NNS 6th August Episode: శపథం చేసిన అంజు.. స్పృహలోకి వచ్చిన సరస్వతి మేడమ్.. అమర్‌కి తెలిసిపోయిన నిజం!
NNS 6th August Episode: నిండు నూరేళ్ల సావాసం మంగళవారం (ఆగస్ట్ 6) ఎపిసోడ్లో స్కూల్లో అంజు.. ప్రిన్సిపల్‌తో ఓ శపథం చేస్తుంది. అటు సరస్వతి మేడమ్ స్పృహలోకి రాగా.. అమర్ కు నిజం తెలిసిపోతుందని భయపడి ఆమెను బెదిరిస్తుంది మనోహరి.
NNS 6th August Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం ఈరోజు (ఆగస్ట్ 6) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. అంజు తనని ఏడిపించిందని బంటి ప్రిన్సిపల్‌కి కంప్లైంట్ చేస్తాడు. బంటినే కావాలని తమవద్దకి వచ్చి గొడవపడ్డాడని అంటుంది అమ్ము. ఈసారి ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ బంటీనే చూసుకుంటాడు, వాళ్ల నాన్న పెద్ద బిజినెస్‌మ్యాన్ పెద్దపెద్ద వాళ్లని గెస్ట్లుగా పిలుస్తాడు.. మీకెవరు తెలుసు? అంటుంది ప్రిన్సిపల్.
మీరొక లెఫ్టినెంట్ పిల్లలతో మాట్లాడుతున్నారని మర్చిపోతున్నారు. ఈసారి సెలబ్రేషన్స్ మీరు ఊహించని రీతిలో ఉంటాయి రెడీగా ఉండండి అని చెప్పి వెళ్తుంది అంజు. బంటీనే కాబోయే లీడర్ అని నచ్చజెప్పి పంపిస్తుంది ప్రిన్సిపల్.
స్పృహలోకి సరస్వతి మేడమ్
రామ్మూర్తికి భోజనం పెడుతూ ఉంటుంది భాగీ. కళ్లముందే పెట్టుకుని సరస్వతి మేడమ్ కోసం ఎక్కడెక్కడో వెతికాం. నాకెందుకో మీ అక్క మన మధ్యలోనే ఉన్నట్లు అనిపిస్తుంది అంటాడు రామ్మూర్తి. ఇంకెక్కడి కూతురు.. ఆ మనోహరి ఎప్పుడో చంపిపడేసింది. నీకు ఇంక మిగిలింది బూడిదే అని మనసులో అనుకుంటుంది మంగళ. అంతలో రాథోడ్ పరిగెత్తుకుంటూ వచ్చి సరస్వతి మేడమ్‌కి స్పృహ వచ్చిందని చెబుతాడు.
రామ్మూర్తి కంగారుగా వెంటనే సరస్వతి మేడమ్‌ని చూడాలంటాడు. భాగీ, రాథోడ్ కలిసి రామ్మూర్తిని వీల్ ఛైర్లో కూర్చోబెట్టుకుని మేడమ్ దగ్గరకు తీసుకెళ్తారు. అనుకున్నట్లే అయ్యింది. మనోహరికి ఇవాళ మూడింది అనుకుంటుంది మంగళ. నా కూతురు గురించి వెంటనే తెలుసుకోవాలి. సరస్వతి మేడమ్‌ని వెంటనే కలవాలి అని ఏడుస్తాడు రామ్మూర్తి.
అమర్‌తో మాట్లాడాలన్న సరస్వతి
కాసేపు ఆగమంటాడు శివరామ్. పాతికేళ్లుగా నా కూతురుని చూసే క్షణం కోసం పరిగెడుతూనే ఉన్నాను. అలిసిపోయాను.. నా కూతురిని చూడలేకపోయానని బాధపడతాడు రామ్మూర్తి. డాక్టర్ వచ్చి సరస్వతి అమర్‌తో మాట్లాడాలంటుందని చెబుతుంది. రామ్మూర్తికి ధైర్యం చెప్పి అమర్ లోపలకు వెళ్తాడు. సరస్వతి మేడమ్ నోరు విప్పితే తన బండారం బయటపడుతుందని మనోహరి భయంతో వణికిపోతుంది.
మనోహరిని వెంటనే అక్కడనుంచి పారిపొమ్మని హెచ్చరిస్తుంది మంగళ. అమర్ బాధ వెనకున్న కోపాన్ని నువ్వు తట్టుకోలేవు అంటుంది. అడ్డొచ్చిన వాళ్లని ప్రాణాలు తీయడం తప్ప పారిపోవడం నాకు తెలియదు. ఇంకోసారి పారిపొమ్మంటే నీ ప్రాణాలు కూడా పోతాయని హెచ్చరిస్తుంది మనోహరి. దేవుడా.. జరుగుతున్నదానికి ఆ మనోహరే కారణమని ఆయనకి తెలిసేంతవరకి మేడమ్‌ని బతికించు అని వేడుకుంటుంది అరుంధతి.
సరస్వతిని బెదిరించిన మనోహరి
నీ కుట్రలు, కుతంత్రాలు బయటపడే సమయం వచ్చింది అనుభవించు అనుకుంటుంది భాగీ. స్పృహలోకి వచ్చిన సరస్వతి అమర్‌తో మనోహరి గురించి చెప్పాలని ప్రయత్నిస్తుంది. అంతా అయిపోయింది.. నా తమ్ముడిలానే నేను కూడా జైలుకి వెళ్లడం ఖాయం అని భయపడుతుంది మంగళ. సరస్వతి పొజిషన్ బాలేదంటుంది డాక్టర్. కంగారు పడకుండా ప్రశాంతంగా ఉండండి అంటాడు అమర్.
అంతటికీ కారణమైన వాళ్లపేరు చెప్పండి చాలు.. మిగతాదంతా నేను చూసుకుంటాను అంటాడు. మనోహరి పేరు చెప్పేందుకు సరస్వతి ప్రయత్నిస్తుంది కానీ అమర్‌కి అర్థం కాదు. తన పేరు చెప్తే చంపేస్తానంటూ పరదా పక్క నుంచి సరస్వతిని బెదిరిస్తుంది మనోహరి. అంతలో సరస్వతికి బీపీ పెరగడంతో డాక్టర్ అమర్‌ని బయటకు వెళ్లమంటుంది. ఏదిఏమైనా వాళ్లకి తగిన శిక్ష వేసేంతవరకు తను ఊరుకోనంటాడు అమర్.
అరుంధతి ఆశ్రమానికి అమర్
బయటకు వచ్చిన అమర్‌ని చూసి తన కూతురు గురించి ఏమైనా తెలిసిందా అని అడుగుతాడు రామ్మూర్తి. లేదని చెప్పడంతో బాధపడుతున్న రామ్మూర్తికి ఎలాగైనా మీ కూతుర్ని వెతికి పట్టుకుంటానని మాటిస్తాడు. అందరూ ఇంటికి బయల్దేరతాడు. అమరేంద్రకు ఈ కుటుంబమే తన భార్య కుటుంబం అని తెలిస్తే ఏం జరుగుతుందో ఆలోచించావా? అంటుంది మంగళ.
అమర్ అరుంధతి పెరిగిన ఆశ్రమానికి వెళ్తాడు. అరుంధతికి సంబంధించిన వివరాలేవీ లేవంటుంది వార్డెన్. అమర్ బతిమాలడంతో ఒకసారి రికార్డ్స్ చూస్తానంటుంది. అమర్ అరుంధతి తల్లిదండ్రుల వివరాలు తెలుసుకుంటాడా? మనోహరి సరస్వతి మేడమ్‌ని ఏం చేస్తుంది? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు ఆగస్టు 06న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తప్పకుండా చూడాల్సిందే!