Trinayani Serial: త్రినయని సీరియల్ టైమ్‍లో మార్పు.. మరొకటి కూడా.. కొత్త సీరియల్ రాకతో ఇలా..
Trinayani TV Serial: త్రినయని టీవీ సీరియల్ టైమ్ మారింది. కొత్త సీరియల్ చామంతి రావడంతో దీనిపై ప్రభావం పడింది. దీనివల్ల మరో సీరియల్ టైమ్ కూడా ఛేంజ్ అయింది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
త్రినయని సీరియల్ చాలా పాపురల్ అయింది. ఫ్యామిలీ డ్రామాతో పాటు అతీత శక్తుల చుట్టూ జీ తెలుగు ఛానెల్‍లో ఈ సీరియల్ సాగుతోంది. ఒకానొక టైమ్‍లో టీఆర్పీలో ఈ సీరియల్ టాప్‍లో నిలిచింది. అయితే సాగదీత కారణంగా కాస్త డ్రాప్ అయింది. ఇప్పటికే ఈ సీరియల్ ఏకంగా 1442 ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది. అయితే ఇన్నాళ్లకు త్రినయని సీరియల్ టెలికాస్ట్ టైమ్ మారింది.
కొత్త టైమ్ ఇదే
త్రినయని సీరియల్ నేటి (జనవరి 1, 2025) నుంచి జీ తెలుగు టీవీ ఛానెల్‍లో మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రసారం కానుంది. సోమవారం నుంచి శనివారం వరకు టెలికాస్ట్ అవనుంది. డిసెంబర్ 31 వరకు ఈ సిరీయల్ రాత్రి 8.30 గంటలకు ప్రైమ్ టైమ్‍లో ప్రసారం అయ్యేది. ఇప్పుడు మారిపోయింది. కొత్త టైమ్‍తో నేటి ప్రోమోను కూడా జీ తెలుగు తీసుకొచ్చింది. ఇక నుంచి మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు త్రినయని ప్రసారం అవుతుందని పేర్కొంది.
చామంతి రాకతో..
జీ తెలుగు టీవీ ఛానెల్‍లో చామంతి సీరియల్ నేడు (జనవరి 1) ప్రారంభం కానుంది. ప్రతీ రోజూ రాత్రి 8.30 గంటలకు ఈ సీరియల్ ప్రసారం అవుతుంది. ఈ సీరియల్‍లో మేఘనా లోకేశ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ కూడా ఓ కీలకపాత్ర చేస్తున్నారు. చామంతి రాకతో త్రినయని.. మధ్యాహ్నం 2.30 గంటలకు వెళ్లిపోయింది.
ఇంకో సీరియల్‍పైనా ఎఫెక్ట్
త్రినయని టైమ్ మార్పుతో మరో సీరియల్‍పై ప్రభావం పడింది. మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రసారం అవుతున్న జానకి రామయ్య గారి మనవరాలు సీరియల్ టైమ్ మారింది. ఇప్పటి నుంచి ఈ సీరియల్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రసారం కానుంది.
త్రినయని సీరియల్ గురించి..
త్రినయని సీరియల్‍లో అషికా పదుకొణె ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. భవిష్యత్తులో జరగబోయే ప్రమాదాలు ముందే తెలిసే శక్తి ఈమెకు ఉంటుంది. త్రినయని భర్త విశాల్ పాత్రలో పాత్రలో చందు బీ గౌడ నటిస్తున్నారు. ఈ సిరీయల్‍లో తిలోత్తమ పాత్ర విలన్‍గా ఉంది. ఈ పాత్రలో బాగా పాపులర్ అయిన పవిత్రా జయరాం గతేడాది కన్నుమూశారు. అప్పటి నుంచి తిలోత్తమగా చైత్ర హలికేరి నటిస్తున్నారు. ఈ సిరీయల్‍లో అనూష, విష్ణుప్రియ, సురేశ్ పటేల్, అనిల్ చౌదరి, భావన రెడ్డి కూడా కీలకపాత్రలు పోషిస్తున్నారు. బెంగాలో సక్సెస్ అయిన త్రినయని కథ ఆధారంగానే తెలుగులో అదే పేరులో ఈ సీరియల్ రూపొందింది. ఇప్పటికే జీ తెలుగులో 1440 ఎపిసోడ్ల మార్క్ దాటేసింది. ఈ సీరియల్ ఇంకెన్ని రోజులు కొనసాగుతుందో చూడాలి.