NNS 20th August Episode: అరుంధతిని గెలవనివ్వనని మనోహరి శపథం.. మిస్సమ్మ ఎప్పటికీ అమ్మ కాలేదన్న అంజు..!-zee telugu serial nindu noorella saavasam today august 20th episode nns serial nns today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns 20th August Episode: అరుంధతిని గెలవనివ్వనని మనోహరి శపథం.. మిస్సమ్మ ఎప్పటికీ అమ్మ కాలేదన్న అంజు..!

NNS 20th August Episode: అరుంధతిని గెలవనివ్వనని మనోహరి శపథం.. మిస్సమ్మ ఎప్పటికీ అమ్మ కాలేదన్న అంజు..!

Hari Prasad S HT Telugu
Aug 20, 2024 06:00 AM IST

NNS 20th August Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ మంగళవారం (ఆగస్ట్ 20) ఎపిసోడ్‌లో అరుంధతిని గెలవనివ్వనని మనోహరి శపథం చేస్తుంది. అటు స్కూల్లో పరుగు పందేనికి రెడీ అవుతూ.. మిస్సమ్మ ఎప్పటికీ అమ్మ కాలేదని అంజు అంటుంది.

అరుంధతిని గెలవనివ్వనని మనోహరి శపథం.. మిస్సమ్మ ఎప్పటికీ అమ్మ కాలేదన్న అంజు..!
అరుంధతిని గెలవనివ్వనని మనోహరి శపథం.. మిస్సమ్మ ఎప్పటికీ అమ్మ కాలేదన్న అంజు..!

NNS 20th August Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం ఈరోజు (ఆగస్ట్ 20) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. మిస్సమ్మ సంతోషంగా అమర్‌ మాటల గురించి అరుంధతితో చెప్తుంది. వాయనం ఇస్తుంది. వాయనం తీసుకున్న ఆరు.. మిస్సమ్మను దీవిస్తుంది. ఇదంతా పై నుంచి గమనిస్తున్న మనోహరి షాక్‌ అవుతుంది. తర్వాత ఘోర దగ్గరకు వెళ్లి విషయం చెప్తుంది మనోహరి.

షాక్‌లో మనోహరి

అసలు చచ్చిన దాని స్వర్శ వీళ్లకు తెలియడం ఏంటి? ఒక ఆత్మ వచ్చి పూజలో కూర్చోవడం ఏంటి? అమర్‌తో కలిసి వ్రతం చేయడం ఏంటి? ఈ చెల్లెలేమో అక్కకి వాయనం ఇవ్వడం ఏంటి? అంటుంది. ఆత్మ విషయంలో నువ్వేం చెప్పినా.. నేనేం విన్నా ఆశ్చర్యపోను మనోహరి అంటాడు ఘోరా. ఏందుకు ఘోర? అని అడుగుతుంది మనోహరి.

ప్రతి పౌర్ణమికి ఆ ఆత్మకు శక్తి వస్తుంది. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయనుకున్నావు. ఆ ఆత్మకు దైవశక్తి తోడు అయ్యింది. మనం ఎదురువెళ్తుంది ఆత్మకే కాదు. పరమాత్మకు కూడా ఎదరే వెళ్తున్నాం. ఇవాళ సాక్ష్యాత్తు ఆ వరలక్ష్మీ దేవే దిగివచ్చి ఆ ఆత్మకు శక్తి ఇచ్చింది అని ఘోర చెప్పగానే మనోహరి షాక్‌ అవుతుంది. నీ నిజ స్వరూపం అందరికీ తెలియడం, నువ్వు ఆ ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్లిపోవడమే ఆ ఆత్మకు కావాలి అంటాడు ఘోరా.

మనోహరి పంతం

అది ఈ జన్మలో జరగదు. అమర్​ని నా సొంతం చేసుకునే వరకు ఆ ఇంటిని వదిలి వెళ్లను అంటున్న మనోహరిని చూసి నవ్వుతాడు ఘోరా. ఎందుకు నవ్వుతున్నావని అడుగుతుంది మనోహరి. ఆ ఆత్మ నిన్ను చంపాలనుకుంటే మొదటి పౌర్ణమికే చంపేది.

నువ్వు తనని శత్రువుగా చూసినా తను మాత్రం ఎప్పుడూ నిన్ను స్నేహితురాలిగానే చూసింది. ఆ మంచితనమే అరుంధతి బలం అంటాడు ఘోరా. ఎంత కష్టమైనా సరే దాన్ని మాత్రం గెలవనివ్వను అంటుంది మనోహరి.

అమర్‌కు స్పెషల్ డ్యూటీ

అమర్​ని పిలిచి స్వాతంత్య్ర దినోత్సవం రోజున సిటీలో అల్లర్లు జరిగే అవకాశం ఉందని, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తాడు మేజర్. సిటీలో ఎలాంటి సమస్య లేకుండా స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరుగుతాయి, తానే దగ్గరుండి అన్నీ సవ్యంగా జరిగేలా చూసుకుంటానని చెప్పి వెళ్లిపోతాడు అమర్​. స్కూల్లో స్వాతంత్య్ర దినోత్సవాలకు ఏర్పాట్లు చేస్తారు.

బంటీని పిలిచి తినడం ఆపి ఆ అమ్ముని ఎలా దెబ్బకొట్టాలో ఆలోచించమని చెబుతుంది ప్రిన్సిపాల్​. రన్నింగ్ రేస్​లో అంజుని కొట్టేవాళ్లే లేరు, ఏదైనా అరెంజ్​మెంట్​ చేయమన్నా చేశావా? అని అడుగుతుంది. ఆల్రెడీ అన్నీ ప్లాన్​చేశానంటాడు బంటీ. పరుగు పందెంలో పాల్గొనడానికి భయపడుతుంది అంజు. ఏమైందని అడుగుతుంది అమ్ము.

మిస్సమ్మ అమ్మకాలేదన్న అంజు

అమ్మ లేకుండా పరుగు పందెంలో పాల్గొనాలంటే భయంగా ఉందని ఏడుస్తుంది అంజు. అదంతా వింటున్న అరుంధతి బాధపడుతుంది. పిల్లలంతా అంజుకి నచ్చజెప్పి పరుగుపందెంలో పాల్గొనడానికి ఒప్పించాలని ప్రయత్నిస్తారు. అమ్మ స్థానంలో మిస్సమ్మ ఉంది కదా అంటుంది అమ్ము.. ఇంకోసారి మిస్సమ్మని అమ్మతో పోల్చకు. అమ్మ స్థానాన్ని ఎప్పటికీ మిస్సమ్మ భర్తీ చేయలేదు అంటుంది అంజు. మరోసారి మిస్సమ్మను నమ్మి మోసపోను అంటుంది. భయపడుతూనే రన్నింగ్ రేస్​లో పాల్గొనడానికి వెళ్తుంది అంజు.

ఒంటరిగా నిల్చుని భయపడుతున్న అంజు దగ్గరకు వెళ్లి భయపడొద్దని చెబుతుంది అరుంధతి. దగ్గరుండి పరుగు పందేనికి తీసుకుని వెళ్తుంది. అరుంధతి స్పర్శని అనుభూతి చెందిన అంజు సంతోషంగా వెళ్తుంది. పందెంలో హుషారుగా పాల్గొనేందుకు సిద్ధమైన అంజుని పక్కన ఉన్న పాపతో చెప్పి పడేలా చేస్తాడు బంటీ. అంజు.. లే.. లేచి పరిగెత్తూ అని పిల్లలు, అరుంధతి పిలుస్తారు. అంజు పరుగుపందెంలో గెలుస్తుందా? స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఏం జరగబోతోంది? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు ఆగస్టు 20న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తప్పకుండా చూడాల్సిందే!