NNS 8th July Episode: తప్పించుకున్న మనోహరి.. ప్రమాదంలో భాగీ తండ్రి.. అమర్‌లో మొదలైన అనుమానం!
NNS 8th July Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ సోమవారం (జులై 8) ఎపిసోడ్లో మనోహరి కొద్దిలో అమర్ నుంచి తప్పించుకుంటుంది. మరోవైపు విషం కలిపిన అన్నం తిని భాగీ తండ్రి ప్రమాదంలో పడతాడు.
NNS 8th July Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం ఈరోజు (జులై 8) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. కిచెన్‌లో దొరికిన సీసాలో ఉన్నది విషం అని తెలుసుకుని పిల్లల్ని కాపాడేందుకు స్కూల్‌కి పరిగెడుతుంది మిస్సమ్మ. పిల్లలు తమతో పాటు తినమని మిస్సమ్మ తండ్రిని పిలుస్తారు. రామ్మూర్తి మిస్సమ్మ పంపిన బాక్స్‌లోని విషం కలిపిన అన్నం తినేస్తాడు.
అన్నం తిని పడిపోయిన రామ్మూర్తి
మిస్సమ్మ పరుగున స్కూల్ దగ్గరకు వస్తుంది. రామ్మూర్తి చేతులు కడుక్కోవడానికి వెళ్లి అక్కడే వాంతి చేసుకుని పడిపోతాడు. ఆరు ఆత్మ తనకు ఏదో కీడు శంకిస్తుందని దేవుడిని దండం పెట్టుకుంటుంది. మిస్సమ్మ పరుగున వచ్చి పిల్లలు తినగానే పిలిచి ఆపి వాళ్ల తినే అన్నం తోసేస్తుంది.
పిల్లలు ఏమైందని అడిగితే ఫుడ్ పాడైపోయిందని మళ్లీ తెస్తానని అంటుంది. ఇంతలో పిల్లలు తాతయ్య తినేశారని చెప్తారు. మిస్సమ్మ షాక్ అవుతుంది. నాన్న తిన్నారా.. అని అడిగి పరుగులు తీస్తుంది మిస్సమ్మ. తండ్రి పడిపోవడం చూసి ఏడుస్తుంది. పిల్లలు కూడా తాతయ్య తాతయ్య అని ఏడుస్తారు.
పోలీస్ స్టేషన్‌కు మనోహరి
మరోవైపు అమర్ మనోహరిని తీసుకొని పోలీస్ స్టేషన్‌కి వెళ్తుంటాడు. పోలీస్‌స్టేషన్‌కి వెళ్తే తన పని అయిపోతుందని భయపడుతుంది మనోహరి. అందరూ స్టేషన్‌కి వస్తారు. మనోహరి అమర్‌తో తనని చూడటానికి భయంగా ఉందని అంటుంది. అమర్ మనోహరితో ఎందుకు టెన్షన్ పడుతున్నావని అడుగుతాడు. అమర్ మనోహరిని తీసుకొని రణవీర్ దగ్గరకు వెళ్తాడు.
మనోహరి ప్రవర్తనకు రాథోడ్‌కి అనుమానం వస్తుంది. కరెక్ట్‌గా రణవీర్‌ని కలిసే టైంకి అమర్‌కి కాల్ రావడంతో వెనక్కి వెళ్లిపోతారు. మిస్సమ్మ ఫాదర్‌కి ఫుడ్ పాయిజిన్ అయిందని హాస్పిటల్‌కి వెళ్లాలని చెప్తాడు. ఇక మనోహరి పిల్లలకు ఏం కాలేదా అని అప్‌సెట్ అవుతుంది. ఇక మిస్సమ్మ తన తండ్రిని తీసుకొని హాస్పిటల్‌కి వస్తుంది. పిల్లలు, మిస్సమ్మ ఏడుస్తుంటారు.
మిస్సమ్మని పొగిడిన అమర్
డాక్టర్లు వైద్యం మొదలు పెడతారు. పిల్లల్ని పట్టుకొని మిస్సమ్మ ఏడుస్తుంది. తండ్రి పరిస్థితిని డాక్టర్లను అడుగుతుంది. ఇప్పటికి అయితే ప్రాబ్లమ్ లేదు కానీ గతంలో ఏదో సమస్య ఉందని అంటే మిస్సమ్మ లంగ్స్ ఆపరేషన్ అయిందని చెప్తుంది. దీంతో డాక్టర్ పాత ఫైల్స్ తీసుకొని రమ్మంటారు. మిస్సమ్మ మంగళకి కాల్ చేసి నాన్న పాత రిపోర్ట్స్ అన్ని తీసుకొని రమ్మని చెప్తుంది.
మిస్సమ్మ పిల్లల్ని కాపాడిందని, మిస్సమ్మ పక్కన ఉండగా తన పిల్లలకు ఏం కాదు అని అమర్ అనుకుంటాడు. కానీ మిస్సమ్మ తన తండ్రి గురించి టెన్షన్ పడుతోందని అమర్ గ్రహిస్తాడు. అమర్ మిస్సమ్మని పొగడటంతో మనోహరి రగిలిపోతుంది. ఇక అమర్ తన కుటుంబాన్ని టార్గెట్ చేసిన వాళ్లని వదిలి పెట్టనని అంటాడు. మిస్సమ్మ ఏడుస్తుంటుంది.
దేవుడిని దండం పెట్టుకుంటుంది. అది చూసి పిల్లలు ఎమోషనల్ అయిపోతారు. అమ్ము కూడా వచ్చి తాతయ్యకు ఏం కాకుండా చూడని దేవున్ని దండం పెట్టుకుంటుంది. దీంతో మిగతా పిల్లలు అందరూ వచ్చి దేవుడికి దండం పెట్టుకుంటారు. రామ్మూర్తికి ఏం జరుగుతుంది? అన్నంలో విషం కలిపింది ఎవరో అమర్‌కి తెలిసిపోతుందా? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు జులై 08న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తప్పకుండా చూడాల్సిందే!
టాపిక్