Zee Telugu Shows: జీ తెలుగు ప్రేక్షకులకు ఈ సండే పండగే.. ఆ రెండు షోల స్పెషల్ ఎపిసోడ్స్-zee telugu special shows this sunday promises audience a funday ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Zee Telugu Special Shows This Sunday Promises Audience A Funday

Zee Telugu Shows: జీ తెలుగు ప్రేక్షకులకు ఈ సండే పండగే.. ఆ రెండు షోల స్పెషల్ ఎపిసోడ్స్

Hari Prasad S HT Telugu
May 04, 2023 10:22 PM IST

Zee Telugu Shows: జీ తెలుగు ప్రేక్షకులకు ఈ సండే పండగే.. ఆ రెండు షోలు స్పెషల్ ఎపిసోడ్స్ తో సందడి చేయనున్నాయి. సూపర్ క్వీన్ 2తోపాటు సరిగమప ఛాంపియన్‌షిప్ ఎపిసోడ్స్ సరదాగా సాగనున్నాయి.

జీ తెలుగులో సూపర్ క్వీన్ 2 దోస్తీ స్పెషల్ ఎపిసోడ్
జీ తెలుగులో సూపర్ క్వీన్ 2 దోస్తీ స్పెషల్ ఎపిసోడ్

Zee Telugu Shows: జీ తెలుగు ఛానెల్ తమ ప్రేక్షకులకు ఈ సండే (మే 7)ను మరింత ఫన్‌డేగా మార్చడానికి సిద్ధమవుతోంది. వచ్చే ఆదివారం సూపర్ క్వీన్ 2తోపాటు సరిగమప ఛాంపియన్‌షిప్ స్పెషల్ ఎపిసోడ్స్ టెలికాస్ట్ చేయనుంది. సూపర్ క్వీన్ షో దోస్తీ స్పెషల్ ఎపిసోడ్ తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ షో ఆదివారం ఉదయం 11 గంటలకు టెలికాస్ట్ కానుంది.

ఇక సరిగమప సూపర్ స్టార్స్ తో స్పెషల్ ఎపిసోడ్ ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రసారమవుతుంది. సూపర్ క్వీన్ 2 షోలో ఈసారి స్పెషల్ ఎపిసోడ్ లో భాగంగా కంటెస్టెంట్ల ఫ్రెండ్స్ పార్టిసిపేట్ చేయనున్నారు. వాళ్లు సూపర్ క్వీన్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ చెప్పనున్నారు. అంతేకాదు కంటెస్టెంట్ల గురించి కొన్ని సీక్రెట్లను కూడా వీళ్లు ప్రేక్షకుల ముందు పెట్టనున్నారు. వీటితోపాటు కంటెస్టెంట్ల పర్ఫార్మెన్సెస్, సరదాగా సాగిపోయే గేమ్స్ కూడా ఉంటాయి.

ఇక సరిగమప ఛాంపియన్‌షిప్ కూడా ఓ స్పెషల్ ఎపిసోడ్ తో వస్తోంది. సెలబ్రేషన్స్ విత్ సూపర్ స్టార్స్ పేరుతో ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది. ఇప్పటికే ఈ షో పార్టిసిపెంట్ల అదిరిపోయే పర్ఫార్మెన్స్ లతో ప్రేక్షకులకు దగ్గరైంది. అయితే ఈ సండే ఈ షో మరింత ఆకట్టుకోవడానికి సిద్ధమవుతోంది.

సెలబ్రేషన్స్ విత్ సూపర్ స్టార్స్ లో భాగంగా ఈ షోలోని పార్టిసిపెంట్లు.. పాపులర్ సింగర్స్ తో కలిసి పాడనున్నారు. ఎస్పీ చరణ్, కల్పన, సుమంగళి, రాహుల్ నంబియార్ లాంటి సింగర్స్ స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వనున్నారు. వాళ్లతో కలిసి పార్టిసిపెంట్లు పాటలు పాడనున్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం