NNS 5th March Episode: పెళ్లికోసం హోటల్‌కి రప్పించి అమర్ పరువు తీసేసిన మనోహరి.. నిజం తెలుసుకున్న భాగమతి!
NNS 5th March Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ మంగళవారం (మార్చి 5) ఎపిసోడ్లో పెళ్లికోసం అమర్ ను హోటల్‌కి రప్పించి మనోహరి పరువు తీసేయడం.. భాగమతి నిజం తెలుసుకోవడంలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు జరిగాయి.
NNS 5th March Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం సీరియల్ మంగళవారం (మార్చి 5) 176వ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఏంటమ్మగారు మీరేమో పెళ్లి చేసుకుని జతకట్టాలని చూస్తుంటే ఆయనేమో ఇలా మాట్లాడుతున్నారు అంటుంది నీల. మాటలతో మాయ చేయాలి మనసు గెలుచుకోవాలి అనుకున్నాను కానీ దానికి టైం లేదు, రేపే నాకు, అమర్ కి పెళ్లికి ముహూర్తం పెట్టించేసేయాలి, అమర్ నన్ను పెళ్లి చేసుకుంటానని అందరి ముందు చెప్పేలా చేయాలి అంటుంది మనోహరి.
ఏంటమ్మా మీరనేది అంటుంది నీల. రేపు నువ్వే చూస్తావు గా నేనాడబోయే ఆట అమర్ ని ఎలా బలి చేస్తాను అంటుంది మనోహరి. పద్మవ్యూహం నుంచి అయినా బయటపడొచ్చు కానీ ఈమె వేసే ప్లాన్లో ఇరుక్కుంటే బయటపడడం చాలా కష్టం అనుకుంటుంది నీల.
భాగీకి కాళీ ఫోన్
మరోవైపు మంగళ.. కాళీని చూడడానికి పోలీస్ స్టేషన్ కి వెళుతుంది. అక్క బెయిల్ పేపర్ తెచ్చినవా నన్ను విడిపించు అంటాడు కాళీ. మీ బావ నన్ను ఎన్ని మాటలు అన్నాడో తెలుసారా అంటుంది మంగళ. ఏంది అక్క నువ్వు నన్ను విడిపించడానికి రాలేదా? మనోహరి ఏది? అని అడుగుతాడు కాళీ. ఆవిడకు ఎన్ని పనులు ఉంటాయి రా అంటుంది మంగళ. నువ్వు కూడా ఆమెతో చేతులు కలిపి నన్ను ఇద్దరూ సైడ్ చేద్దామని చూస్తురా? నాతో పెట్టుకుంటే మనోహరికి ఏం జరుగుతుందో తెలియజేస్తాను అంటాడు కాళీ.
ఒరేయ్ తమ్ముడు ఇప్పుడు ఆవిడతో పంచాయతీ పెట్టుకోకు రా అంటుంది మంగళ. ఒకసారి ఫోన్ అయితే ఇవ్వక్క అని కాళీ ఫోన్ తీసుకొని భాగమతికి ఫోన్ చేస్తాడు. ఏంటి పిన్ని ఎందుకు ఫోన్ చేసావని భాగమతి అడుగుతుంది. నేను భాగీ.. మీ మామయ్యని అని అంటాడు కాళీ. నాకు ఎందుకు ఫోన్ చేశావు అని అడుగుతుంది భాగమతి.
భాగీ.. నేను చెప్పేది విను మనోహరికి, ఆ ఇంటికి సంబంధించిన విషయాలు నీకు చెప్తాను ఒకసారి నిన్ను కలవాలి అంటాడు కాళీ. నీలాంటి వాళ్ళతో మాట్లాడమే తప్పు అని భాగి ఫోన్ కట్ చేస్తుంది. ఎవరికి ఫోన్ చేసావ్ రా నెంబర్ కూడా డిలీట్ చేసావు అని మంగళ అడుగుతుంది. ఫ్రెండ్ కి ఫోన్ చేశాను అక్క అంటాడు కాళీ. సరేలే మధ్యాహ్నం భోజనం చెయ్ అంటూ మంగళ వెళ్ళిపోతుంది.
హోటల్‌కు మనోహరి
మనోహరి ఒక హోటల్ కి వచ్చి ఒక రూమ్ కావాలని అడుగుతుంది. ఆధార్ కార్డు ఇవ్వండి మేడం అని అతను అడుగుతాడు. రూమ్ కి వెళ్తుంది మనోహరి. మనోహరి కి మంగళ ఫోన్ చేస్తుంది. మంగళ సాయంత్రం వరకు నాకు ఫోన్ చేయొద్దు అని చెప్పడానికి ఫోన్ ఎత్తాను అంటుంది మనోహరి. మేడం కాళీ ఎవరికో ఫోన్ చేసి నెంబర్ డిలీట్ చేశాడు మీరు జాగ్రత్తగా ఉండండి అని చెబుతుంది మంగళ.
నన్ను మీ తమ్ముడు ఏం చేయగలడు నువ్వు ఫోన్ పెట్టేయ్, నేను తర్వాత మాట్లాడుతాను అని మనోహరి ఫోన్ కట్ చేస్తుంది. ఏది చేయాలన్నా నన్ను దాటి మీరు చేయలేరని నాకు తెలుసు ఇక్కడ ప్లాన్ పూర్తయ్యాక తర్వాత వాడి సంగతి చూస్తాను అని మనోహరి అనుకుంటుంది. భాగమతి, రామ్మూర్తి అమర్ ఇంటికి వస్తారు. భాగీ ఏంటి ఇక్కడికి వచ్చింది అని అరుంధతి అనుకుంటుంది. మీరేంటి సార్ ఇలా వచ్చారు అంటాడు రాథోడ్. జరిగిన తప్పుకి సార్ కాళ్ళ మీద పడి క్షమాపణ అడగడానికి వచ్చాను అంటాడు రామ్మూర్తి.
ఇంత పెద్ద మాటలు ఎందుకు సార్.. లోపలికి రండి అని రాథోడ్ వాళ్ళని తీసుకువెళ్తాడు. పిల్లలు ఒకసారి కిందికి రండి మీ స్కూల్ తాతయ్య వచ్చారు తాతయ్య తో పాటు మిస్సమ్మ కూడా వచ్చింది చెబుతాడు రాథోడ్. పిల్లలు గబగబా పరిగెత్తుకొస్తారు. నువ్వు మళ్ళీ మా ఇంటికి వస్తావని అనుకోలేదు మిస్సమ్మ అని పిల్లలు నలుగురు భాగమతిని హగ్ చేసుకుంటారు.
ఏ రక్తసంబంధం లేకపోయినా మీరు ఇంతగా మా అమ్మాయిని ప్రేమిస్తారని అనుకోలేదు అంటాడు రామ్మూర్తి. ఇంట్లో పిల్లలకి ఇంత దగ్గరగా ఎలా దగ్గరనో నాకు అర్థం కావట్లేదు నాన్న అంటుంది భాగీ. వీళ్ళ ముగ్గురి సంగతి నాకు తెలియదు కానీ నేను అంజలి గత జన్మలో అత్త కోడలు అయ్యుంటాం అందుకే ఇప్పుడు మేమిద్దరం కంటిన్యూ అవుతున్నాం అంటుంది. మిస్సమ్మ నువ్వు మళ్ళీ మమ్మల్ని చూసుకోవడానికి మా ఇంటికి ఎప్పుడు వస్తున్నావు అని అడుగుతుంది అమృత. కేర్ టేకర్ గా వచ్చినప్పుడు ఎప్పుడూ మాతోటే ఉంటానని ప్రామిస్ చేసి సగంలోనే వదిలేసి వెళ్ళిపోతే ఎలా అంటుంది అంజలి.
మా అమ్మ ఎలా చూసుకునేదో అచ్చం నువ్వు అలాగే మమ్మల్ని చూసుకున్నావు మిస్సమ్మ అంటుంది అమృత. అందుకే మా అమ్మలా నువ్వు మళ్ళీ మాకు దూరం అవుతావని భయపడ్డాను అంటుంది. అంటే ఇన్ని రోజులు మీరు చెప్పిన కేర్ టేకర్ మా అమ్మాయేనా అంటాడు రామ్మూర్తి. అవును తాతయ్య అంటుంది అమృత. భాగీ నువ్వు నాకోసం కేర్ టేకర్ గా కూడా పని చేస్తున్నావా అని రామ్మూర్తి బాధపడతాడు.
పిల్లల కోసం ఎప్పుడూ తల్లిదండ్రులే కష్టపడాలా తల్లిదండ్రుల కోసం పిల్లలు కష్టపడకూడదా అని భాగమతి అంటుంది. ఏంటి రామ్మూర్తి గారు ఎప్పుడొచ్చారు కూర్చోండి అంటాడు శివరామ్. మీరు మా మీద చూపించే ప్రేమని తట్టుకోలేకపోతున్నాం.. బాబు గారు ఉన్నారా.. పిలవండి క్షమించమని అడుగుతాం అంటాడు రామ్మూర్తి. క్షమించమని అడిగే అంత తప్పు మీరేం చేశారండీ మేమెంత బాధపడుతున్నామో మీరు అంతే బాధపడుతున్నారు నిన్న జరిగినవన్నీ మర్చిపోండి అంటాడు అమర్.
మనోహరి ప్లాన్ వర్కౌట్ అవుతుందా?
నా భార్య మూర్ఖత్వానికి అన్న మాటలకి మమ్మల్ని క్షమించమని అడగడం కూడా స్వార్థమే అవుతుంది అంటాడు రామ్మూర్తి. దాని తరపున మమ్మల్ని క్షమించండి బాబు అని రామ్మూర్తి దండం పెడతాడు. చేసిందాంట్లో మీ తప్పేమీ లేదు కదా దయచేసి అలా అనకండి అంటాడు అమర్. కాళీ చిన్న చిన్న తప్పులు చేసాడే గాని మనిషిని చంపేంత దుర్మార్గుడు కాదు అంటాడు రామ్మూర్తి.
కాళీ సరస్వతిని చంపే దాని వెనక ఏదో కారణం ఉండి ఉంటుందండి లేదంటే సంబంధమే లేని మనిషిని ఆక్సిడెంట్ చేసి చంపడం కాళీకి అవసరం లేదు.. కాళీ వెనుకుండి ఇదంతా నడిపించే వాళ్ళని ఎక్కడున్నా పట్టుకుంటాను అంటాడు అమర్. మనోహరి రూమ్ లోకి వెళ్లి కూర్చొని నీలా కి ఫోన్ చేస్తుంది. చెప్పండమ్మ అని నీలా అంటుంది. నా ప్రేమని గెలిపించుకోవడానికి అరుంధతి మీద పగ తీర్చుకోవడానికి ప్లాన్ చేశాను.. నీవల్ల అది మిస్ అయింది అంటే నిన్ను చంపేస్తాను అంటుంది మనోహరి.
అలాగే అమ్మగారు అంటుంది నీల. అమర్ ఒక్కడే ఈ హోటల్ కి వచ్చేలా చేయి అని చెబుతుంది మనోహరి. అలాగే అని నీలా ఏడుస్తూ అమరేంద్ర దగ్గరికి పరిగెత్తుతుంది. మనోహరి అమ్మగారు అంటూ ఏడుస్తుంది నీల. ఇంత చిన్న వయసులోనే చనిపోయిందా అంటాడు రాథోడ్. అలా అంటావేంటి రాథోడ్.. మనోహరి అమ్మగారు ఇంట్లో నుంచి వెళ్లిపోయారు తన గదిలో ఈ లెటర్ దొరికింది అని అమర్‌కి లెటర్ ఇస్తుంది నీల. హోటల్‌కి వెళ్లిన మనోహరి ఏం చేయబోతుంది? మనోహరి ప్లాన్‌ని భాగమతి ఎలా తిప్పి కొడుతుంది? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు మార్చి 5న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తప్పకుండా చూడాల్సిందే!