NNS 6th March Episode: వ్యభిచారం కేసులో అమర్, మనోహరి అరెస్ట్.. షాక్‌లో అమర్ కుటుంబం!
NNS 6th March Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ బుధవారం (మార్చి 6) ఎపిసోడ్ లో వ్యభిచారం కేసులో అమర్, మనోహరి అరెస్ట్ కావడం అందరినీ షాక్ కు గురి చేస్తుంది.
NNS 6th March Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం బుధవారం (మార్చి 6) 177వ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. మనోహరి అమ్మగారు ఇంట్లో లేరంటూ ఏడుస్తూ నీల తీసుకొచ్చిన లెటర్ తీసుకొని చదువుతాడు అమర్. ఇంట్లో ఉండి నిన్ను బాధ పెట్టలేను అమర్.. మీ బాధని తీర్చాలని ఇంటికి వచ్చాను కానీ నీకే నేను భారమవుతున్నాను అందుకే ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను నన్ను వెతకడానికి ప్రయత్నించకండి వెతికిన నేను దొరకను ఎక్కడికి వెళ్తున్నాను నాకే తెలియదు అని లెటర్లో రాసిపెట్టి వెళ్ళిపోతుంది మనోహరి.
అమర్ ఏమైందిరా లెటర్ లో ఏముంది అని అడుగుతుంది నిర్మల. అమ్మ.. మనోహరి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్లి పోయిందో తెలియదు అంటాడు అమర్. నీలా.. మనోహరి ఎక్కడికి వెళ్ళిందో నీకేమైనా తెలుసా అని అడుగుతాడు. నీల మౌనంగా ఉన్నావు అంటే నీకు నిజంతెలుసు చెప్పు మనోహరి ఎక్కడ ఉంది అంటాడు.
పోలీసులకు, మీడియాకు మనోహరి ఫోన్
రూపవతి హోటల్లో ఉన్నారు బాబు గారు చెబుతుంది నీల. అయితే నేను వెంటనే వెళ్లి తీసుకొస్తాను అని వెళ్ళిపోతాడు అమర్. సార్ నేను కూడా వస్తాను అంటాడు రాథోడ్. నువ్వు మిస్సమ్మ వాళ్ళని చూసుకో రాథోడ్ అంటూ అమర్ వెళ్ళిపోతాడు. మనోహరి ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి కారణం ఏమై ఉంటుంది అని భాగమతి ఆలోచిస్తుంది.
రాథోడ్.. ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోవాలనుకున్నది అయితే లెటర్ రాసిపెట్టి వెళ్ళిపోతుంది, కానీ నీలకి నిజం ఎందుకు చెప్తుంది అండి నీలకి చెప్పి వెళ్ళింది అంటే దీని వెనక ఏదో జరుగుతుంది అంటుంది భాగమతి. మరి నిజమేంటో తెలియాలంటే ఎలా అమ్మ అంటాడు రాథోడ్. వెంటనే మా మామయ్య ని కలవాలి పదండి వెళ్దాం అంటుంది భాగమతి. భాగీ ఎక్కడికి వెళ్తున్నావ్ అమ్మ అని రామ్మూర్తి అడుగుతాడు. మామయ్యని కలవడానికి వెళుతున్నాను నాన్న అంటూ భాగమతి వెళ్ళిపోతుంది.
అమర్ నీ ప్రేమను పొందిన తర్వాతే పెళ్లి చేసుకుందాం అనుకున్నాను కానీ ఏం చేయను నువ్వు నాకు దక్కనివ్వకుండా ముందు అక్క వచ్చింది. ఆ తరువాత ఇప్పుడు చెల్లెలు వస్తుంది అందుకే ఇలా చేయాల్సి వస్తుంది అని మనోహరి అనుకుంటుంది. ఇంతలో అమర్ హోటల్ కి వస్తాడు. అమర్‌ని చూసిన మనోహరి పోలీసులకి మీడియాకి ఫోన్ చేసి హోటల్లో రైడింగ్ చేయమని చెబుతుంది.
రిసెప్షన్ దగ్గర మనోహరి రూమ్ నెంబర్ అడిగి పైకి వెళ్లి డోర్ కొడతాడు అమర్. మనోహరి డోర్ ఓపెన్ చేస్తుంది. మనోహరి రా ఇంటికి వెళ్దాం అంటాడు. నేను రాను అమర్ ముందు లోపలికి రా అంటుంది మనోహరి. అమరేంద్ర లోపలికి వచ్చాక గడియ పెడుతుంది మనోహరి. చెప్పు మనోహరి ఇంట్లో నుంచి ఎందుకు వెళ్లిపోవాలనుకుంటున్నావు అని అడుగుతాడు అమర్.
చెప్పాను కదా అమర్ లేటర్ లో రాసి పెట్టాను కదా అంటుంది మనోహరి. ఫస్ట్ అయితే ఇంటికి వెళ్దాం ఆ తరువాత నువ్వు ఎక్కడికి వెళ్తాను అన్న నీ ఇష్టం నేను తీసుకువెళ్లి నిన్ను వదిలిపెడతాను కానీ ముందు ఇంటికి వెళ్దాం పద అమ్మ నాన్న అందరం కలిసి ఒక నిర్ణయానికి వద్దాం అంటాడు అమర్.
అమర్‌కు, తనకు పెళ్లని చెప్పిన మనోహరి
ఈ పోలీసులు రాకముందే అమర్ తీసుకుపోయేలా ఉన్నాడే అని మనోహరి ఆలోచిస్తూ ఉండగా ఇంతలో డోర్ కొట్టిన సౌండ్ వస్తుంది. అమర్ డోర్ ఓపెన్ చేయగానే ఫటాఫటా ఫోటోలు తీస్తూ ఉంటారు మీడియా వాళ్ళు. ఆపండి ఆపండి అంటాడు అమర్. ఏంటి సార్ ఇదంతా అని అడుగుతాడు. బాధ్యత గల ఆఫీసరై ఉండి ఇలా వ్యభిచారం చేస్తారా అని ఎస్ఐ అంటాడు.
సార్ ఏమంటున్నారు అతను లెఫ్టినెంట్ అమరేంద్ర తన గురించి ఒక్క మాట తప్పుగా మాట్లాడకండి అంటుంది మనోహరి. సార్ ఇంట్లో ప్రైవసీ లేదని హోటల్ కి వచ్చి ఎంజాయ్ చేస్తున్నారా ఒకరికి చెప్పాల్సిన మీరే ఇలా చేస్తే ఎలా సార్ అని మీడియా అమ్మాయి అంటుంది. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు ఏమోనే అని ఇంకొక అమ్మాయి అంటుంది.
చూడండి మేము ఏ తప్పు చేయలేదు తను నా వైఫ్ ఫ్రెండ్ తనని తీసుకువెళ్లడానికి వచ్చాను అంటాడు అమర్. వైఫ్ ఫ్రెండ్ అనే చెబుతున్నారు ఇంట్లో కుదరటం లేదా సార్ ఇలా లాడ్జి లోకి వచ్చారు అని ఇంకొక అమ్మాయి అంటుంది. అవన్నీ తెలియదు సార్ మీరు పట్టపగలు ఇలా హోటల్లో రూమ్ తీసుకున్నప్పుడు రైడ్ జరిగింది మిమ్మల్ని అరెస్టు చేస్తున్నాం అంటాడు ఎస్ఐ.
అమర్‌ని అరెస్టు చేస్తూ తీసుకు వెళ్తూ ఉండగా మనోహరి ఎస్సైని బ్రతిమలాడుతూ ఉంటుంది. కానీ వినిపించుకోకుండా తీసుకువెళ్తూ ఉంటాడు ఎస్ఐ. వెంటనే మనోహరి సార్ మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం అని చెబుతుంది మనోహరి. మనోహరి ఏం మాట్లాడుతున్నావ్ అంటాడు అమర్. నువ్వేం మాట్లాడకు అమర్ అంటుంది మనోహరీ. చూడండి కొద్ది రోజుల్లోనే మా పెళ్లి జరగబోతుంది అదే పని మీద ఇక్కడికి వచ్చాం మీకు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చుంటారు అని మనోహరి చెబుతుంది.
భాగీకి నిజం చెప్పిన కాళీ
అది జరిగింది భాగీ అని కాళీ జరిగిందంతా చెబుతాడు. నువ్వు చెప్పేది ఎలా నమ్మమంటావు మామయ్య అంటుంది భాగమతి. ఆ మనోహరి ఏం చేయాలనుకుంటుంది ఏమో నాకు తెలియదు కానీ ఆ మేడాన్ని చంపేయమని చెప్పింది ఆమె చెప్తేనే నేను సరస్వతి మేడాన్ని చంపేయాలనుకున్నాను ఇది మాత్రం నిజం అని అంటాడు కాళీ. ఇదంతా నిజమేనా మామయ్య.. నాన్న ఆరోగ్యాన్ని మీరు అవకాశం గా తీసుకొని పెళ్లి చేసుకోవాలని చూశారు ఇప్పుడు మీ మాటలు ఎలా నమ్మమంటారు అని అంటుంది భాగమతి.
భాగీ నిన్ను పెళ్లి చేసుకోవడానికి అబద్ధాలు చెప్పాను కానీ ఒక మనిషిని చంపే అంతా నాకు లేదు ఆవిడ ఎవరో కూడా నాకు తెలియదు అలాంటి ఆవిడని నేను ఎందుకు చంపుతాను చెప్పు కానీ మనోహరి మాత్రం ఆవిడ అమర్‌కి నిజం చెప్పకూడదు వెంటనే చంపేసేమని చెప్పింది అని అంటాడు కాళీ. అవునమ్మా సరస్వతి మేడం ఆరోజు అమరేంద్ర సార్ కి ఏదో చెప్పాలంటూనే వస్తుంది అప్పుడే యాక్సిడెంట్ అయింది అంటాడు రాథోడ్. ఇప్పుడు నిజం ఎందుకు చెప్తున్నావ్ మామయ్య అని అడుగుతుంది భాగమతి. నిజం చెప్తే నైనా నన్ను ఆ మనోహరి నుంచి కాపాడుతావని చెప్తున్నాను భాగీ అంటాడు కాళీ. రాథోడ్ వెళ్దాం పద అంటూ భాగమతి బయటికి వస్తుంది.
మనోహరి గారు సరస్వతిని మేడాన్ని ఎందుకు చంపించాలని అనుకుంటుంది తనని చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసింది కదా అంటుంది భాగమతి. ఎందుకు ఆ పని చేసిందో ఎవరికీ తెలియదు అమ్మ అసలు ఆవిడ మొదటి నుంచి తేడా మనిషి అంటాడు రాథోడ్. సరస్వతి మేడాన్ని చంపించాలనుకుంది అంటే ఇప్పుడు ఆవిడ ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి కూడా ఏదో కారణం ఉంటుంది రాథోడ్ అదేంటో ఎలా తెలుసుకోవాలి అంటుంది భాగమతి.
నిర్మల టీవీ పెట్టగానే అమరేంద్ర, మనోహరి గురించి టీవీలో వస్తుంది. అది చూసి శివరామ్ ని పిలుస్తుంది నిర్మల. టీవీలో వాళ్ళిద్దరి గురించి తప్పుడు సమాచారం వినగానే కుప్పకూలిపోయి ఏడుస్తుంది నిర్మల. అది విన్న శివరామ్ కూడా షాక్ అయిపోతాడు. రామ్మూర్తి బాగి కి ఫోన్ చేసి ఒకసారి టీవీ చూడమ్మా అమరేంద్ర బాబు గురించి మనోహరి గురించి తప్పుడు సమాచారం వస్తుంది అని చెబుతాడు. వెంటనే భాగీ పోలీస్ స్టేషన్ లోకి వెళ్లి టీవీ చూడగానే అందులో అమరేంద్ర మనోహరి కనిపిస్తారు. మనోహరి ప్లాన్ ఫలిస్తుందా? అమర్, మనోహరి పెళ్లి జరుగుతుందా? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు మార్చి 6న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తప్పకుండా చూడాల్సిందే!
టాపిక్