NNS August 5th Episode: సరస్వతి మేడమ్‌ను చంపడానికి వెళ్లి అమర్‌కు దొరికిపోయిన మనోహరి!
NNS August 5th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ సోమవారం (ఆగస్ట్ 5) ఎపిసోడ్లో సరస్వతి మేడమ్ ను చంపడానికి మనోహరి ప్రయత్నిస్తుంది. ఆమె అమర్ కు చిక్కుతుందా లేదా అన్న సస్పెన్స్ నెలకొంది.
NNS August 5th Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం ఈరోజు (ఆగస్ట్ 5) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. అమర్ కుటుంబంతోపాటు మనోహరి కూడా రామ్మూర్తిని చూడటానికి హాస్పిటల్‌కి వెళ్తుంది. సరస్వతి వార్డెన్ గురించి రామ్మూర్తికి చెబుతుంది భాగీ. ఆమె ఎక్కడుందని అడుగుతాడు రామ్మూర్తి. ఆమె కూడా ఈ హాస్పిటల్లోనే ఉందని, కానీ కోమాలో ఉందని చెబుతాడు అమర్. వీళ్ల ఆరాటం చూస్తుంటే నీ కథకి శుభం కార్డు పడేట్లు ఉందని అంటుంది మంగళ. తనకు ముప్పు అంటే ఆ సరస్వతిని వెంటనే చంపేస్తానంటుంది మనోహరి.
మెలకువలోకి వచ్చిన సరస్వతి
ఆమెని నువ్వేం చేయాలనుకున్నా నేను చేయనివ్వను అంటుంది భాగీ. సరస్వతి వార్డెన్ అదే హాస్పిటల్లో ఉందని వినగానే వెతుక్కుంటూ ఆమె దగ్గరకి వెళ్తుంది. నా కుటుంబం సంతోషంగా ఉండాలన్నా ఆ మనోహరి పీడ విరగడ కావాలన్నా మీరు వెంటనే స్పృహలోకి రావాలి. నిజం అందరికీ చెప్పాలి అని గట్టిగా పిలుస్తుంది అరుంధతి. దాంతో సరస్వతి మేడమ్‌లో కదలిక వస్తుంది.
మేడమ్ లేచారని అందరికీ చెబుతుంది అరుంధతి. కానీ తన మాటలు ఎవరికి వినపడకపోవడంతో పట్టించుకోరు. వెంటనే బయటకు వెళ్లి ఎవర్నైనా తీసుకొస్తానంటూ పరిగెడుతుంది. తను వెళ్లిన తర్వాత సరస్వతి మేడమ్‌ని చంపేయమని మంగళకి చెబుతుంది మనోహరి. అలాంటి పనులు తనకు చెప్పొద్దనీ, అమరేంద్ర బాబుతో పెట్టుకోలేనని భయపడుతుంది మంగళ. అది విన్న అరుంధతి చేసిన పాపాలు సరిపోవని మేడమ్‌ని చంపాలనుకుంటున్నారా? అంటూ అమర్ దగ్గరకు పరిగెత్తి మేడమ్‌కి మెలకువ వచ్చిందని అంటుంది.
మేడమ్ దగ్గరికి అమర్
వార్డెన్ని చూసి వెళ్దామంటాడు అమర్. నేను ఇప్పుడే చూశాను అమర్, కోమాలోనే ఉన్నారు అంటుంది మనోహరి. ఎవండీ.. మీరు దాని మాటలు నమ్మకండి. మీరు వెళ్లగానే మేడమ్‌ని చంపడానికి చూస్తోంది అంటుంది అరుంధతి. నేనూ ఒకసారి చూడాలి అని మేడమ్‌ని చూడ్డానికి వెళ్తాడు అమర్. డాక్టర్ని మేడమ్‌కి ఎలా ఉందని అడుగుతాడు. కండీషన్లో ఏం తేడా లేదని చెబుతుంది డాక్టర్.
కానీ సరస్వతి మేడమ్ చెయ్యి కదులుతుండటం చూసి మనోహరి కంగారు పడుతుంది. త్వరగా అమర్‌ని అక్కడ నుంచి తీసుకుని వెళ్లిపోవాలనుకుని తొందర పెడుతుంది. కదులుతున్న మేడమ్ చెయ్యి చూడండని అరుంధతి అమర్‌ని బతిమాలుతుంది కానీ ఆ మాటలు వినపడకపోవడంతో మనోహరి మాటలు విని అక్కడ నుంచి వెళ్లిపోతాడు అమర్.
సరస్వతిని చంపడానికి వెళ్లిన మనోహరి
రామ్మూర్తికి చెప్పి ఇంటికి బయల్దేరతారు అమర్ కుటుంబ సభ్యులు. సాయంత్రం వరకు నేను నాన్న దగ్గరే ఉంటాను అంటుంది భాగీ. అది చూసి చిరాకు పడుతుంది మనోహరి. తొందరగా బయల్దేరక ఈ సోదంతా ఏంటని విసుక్కుంటుంది. ఏంటండీ.. కంగారు పడుతున్నారు అని అడుగుతుంది భాగీ. అదేం లేదంటుంది మనోహరి.
అందరూ బయటకు వస్తుంటే కాసేపు తనూ అంకుల్ వాళ్లతో ఉండి వస్తానంటూ హాస్పిటల్లోనే ఉంటుంది మనోహరి. ఏవండీ.. వెళ్లకండీ అంటుంది అరుంధతి. మేడమ్ స్పృహలోకి రావడం చూసింది ఇప్పుడు మేడమ్‌ని చంపేస్తుంది అని భయపడుతుంది. రాథోడ్ నువ్వు ఇక్కడే ఉండి మిస్సమ్మ వాళ్లకి ఏం కావాలో చూసుకో.. నేను అమ్మ వాళ్లని డ్రాప్ చేసి ఆశ్రమానికి వస్తానని వెళ్తాడు అమర్. సిస్టర్ని పిలిచి డాక్టర్లా మాస్క్ పెట్టుకుని సరస్వతి ఉన్న రూమ్‌లోకి వెళ్తుంది మనోహరి.
ఒసేయ్ సరస్వతి.. ఎన్నిసార్లు నా దారికి అడ్డొస్తావే.. నేను ప్రాణాలతో ఉండాలన్నా.. అమర్‌ని పెళ్లి చేసుకోవాలన్నా నువ్వు ప్రాణాలతో ఉండాలి. ఇవాళ నిన్ను రెస్ట్ ఇన్ పీస్ చేస్తాను అంటూ మేడమ్‌ని చంపాలని చూస్తుంది. అమర్ లిఫ్ట్ ఎక్కబోతూ వార్డెన్ చెయ్యి కదలడం గుర్తొచ్చి తిరిగొస్తాడు. మనోహరి సరస్వతిని చంపుతుందా? అమర్ మనోహరిని చూస్తాడా? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు ఆగస్టు 05న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తప్పకుండా చూడాల్సిందే!