NNS 04th November Episode: పిల్లల మనసుల్లో విషం నింపిన మనోహరి.. భాగీ ఆలోచనల్లో అమర్​.. మిస్సమ్మకే అర్హత ఉందన్న రాథోడ్​​​-zee telugu serial nindu noorella saavasam today 4th november episode nns serial today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns 04th November Episode: పిల్లల మనసుల్లో విషం నింపిన మనోహరి.. భాగీ ఆలోచనల్లో అమర్​.. మిస్సమ్మకే అర్హత ఉందన్న రాథోడ్​​​

NNS 04th November Episode: పిల్లల మనసుల్లో విషం నింపిన మనోహరి.. భాగీ ఆలోచనల్లో అమర్​.. మిస్సమ్మకే అర్హత ఉందన్న రాథోడ్​​​

Hari Prasad S HT Telugu
Nov 04, 2024 07:28 AM IST

NNS 04thNovember Episode: నిండు నూరేళ్ల సావాసం సోమవారం (నవంబర్ 4) ఎపిసోడ్‌లో భాగీపై లేనిపోనివి చెప్పి పిల్లల మనసులో విషం నింపుతుంది మనోహరి. అటు అమర్ భాగీ ఆలోచనల్లో పడిపోగా.. మరోసారి పిల్లలు మిస్సమ్మకు దూరమయ్యే పరిస్థితి వస్తుంది.

పిల్లల మనసుల్లో విషం నింపిన మనోహరి.. భాగీ ఆలోచనల్లో అమర్​.. మిస్సమ్మకే అర్హత ఉందన్న రాథోడ్​​​
పిల్లల మనసుల్లో విషం నింపిన మనోహరి.. భాగీ ఆలోచనల్లో అమర్​.. మిస్సమ్మకే అర్హత ఉందన్న రాథోడ్​​​

NNS 04th November Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం ఈరోజు (నవంబర్ 4) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. భాగీ గురించి తండ్రి శివరాం చెప్పిన మాటలు గురించి ఆలోచిస్తుంటాడు అమర్‌. ఇంతలో భాగీ వస్తుంది. అలాగే చూస్తుండిపోతాడు. భాగీ దగ్గరకు రాగానే ఏమీ అనకుండా వెళ్లిపోతాడు.

పిల్లలకు నూరిపోసిన మనోహరి

అంజు కోపంగా అమ్ము వాళ్ల దగ్గరకు వెళ్లి.. మిస్సమ్మ అమ్మ ఫోటో బయట పడేసి కాలితో తొక్కిందని చెప్తుంది. పిల్లలు మేము నమ్మం అంటారు. అమ్మ విషయంలో నేను అబద్దం చెప్తానా..? అంటుంది అంజు. కానీ నువ్వు తప్పు చేసింది అని చెప్తుంది మిస్సమ్మ గురించి అంటుంది అమ్ము. అవును అంజు మిస్సమ్మకి అమ్మ స్థానం కావాలంటే ఎంతసేపు అంటాడు ఆకాష్​. మీరు నమ్మినా నమ్మకపోయినా నిజం ఇదే అంటుంది అంజు.

నువ్వు చూశావా..? మిస్సమ్మ ఫోటో కింద పడేసి తొక్కడం నువ్వు చూశావా..? అని అడుగుతుంది అమ్ము. అమ్మ ఫోటో మిస్సమ్మ తీసుకెళ్ళడం నేను చూశాను. కింద పడేసి తొక్కడం మనోహరి ఆంటీ చూసింది అని చెప్పగానే మనోహరి వచ్చి నేను చెప్పానా..? ఎవరూ నమ్మరని ముందే చెప్పానా..? అంటూ మిస్సమ్మ ఆ ఫోటో తొక్కడం నేను చూశాను అని చెప్తుంది మనోహరి. పిల్లలు షాక్‌ అవుతారు. మనోహరి లేనిపోని కట్టుకథలు చెప్పడంతో పిల్లలు ఆలోచనలో పడిపోతారు.

ఫొటో తీసుకెళ్లానన్న భాగీ

భాగీ వచ్చి పిల్లలను స్కూల్ కు రెడీ అయ్యారా? అని అడుగుతుంది. మిస్సమ్మ నిన్న మా రూంలో నుంచి ఫోటోను తీసుకెళ్లావా..? అని అడుగుతుంది అమ్ము. అవును తీసుకెళ్లాను అంటుంది భాగీ. తప్పు అనిపించలేదా? మిస్సమ్మ.. అంటుంది అంజు. తప్పు ఎందుకు అవుతుంది. ఆ ఫోటో గురించి అడుగుదామని తీసుకొచ్చాను. తర్వాత అది ఎక్కడ ఉండాలో అక్కడకు చేర్చాను. ఎందుకు అలా అడిగారు అంటుంది భాగీ.

ఏం లేదులే.. నువ్వు వెళ్లు మిస్సమ్మ పిల్లలను నేను తీసుకొస్తాను అంటుంది మనోహరి. సరే త్వరగా రండి… స్కూల్‌ కు టైం అవుతుంది అంటూ వెళ్లిపోతుంది భాగీ. చూశారా..? జరిగింది ఎవరికి తెలియదు అని ఎలా మాట్లాడుతుందో ఇక మీరు ఎవరి పక్కన ఉంటారో మీ ఇష్టం అని చెప్పి వెళ్లిపోతుంది మనోహరి. పిల్లలు బాధపడుతారు.

ఆలోచనలో అమర్

గుప్త దగ్గర ఆరు బాధపడుతుంది. మనోహరి తన ప్లాన్‌ ప్రకారం పిల్లలను అడ్డుపెట్టుకుని ఏదో చేయబోతుంది అంటుంది. ఇంతలో అమర్‌ ఆఫీసుకు వెళ్తుంటే ఆరు వెళ్లి పలకరిస్తుంది. కారు దగ్గరకు వచ్చిన అమర్‌ తూలి కిందపడబోతుంటే.. సార్‌ ఏమైంది సార్‌.. అని అడుగుతాడు రాథోడ్​. ఏం కాలేదు రాథోడ్‌.. చూసుకోలేదు అంటాడు అమర్​. మీరు చూసుకోకుండా నడుస్తున్నారా..? ఏమైంది సార్‌ దేని గురించి అంతలా ఆలోచిస్తున్నారు అంటాడు రాథోడ్​. నా గురించి, మిస్సమ్మ గురించి, మా ప్రమేయం లేకుండా మా మధ్య ముడిపడిన బంధం గురించి. నేను నిర్వర్తించాల్సిన బాధ్యతల గురించి అంటాడు అమర్​.

అసలు ఏమైంది సార్‌ అని రాథోడ్‌ అడగ్గానే శివరాం చెప్పిన మాటలు అమర్‌ గుర్తు చేసుకుని నాన్నకు ఎలా చెప్తే అర్థం అవుతుందో నాకు అర్థం కాలేదు రాథోడ్ అంటాడు. దీంతో పెద్దయ్య గురించి చెప్పింది కూడా కరెక్టే సార్‌ అంటాడు రాథోడ్‌. పాపం మిస్సమ్మ పెళ్లి అయిన రోజు నుంచి మీ బదులు కూడా తనే పరుగెడుతుంది అంటాడు. మిస్సమ్మ ఎవరో తెలిశాక మంచి జీవితం ఇవ్వాలనిపిస్తుంది కానీ.. తనతో జీవితం పంచుకోవాలని ఎలా అనుకోవాలో తెలియటం లేదు రాథోడ్‌ అంటాడు అమర్​.

ఆరు సంతోషిస్తుందన్న రాథోడ్

వారిరువురు ఏవో బాధలు పంచుకుంటున్నారు మనం వెళ్దాం పద అంటాడు గుప్త. ఆగండి గుప్త గారు బాధలు కాదు.. వాళ్లిద్దరికి తెలిసిన విషయాల గురించి మాట్లాడుకుంటున్నారు. అదేంటో తెలుసుకుందాం ఉండండి అంటుంది ఆరు. ఆరును దాటి జీవితాన్ని చూసుకోలేకపోతుంటే ఇప్పుడు అదే జీవితాన్ని మిస్సమ్మ తో పంచుకోవాలంటే ఎలా రాథోడ్‌ అంటాడు అమర్​.

మీ బాధ నాకు అర్థం అయింది సార్‌. కానీ మేడం గారు ఏ లోకంలో ఉన్నా నిజం తెలియగానే ఇదే కోరుకునే వారు సార్‌. అన్ని తెలిసి నిజం కూడా తెలిశాక చెప్తున్నాను సార్‌. మేడం గారి తర్వాత ఈ ఇంటికి కోడలుగా మీకు భార్యగా ఉండే హక్కు ఒక్క మిస్సమ్మే ఉంది సార్ అని చెప్తాడు రాథోడ్​.

భాగీతో మాట్లాడని పిల్లలు

భాగీ పిల్లలను పిలిచి స్కూల్‌కు పంపిస్తుంది. పిల్లలు కోపంగా భాగీతో మాట్లాడకుండా వెళ్లిపోతారు. అంతా గమనించిన ఆరు.. మనోహరి పిల్లల మనసుల్లో విషం నింపుతుంది గుప్త గారు అంటుంది. భాగీ కూడా మనోహరిని పిలిచి పొద్దున్న పిల్లల రూంకి ఎందుకు వెళ్లావు వాళ్లతో ఏం మాట్లాడావు దేని గురించి మాట్లాడావు అని నిలదీస్తుంది.

పక్కింటి అక్క ఫోటో గురించి ఎందుకు అడిగారు అంటూ ప్రశ్నిస్తుంది. దీంతో ఏం మాట్లాడకుండా వెళ్లిపోతుంది మనోహరి. ఆరు ఫొటో పాడు చేసింది మనోహరి అని పిల్లలకు తెలుస్తుందా? భాగీతో జీవితం పంచుకోడానికి అమర్​ ఇష్టపడతాడా? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు నవంబర్​ 04న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తప్పకుండా చూడాల్సిందే!

Whats_app_banner