Zee Telugu Shooting Live: సినిమా షూటింగ్ లైవ్ చూస్తారా? జీ తెలుగు వినూత్న ప్రయోగం.. మజాకా మూవీ షూటింగ్ లైవ్ టెలికాస్ట్-zee telugu to telecast live shooting of mazaka movie ravulamma song ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Zee Telugu Shooting Live: సినిమా షూటింగ్ లైవ్ చూస్తారా? జీ తెలుగు వినూత్న ప్రయోగం.. మజాకా మూవీ షూటింగ్ లైవ్ టెలికాస్ట్

Zee Telugu Shooting Live: సినిమా షూటింగ్ లైవ్ చూస్తారా? జీ తెలుగు వినూత్న ప్రయోగం.. మజాకా మూవీ షూటింగ్ లైవ్ టెలికాస్ట్

Hari Prasad S HT Telugu
Published Feb 17, 2025 08:31 PM IST

Zee Telugu Shooting Live: ఓ సినిమా షూటింగ్ ను లైవ్ లో చూడాలని చాలా మంది అనుకుంటారు. అలాంటి వాళ్ల కోసం జీ తెలుగు ఓ వినూత్న ప్రయోగం చేయబోతోంది. మజాకా మూవీ పాట షూటింగ్ లైవ్ టెలికాస్ట్ చేయనుంది.

సినిమా షూటింగ్ లైవ్ చూస్తారా? జీ తెలుగు వినూత్న ప్రయోగం.. మజాకా మూవీ షూటింగ్ లైవ్ టెలికాస్ట్
సినిమా షూటింగ్ లైవ్ చూస్తారా? జీ తెలుగు వినూత్న ప్రయోగం.. మజాకా మూవీ షూటింగ్ లైవ్ టెలికాస్ట్

Zee Telugu Shooting Live: మజాకా మూవీ టీమ్, జీ తెలుగు ఛానెల్ ఇప్పటి వరకూ ఎవరూ చేయని ప్రయోగం చేయబోతున్నారు. ఓ సినిమా షూటింగ్ ను లైవ్ లో చూపించబోతున్నారు. మజాకా మూవీలోని రావులమ్మ అనే సాంగ్ షూటింగ్ ను ఈ ఛానెల్ లైవ్ టెలికాస్ట్ చేయబోతోంది. దీని విశేషాలేంటో చూడండి.

మూవీ షూటింగ్ లైవ్

సినిమాల ప్రమోషన్ల కోసం మేకర్స్ కొత్త కొత్త ప్రయోగాలకు తెర లేపుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు మజాకా మూవీ టీమ్ కూడా అలాంటిదే మరో ప్రయోగం చేస్తోంది. ఈ సినిమాలోని రావులమ్మ సాంగ్ షూటింగ్ లైవ్ టెలికాస్ట్ చేయబోతున్నారు. జీ తెలుగు ఛానెల్ ఈ సరికొత్త ప్రయోగానికి తెరలేపింది. ఈ విషయాన్ని సోమవారం (ఫిబ్రవరి 17) తన ఎక్స్ అకౌంట్ ద్వారా ఆ ఛానెల్ వెల్లడించింది.

“ఓ సినిమా షూటింగ్ ను లైవ్ లో తొలిసారి చూడండి. మజాకా షూట్ లైవ్ వెళ్లబోతోంది. ఈ మూవీలోని రావులమ్మ సాంగ్ షూటింగ్ చూడండి. లైవ్ షూట్, చిట్ చాట్. రేపు ఉదయం 11.30 గంటల నుంచి.. ఈ శివరాత్రిని మజాకాతో సెలబ్రేట్ చేసుకోండి. ఫిబ్రవరి 26 నుంచి థియేటర్లలో” అనే క్యాప్షన్ తో ఈ విషయం తెలిపింది. మంగళవారం (ఫిబ్రవరి 18) ఉదయం 11.30 గంటల నుంచి జీ తెలుగు ఛానెల్లో మజాకా మూవీలోని రావులమ్మ సాంగ్ షూటింగ్ లైవ్ చూసే వీలుంది.

మజాకా మూవీ గురించి..

మజాకా మూవీ ఓ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్. సందీప్ కిషన్ లీడ్ రోల్లో నటించాడు. చాలా కాలం తర్వాత మన్మథుడు మూవీ ఫేమ్ అన్షు ఈ సినిమా ద్వారా మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. రీతూ వర్మ, రావు రమేష్ లాంటి వాళ్లు కూడా నటిస్తున్నారు. ఈ సినిమాను మహా శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26న థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు.

గత నెలలోనే ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ త్రినాథ రావు చేసిన కామెంట్స్ దుమారం రేపిన విషయం తెలిసిందే. అన్షును ఉద్దేశించి హీరోయిన్ సైజుల గురించి అతడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీంతోనే ఈ సినిమాకు కాస్త నెగటివ్ ప్రమోషన్ కూడా వచ్చింది.

ఇక ఇప్పుడు మరో వినూత్న ప్రయోగంతో ప్రమోషన్ల జోరు పెంచబోతున్నారు. రావులమ్మ సాంగ్ షూటింగ్ లైవ్ టెలికాస్ట్ ద్వారా మేకర్స్ ప్రేక్షకులకు దగ్గర కానున్నారు. మూవీ ట్రైలర్ ను కూడా త్వరలోనే లాంచ్ చేయబోతున్నారు. ఇక ఈ మూవీ డిజిటల్, శాటిలైట్ హక్కులు రెండూ జీ నెట్ వర్క్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. థియేట్రికల్ హక్కుల రూపంలోనే మజాకా మూవీ రూ.22 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది.

Hari Prasad S

TwittereMail
హరి ప్రసాద్ ఎస్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.
Whats_app_banner

సంబంధిత కథనం