఇప్పుడు సినిమా రూపంలో తీసుకొచ్చారు. ఇందులో దియా మీర్జా, మోహిత్ రైనా లీడ్ రోల్స్ లో నటించారు. కైనాజ్ అక్తర్ (దియా మీర్జా) అనే ఓ పాకిస్థానీ మహిళను మిలిటెంట్ గా భావించి ఆమె ఇండియాలోని జైల్లో బంధిస్తారు. ఆమె అసలు కథ ఏంటనేది తెలుసుకొని విడిపించాలని ఓ జర్నలిస్ట్ ప్రయత్నిస్తుంటాడు. ఇదొక నిజ జీవిత కథ. షెహనాజ్ పర్వీన్ అనే ఓ పాకిస్థానీ యువతి కథ ఇది.
సంబంధిత కథనం