NNS 03rd August Episode: సరస్వతి మేడం గురించి తెలుసుకున్న మిస్సమ్మ.. మనోహరికి షాక్.. ఆశ్చర్యంలో అమర్ కుటుంబం!
NNS 03rd August Episode: నిండు నూరేళ్ల సావాసం శనివారం (ఆగస్ట్ 3) ఎపిసోడ్లో సరస్వతి మేడం గురించి మిస్సమ్మ తెలుసుకుంటుంది. మరోవైపు అమర్ కుటుంబం మొత్తం హాస్పిటల్ కు బయలుదేరుతుండగా.. మనోహరి ఆందోళనలో మునిగిపోతుంది.
NNS 03rd August Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం ఈరోజు (ఆగస్ట్ 3) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. హాస్పిటల్‌కి వెళ్దాం తయారవమని అమర్ చెప్పగానే రామ్మూర్తికి ఇష్టమైనవన్నీ వండి క్యారేజ్ కడుతుంది భాగీ. ఏంటి మిస్సమ్మ ఇన్ని పెడుతున్నావు అంటుంది నిర్మల. డాక్టర్ని అడిగాను అత్తయ్య.. నాన్నకి అన్నీ పెట్టొచ్చు అన్నారు అందుకే ఆయనకి ఇష్టమైనవన్నీ వండాను అంటుంది మిస్సమ్మ.
అచ్చూ ఆరులాగే భాగీ
నువ్వు అచ్చు మా ఆరు పోలికే మిస్సమ్మ. నిన్ను, తనని పక్కపక్కన నిల్చోబెడితే నూటికి తొంభై శాతం ఒకేలా ఉంటారు. పోలికలు, ప్రవర్తన అన్నీ సేమ్ టు సేమ్. ఇద్దరు వ్యక్తుల మనస్తత్వాలు ఇంతలా ఎలా సరిపోతాయో అర్థం కావట్లేదు అంటుంది నిర్మల. నాన్న ఆరోగ్యం కుదుటపడిందని సంతోషంగా ఉన్నా ఆయన ఎంతగానో ఆరాటపడుతున్న అక్క విషయం కూడా తెలిస్తే ఆయన మనసు కూడా కుదుటపడుతుంది అత్తయ్య అంటుంది మిస్సమ్మ. అమర్ ఆరు తల్లిదండ్రులను వెతికే క్రమంలో మీ అక్క గురించి కూడా తెలుస్తుందిలే అంటుంది నిర్మల.
అడ్డుపడిన మనోహరి
అమర్ కిందకి రావడంతో అందరూ హాస్పిటల్‌కి బయల్దేరతారు. అప్పుడే మనోహరి వచ్చి ఏంటి అమర్.. నేను అక్కర్లేదని వెళ్తున్నారా? నన్ను మర్చిపోయి వెళ్తున్నారా? అంటుంది. పెళ్లికి వెళ్తూ పిల్లినెవరు చంకన పెట్టుకుని వెళ్తారు అంటాడు శివరామ్. అదేంటి అమర్ నాన్నని చూడటానికి నేను రావొద్దా.. మిస్సమ్మ.. ఆయన నన్ను పెద్దకూతురు అన్నారు నాన్నని నేను చూడొద్దా అంటుంది మనోహరి.
అయ్యో మనోహరి నువ్వు రాకపోతే ఎలా ఆ హాస్పిటల్లోనే వార్డెన్గారు కూడా ఉన్నారు కదా.. ఇవాళ ఆవిడకి స్పృహ వస్తుందని అన్ని విషయాలు చెప్పేస్తుందని నాకు బలంగా అనిపిస్తుంది అంటుంది మిస్సమ్మ. మనోహరి కంగారు పడుతుంది. అందరూ కలిసి బయల్దేరుతుండగా రాథోడ్ వచ్చి సరస్వతి మేడమ్ గురించి చెబుతాడు. అరుంధతి మేడమ్ ప్రార్థన అనాథాశ్రమం నుంచి సరస్వతి మేడమ్ దగ్గరకి వచ్చిందట అనగానే సరస్వతి మేడమ్ మీకు తెలుసా అని అడుగుతుంది మిస్సమ్మ.
హాస్పిటల్‌కు అమర్ కుటుంబం
అదేంటి మిస్సమ్మ.. ఆవిడ నీకు కూడా బాగా తెలుసు అంటుంది నిర్మల. ఆశ్చర్యంగా చూస్తున్న మిస్సమ్మతో.. అదే ఆ రోజు మీ ఇంట్లో ఉందన్న ఆవిడే సరస్వతి వార్డెన్ అంటాడు అమర్. అయితే ఆమె దగ్గరే మా అక్క కూడా పెరిగింది. ఆవిడని కలిస్తే మా అక్క గురించి కూడా తెలుస్తుంది అంటుంది మిస్సమ్మ. అందరూ కలిసి హాస్పిటల్‌కి బయల్దేరతారు. అరుంధతి కూడా కార్లో కూర్చుంటుంది.
పిల్లలు లంచ్ చేయడానికి కూర్చుంటారు. అమ్ము మిస్సమ్మ గురించి పొడుగుతూ ఉంటుంది. అంతలో అంజు స్కూల్లో బంటీ అనే అబ్బాయితో మళ్లీ గొడవపడుతుంది. ఆగస్ట్ 15 వేడుకలు స్కూల్ లీడర్‌గా అమ్మునే ఆ సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా చేస్తుందని శపథం చేస్తుంది.
అదేంటే.. డాడీని అడగకుండా అలా ఎలా మాటిచ్చావు, క్యారెక్టర్స్ కూడా చెప్పేశావు అని కంగారు పడుతుంది అమ్ము. అదంతా నేను చూసుకుంటాలే అంటుంది అంజు. బంటి మేడమ్‌కి కంప్లైంట్ చేస్తానంటాడు. హాస్పిటల్‌కి వెళ్లిన అమర్‌కి నిజం తెలుస్తుందా? సరస్వతి మేడమ్ స్పృహలోకి వస్తుందా? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు ఆగస్టు 03న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తప్పకుండా చూడాల్సిందే!