ఓటీటీలోకి డైరెక్ట్ గా అచ్చమైన తెలంగాణ ప్రేమ కథ.. అదిరిపోయిన మోతెవరి లవ్ స్టోరీ ట్రైలర్.. ప్రియదర్శి వాయిస్ ఓవర్ తో!-zee5 original web series mothevari love story trailer released anil geela priyadarshi voice over ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఓటీటీలోకి డైరెక్ట్ గా అచ్చమైన తెలంగాణ ప్రేమ కథ.. అదిరిపోయిన మోతెవరి లవ్ స్టోరీ ట్రైలర్.. ప్రియదర్శి వాయిస్ ఓవర్ తో!

ఓటీటీలోకి డైరెక్ట్ గా అచ్చమైన తెలంగాణ ప్రేమ కథ.. అదిరిపోయిన మోతెవరి లవ్ స్టోరీ ట్రైలర్.. ప్రియదర్శి వాయిస్ ఓవర్ తో!

స్వచ్ఛమైన తెలంగాణ మట్టి వాసన తగిలేలా, ఇక్కడి మనుషుల్లోని ప్రేమను చాటేలా ఓ వెబ్ సిరీస్ రాబోతుంది. తెలంగాణ ప్రేమ కథ నేపథ్యంలో, ఇక్కడి అచ్చమైన మాండలీకంలో టైటిల్ తో ఆడియన్స్ ను అలరించబోతోంది. ఇవాళ రిలీజైన ఈ మూవీ ట్రైలర్ అదరగొడుతోంది.

మోతెవరి లవ్ స్టోరీలో అనిల్ జీల, వర్షిణి

ఓటీటీలోకి మరో లవ్ స్టోరీ రాబోతోంది. స్వచ్ఛమైన తెలంగాణ ప్రేమ కథతో వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. డైరెక్ట్ గా జీ5 ఓటీటీలో అచ్చమైన, స్వచ్చమైన తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో ‘మోతెవరి లవ్ స్టోరీ’ (Mothevari love story) అనే సిరీస్‌ రాబోతోంది. అనిల్ జీల, వర్షిణి రెడ్డి జున్నుతుల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌ను శివ కృష్ణ బుర్రా రూపొందించారు. ఈ విలేజ్ కామెడీ, లవ్ సిరీస్ అందరినీ ఆకట్టుకునేందుకు ఆగస్ట్ 8న జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ అందరినీ మెప్పించింది. ఇక తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను ఆదివారం (జులై 27) నాడు తరుణ్ భాస్కర్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు.

ప్రియదర్శి వాయిస్ ఓవర్

మోతెవరి లవ్ స్టోరీ ట్రైలర్ అదిరిపోయింది. అచ్చమైన తెలంగాణ గ్రామీణ వాతావరణాన్ని చూపించింది. ఇక్కడ మనుషుల ప్రేమను చాటింది. మట్టి వాసన తగిలేలా చేసింది. ప్రియదర్శి వాయిస్ ఓవర్ తో ఈ ట్రైలర్ సాగుతోంది. ‘‘ఇగో ఇదే మా ఊరు.. ఆరెపల్లి.. ఊరు ఊరుకో మోతెవరి ఉన్నట్టు.. మా ఊరికి ఓ మోతెవరి ఉన్నడు..’’ అంటూ ప్రియదర్శి వాయిస్ ఓవర్‌తో ప్రారంభమైన ట్రైలర్ ఆద్యంతం వినోదభరితంగా సాగింది.

లవ్ ట్రాక్

హీరో అనిల్ పరిచయం, హీరోయిన్ వర్షిణితో లవ్ ట్రాక్, ఊర్లోని పెద్దలు, భూ సమస్య, ప్రేమ వంటి అంశాలతో ట్రైలర్‌ను చక్కగా కట్ చేశారు. ఈ ట్రైలర్‌ను చూస్తుంటే ఈ సిరీస్‌ను ఆద్యంతం వినోద భరితంగా మలిచారని అర్థం అవుతోంది. ‘పర్శిగాడంటేనే పర్‌ఫెక్ట్’, ‘ఉశికే ఉడికించుడే’ అనే డైలాగ్స్ నవ్వులు పూయించేలా ఉన్నాయి. ‘అమ్మాయిలు భలేగా ఉంటరే.. మోసాన్ని కూడా ముద్దుగ చెప్తరే’ అంటూ సాగే డైలాగ్ ఎమోషనల్ డెప్త్‌ను కూడా చూపిస్తోంది.

ఆ రోజు రిలీజ్

మోతెవరి లవ్ స్టోరీ సిరీస్ ఆగస్టు 8న జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కు రానుంది. ఈ సిరీస్‌కు చరణ్ అర్జున్ సంగీతాన్ని అందించగా.. శ్రీకాంత్ అరుపుల కెమెరామెన్‌గా పని చేశారు. మధుర శ్రీధర్, శ్రీరామ్ శ్రీకాంత్ సంయుక్తంగా నిర్మించిన ఈ సిరీస్‌‌‌లో అనిల్ జీలా, వర్షిణి, మురళీధర్, సదానందం, సుజాత వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు.

మై విలేజ్ షో వీడియోలతో పాపులర్ అయిన అనిల్ జీల ఈ మోతెవరి లవ్ స్టోరీలో లీడ్ రోల్ ప్లే చేస్తున్నారు. తనకు అలవాటైన రీతిలో గ్రాయ యువకుడి క్యారెక్టర్ ను ఎంతో ఈజ్ తో చేసినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం