NNS December 9th Episode: మిస్సమ్మను గుర్తుచేసుకున్న అమ్ము.. అనకొండతో అమర్ ఫైటింగ్.. ప్రమాదంలో పిల్లలు!
NNS December 9th Episode: నిండు నూరేళ్ల సావాసం సోమవారం (డిసెంబర్ 9) ఎపిసోడ్లో పిల్లలు.. మిస్సమ్మను గుర్తు చేసుకుంటూ బాధపడతారు. మరోవైపు వాళ్లను రక్షించుకోవడానికి అమర్ అనకొండతో ఫైట్ చేయాల్సి వస్తుంది.
NNS December 9th Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం ఈరోజు (డిసెంబర్ 9) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. రౌడీలను చూసి పిల్లలందరూ భయపడుతుంటే.. అంజు మాత్రం గన్స్ చూసి ఎంజాయ్ చేస్తుంది. నీకు భయం కావడం లేదా..? అని అమ్ము అడిగితే ఏం లేదని నేను ఎవరు ది గ్రేట్ అమరేంద్ర కూతురుని అంటుంది.
మిస్మమ్మను పొగిడితే బాగుండదన్న అంజు
అరవింద్ ఒక దగ్గర కారు ఆపుకుని గన్స్ తీసుకుని వెళ్లిపోతాడు. బస్సులో వెళ్తున్న అమ్ము బాధపడుతుంది. మిస్సమ్మను గుర్తు చేసుకుని ఎక్స్ కర్షన్ వద్దని చెప్పిన మాటలను గుర్తు చేసకుని మిస్సమ్మ ఎంత చెప్పినా వినకుండా వచ్చాము మాకు కావాల్సిందే అని మనసులో అనుకుంటుంది. అవునక్కా మనం మిస్సమ్మను అపార్థం చేసుకున్నాము అంటాడు ఆకాష్. అవునక్కా మనం మిస్సమ్మ మాట విని ఉంటే మనం ఇప్పుడు సేఫ్‌గా ఉండేవాళ్లం అంటాడు ఆనంద్.
దీంతో ఏయ్ ఆపండి నా ముందు మిస్సమ్మను పొగడటం నాకు ఇష్టం ఉండదని తెలియదా..? అంటూ కోప్పడుతుంది అంజు. ఇంకోసారి మిస్సమ్మను గుర్తు చేసుకుంటే బాగుండదు అంటుంది. ఇంతలో బంటిని పిలిచి నీకా గన్ కావాలా..? ఒకసారి అడుగు అంటుంది. బంటి భయంతో వణికిపోతుంటాడు.
బంగ్లా చుట్టూ బాంబులు
అనుచరులతో కలిసి ఫారెస్టులో వెళ్తుంటాడు అరవింద్. వాళ్లకు అటవీ శాఖ వారి పాములున్నాయి జాగ్రత్త అనే బోర్డు కనిపిస్తుంది. అన్న అటూ చూడు ఆ బోర్డు మీద ఏం రాసిందో చూడు అన్న అంటాడు. ఏంట్రా ఆ బోర్డు చూడగానే భయపడిపోయావా..? ఆ బోర్డు చూశావా..? ఎంత పాతది అయిపోయిందో.. ఆ పాటికి పాములన్నీ ముసలివి అయిపోయి చచ్చిపోయి ఉంటాయి పదండిరా..? అని లోపలికి వెళ్లిపోతారు.
కారులో వెళ్తున్న మిస్సమ్మ ఏడుస్తుంది. పాపం పిల్లలు ఎంత బాధపడుతున్నారో ఏదైనా చేసి త్వరగా వాళ్లను పట్టుకోవాలి అంటుంది. మరోవైపు పాత బంగ్లా దగ్గరకు వెళ్లిన అరవింద్ తన మనుషులకు బంగ్లా చుట్టూ బాంబులు పాతమని చెప్తాడు. అనుచరులందరూ సరేనని బాంబులు పాతుతుంటారు. బస్సు చెక్‌పోస్టు దగ్గరకు వెళ్తుంది. ట్రాక్ చేస్తున్న అమర్‌కు లాప్‌టాప్‌లో కనిపిస్తుంది. వాళ్లు షార్ట్ కట్‌లో ఫారెస్ట్ లోకి ఎంటర్ అవ్వాలని చూస్తున్నారు అని అమర్ చెప్పగానే అయితే వెంటనే చెక్‌పోస్ట్ కు ఫోన్ చేసి బస్సును ఆపమని చెప్పండి అని మిస్సమ్మ చెప్తుంది. సరేనంటాడు అమర్.
బంగ్లా దగ్గరికి పిల్లలను తీసుకెళ్లిన ప్రిన్సిపల్
మరోవైపు బస్సు చెక్ పోస్ట్ దగ్గరకు వస్తుందని ఎవరైనా అల్లరి చేశారనుకోండి బాంబు పేలుస్తాను అంటాడు డ్రైవర్. ఇంతలో బస్సు చెక్ పోస్ట్ వద్దకు వస్తుంది. ఫారెస్టు ఆఫీసర్లు బస్సును చెక్ చేసి జాగ్రత్తలు చెప్పి పంపిస్తారు. ఇంతలో అమర్ అక్కడికి వస్తాడు. ఫారెస్టు వాళ్లను డీటెయిల్స్ అడిగి డ్రైవర్ ఫోటో చూపిస్తాడు. వీడే డ్రైవర్ అని చెప్తాడు ఆఫీసర్. మిస్సమ్మ భయపడుతుంది. ఇంతలో ట్రాకర్ ఆగిపోతుంది. నాగులగుట్ట దగ్గర ట్రాకర్ ఆగిపోయిందని మనం అక్కడకు వెళ్దాం అని అందరూ అక్కడికి బయలుదేరుతారు.
మరోవైపు బస్సును ఒక దగ్గర ఆపిన డ్రైవర్ ఇక్కడితో రోడ్ ఫినిష్ అయిపోయింది. ఇక నడుచుకుంటూ వెళ్దాం అని దిగి వెళ్లిపోతుంటారు. అరవింద్ రాకీకి ఫోన్ చేసి బంగ్లా చుట్టూ ల్యాండ్‌మైన్స్, బాంబులు ఉన్నాయని జాగ్రత్తగా రమ్మని చెప్తాడు. సరేనని రాకీ ప్రిన్సిపాల్ ను పిలిచి ఇక్కడ బాంబులు ఉన్నాయని అందరూ నా వెనకాలే నడవాలని తేడా జరిగితే అందరం చనిపోతామని చెప్తాడు. సరేనని ప్రిన్సిపాల్ పిల్లలకు చెప్తుంది. అందరూ కలిసి నడుస్తుంటారు. దూరం నుంచి పిల్లలను గమనించిన అరవింద్ తన అనుచరుణ్ని పిలిచి పిల్లలను తీసుకొస్తున్నారు. నువ్వు వెళ్లి వాళ్లను బంధించడానికి ఏర్పాట్లు చెయ్ అని చెప్తాడు.
బంధంలో నుంచి బయటపడటానికి ఆరు ప్రయత్నం
గుప్త వేసిన బంధంలోంచి ఆరు బయటకు వెళ్లడానికి ప్రయత్నిస్తుంది. గుప్త వచ్చి ఆరును రెచ్చగొడతాడు. అక్కడ నీ పిల్లలు ప్రమాదంలో ఉన్నారు నువ్వు వెళ్లి కాపాడుకో వెళ్లు అంటాడు. గుప్త గారు ఫ్లీజ్ మీరేం మట్లాడకండి.. మీరిదంతా కావాలని చేస్తున్నారని నాకు తెలుసు అంటుంది ఆరు.
పాముతో పోరాడి అమర్ పిల్లలను కాపాడతాడా? ఆరు బంధనం నుంచి బయటపడుతుందా? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు డిసెంబర్ 09న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తప్పకుండా చూడాల్సిందే!
టాపిక్