NNS 7th February Episode: ​భాగీని హత్తుకున్న అమర్​.. కోల్​కతా వెళ్లే సంబరంలో అంజు.. రణ్​వీర్​ని మోసం చేసే పనిలో మనోహరి​!-zee telugu serial nindu noorella saavasam today 7th february episode nns serial today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns 7th February Episode: ​భాగీని హత్తుకున్న అమర్​.. కోల్​కతా వెళ్లే సంబరంలో అంజు.. రణ్​వీర్​ని మోసం చేసే పనిలో మనోహరి​!

NNS 7th February Episode: ​భాగీని హత్తుకున్న అమర్​.. కోల్​కతా వెళ్లే సంబరంలో అంజు.. రణ్​వీర్​ని మోసం చేసే పనిలో మనోహరి​!

Hari Prasad S HT Telugu
Published Feb 07, 2025 01:50 PM IST

NNS 7th February Episode: ​నిండు నూరేళ్ల సావాసం సీరియల్ శుక్రవారం (ఫిబ్రవరి 7) ఎపిసోడ్లో భాగీని హగ్ చేసుకుంటాడు అమర్. అటు కోల్‌కతా వెళ్లే సంబరంలో అంజు ఉండగా.. రణ్‌వీర్ దగ్గర కోట్లు కొల్లగొట్టడానికి మనోహరి ప్లాన్ చేస్తుంది.

భాగీని హత్తుకున్న అమర్​.. కోల్​కతా వెళ్లే సంబరంలో అంజు.. రణ్​వీర్​ని మోసం చేసే పనిలో మనోహరి​!
భాగీని హత్తుకున్న అమర్​.. కోల్​కతా వెళ్లే సంబరంలో అంజు.. రణ్​వీర్​ని మోసం చేసే పనిలో మనోహరి​!

NNS 7th February Episode: ​జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం ఈరోజు (ఫిబ్రవరి 7) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. రణ్​వీర్​, మనోహరితో కలిసి కలకత్తా వెళ్తానంటుంది అంజు. మిగతా పిల్లలందరూ కలిసి అంజు బ్యాగ్​ సర్దుతారు. అమ్ము.. అంజును దగ్గరకు తీసుకుని మేము ఎవ్వరం లేకుండా అంత దూరం ఒక్కదానివే వెళ్తున్నావు.. జాగ్రత్తగా ఉంటావు కదా..? మనోహరి ఆంటీ.. రణవీర్‌ అంకుల్‌ ఉన్నారు కానీ వాళ్లు కూడా బయటి వాళ్లే కదా..? కావాలంటే హాలిడేస్‌లో తీసుకెళ్లమని డాడీకి చెప్తాను.. అయినా ఒక్కదానివే అంత దూరం ఎందుకు చెప్పు.. అంటుంది.

కోల్‌కతా వెళ్తానని మిస్సమ్మకు తేల్చి చెప్పిన అంజు

అంజు కూడా సాయంత్రం నుంచి నేను కూడా అదే ఆలోచిస్తున్నాను అమ్ము.. రణవీర్‌ అంకుల్‌ మనోహరి ఆంటీతో నన్ను కోల్‌కతా రమ్మన్నప్పుడు నేను ఎందుకు ఒప్పుకున్నానా.. అని కానీ ఎందుకో అమ్మూ కోల్‌కతా అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం ఎప్పుడూ వెళ్లలేదు చూడలేదు. కానీ ఎందుకో అక్కడికి వెళ్లాలనిపిస్తూ ఉండేది అంటుంది. మిమ్మల్ని ఏడిపిస్తూ ఉండటానికి పైకి అలా అంటున్నాను కానీ నాకు కూడా చాలా బాధగా ఉంది అమ్ము అంటుంది.

ఇందాకటి నుంచి నేను రానని చెప్తే అంకుల్‌ ఫీలవుతారేమోనని ఆలోచిస్తున్నాను అంటుంది. ఇంతలో అక్కడికి వచ్చిన మిస్సమ్మ అయితే వెళ్లకు అంజు. ‌ప్లీజ్ ఉండిపో.. ప్లీజ్ అంజు నా మీద నీకు కోపంగా ఉందని నాకు తెలుసు.. కానీ ఈ ఒక్కసారి నా మాట విని.. నువ్వు మనోహరి వాళ్లతో వెళ్లకు అనగానే.. అయితే నేను వెళ్లడం నీకు ఇష్టం లేదా మిస్సమ్మ అని అడుగుతుంది అంజు. అవునని చెప్తుంది మిస్సమ్మ. అయితే నేను కచ్చితంగా వెళ్లిపోతాను. నువ్వు నా ఎనిమీ నీకు ఇష్టం అయిందేదీ నేను చేయను.. ఈ రాత్రికే నేను కోల్‌కతా వెళ్లిపోతాను అంటూ చెప్పి వెళ్లిపోతుంది అంజు.

మనోహరిని పెళ్లి చేసుకుంటానన్న కాళీ

జైల్లో ఉన్న కాళీ దగ్గరకు మంగళ వెళ్తుంది. ఏడుస్తూ ఎలా ఉన్నావురా తమ్ముడు అంటూ పలకరిస్తుంది. దీంతో కాళీ కోపంగా నేను ఇక్కడ ఉన్నాననే విషయమే మర్చిపోయి వాళ్లతో హ్యాపీగా ఉన్నావా.. అని అడుగుతాడు. ఏం లేదు.. నువ్వు జైలుకు వచ్చాక నా దగ్గర చిల్లిగవ్వ లేదు. మీ బావ నన్ను రాచి రంపాన పెడుతున్నాడు.. పక్కన నువ్వు లేవు అంటూ బాధపడుతుంది.

ఇక నుంచి పైసల గురించి దిగులు అక్కర్లేదు.. నేను రేపు జైలు నుంచి విడుదల అవుతున్నాను. మనోహరికి ఒక గిఫ్ట్‌ ఇద్దామని వస్తున్నాను అంటాడు. నీకు బెయిలు రాదని అన్నారు కదా.. ఎలా వస్తున్నావు అని మంగళ అడుగుతుంది. సత్ ప్రవర్తన కింద నన్ను వదిలిపెడుతున్నారు అని చెప్తాడు. నేను బయటకు వచ్చి మనోహరిని పెళ్లి చేసుకుంటాను అని చెప్తాడు. దీంతో మంగళ భయపడుతుంది.

మిస్సమ్మని హగ్ చేసుకున్న అమర్

మిస్సమ్మ కోపంగా అమర్‌ దగ్గరకు వెళ్లి అంజలిని రణవీర్‌ వాళ్లతో పంపించడం నాకు ఇష్టం లేదు. వాళ్ల బిహేవియర్‌ నాకు అనుమానంగా అనిపిస్తుంది అని చెప్తుంది. అంత స్పీడుగా చెబితే నాకేం అర్థం అవుతుంది.. స్లోగా చెప్పు అని అమర్ అంటాడు. ఇప్పుడే కదా చెప్పాను మళ్లీ చెప్పమంటావేంటి అంటుంది. అమర్‌ కోపంగా కసురుకోవడంతో మిస్సమ్మకు భయంతో వెక్కిళ్లు వస్తాయి.. అమర్‌ వాటర్‌ కోసం చూస్తాడు.

వాటర్‌ లేకపోవడంతో వెళ్లి మిస్సమ్మను గట్టిగా హగ్‌ చేసుకుంటాడు అమర్‌. మిస్సమ్మ వెక్కిళ్లు ఆగిపోతాయి. ఇద్దరి మధ్య చిన్నపాటి రొమాంటిక్‌ సీన్‌ క్రియేట్‌ అవుతుంది. మిస్సమ్మ ఏం జరిగింది అని అడుగుతుంది. అమర్‌ నీకు వెక్కిళ్లు వచ్చాయి.. వెక్కిళ్లు ఆగిపోవడానికి ఇలా చేశాను అంటాడు. మిస్సమ్మ క్యూట్‌గా మీరు అలా చేస్తే నా ఊపిరి ఆగిపోతుంది అంటుంది. అమర్‌ దూరంగా వెళ్లగానే.. మిస్సమ్మ మళ్లీ వెక్కిళ్లు వచ్చినట్టు యాక్ట్‌ చేస్తుంది. అమర్‌ నాటకం ఆడొద్దు అంటాడు.

కాళీ రాక తెలుసుకొని మనోహరి షాక్

కోల్‌కతా వెళ్లడానికి మనోహరి రెడీ అవుతూ త్వరగా అక్కడికి వెళ్లి.. అంజుతో సంతకం చేయించి వస్తే ఇక నన్ను రణవీర్‌ వదిలిపెడతాడు అనుకుంటూ.. అయినా అన్ని వందల కోట్లు రణవీర్‌కు వస్తుంటే.. నాకు కొన్నైనా ఇవ్వాలి కదా..? నా సంతకం అడుగుతాడు కదా అప్పుడు నాకు కొన్ని కోట్లు ఇస్తేనే సంతకం చేస్తానని చెప్తాను అనుకుంటూ రెడీ అవుతుంది.

ఇంతలో మంగళ ఫోన్‌ చేసి కాళీ రేపు జైలు నుంచి వస్తున్నాడు అని చెప్తుంది. మనోహరి షాక్‌ అవుతుంది. అసలు వాడు వచ్చేది నీ ఘోరాలు మొత్తం అమరేంద్ర బాబుకు చెప్పడానికి వస్తున్నాడని మంగళ చెప్పగానే.. మనోహరి కోపంతో మంగళను తిడుతుంది. కాళీ ద్వారా అమర్​ నిజం తెలుసుకుంటాడా? మనోహరి ప్లాన్​ రణ్​వీర్​ పసిగడతాడా? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు ఫిబ్రవరి 7న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తప్పకుండా చూడాల్సిందే!

Whats_app_banner

సంబంధిత కథనం