NNS 31st December Episode: రాథోడ్​ అనుమానం.. మిస్సమ్మ ప్లాన్​.. మనోహరి కొత్త నాటకం.. హాల్లో అరుంధతి ఫొటో!-zee telugu serial nindu noorella saavasam today 31st december episode nns serial today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns 31st December Episode: రాథోడ్​ అనుమానం.. మిస్సమ్మ ప్లాన్​.. మనోహరి కొత్త నాటకం.. హాల్లో అరుంధతి ఫొటో!

NNS 31st December Episode: రాథోడ్​ అనుమానం.. మిస్సమ్మ ప్లాన్​.. మనోహరి కొత్త నాటకం.. హాల్లో అరుంధతి ఫొటో!

Hari Prasad S HT Telugu
Dec 31, 2024 06:00 AM IST

NNS 31st December Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ మంగళవారం (డిసెంబర్ 31) ఎపిసోడ్లో హాల్లో అరుంధతి ఫొటోను పెట్టకుండా ఆపుతుంది మనోహరి. మరోవైపు ఆరు అస్థికలు మనోహరికి దొరకకుండా కొత్త ప్లాన్ వేస్తుంది మిస్సమ్మ.

రాథోడ్​ అనుమానం.. మిస్సమ్మ ప్లాన్​.. మనోహరి కొత్త నాటకం.. హాల్లో అరుంధతి ఫొటో!
రాథోడ్​ అనుమానం.. మిస్సమ్మ ప్లాన్​.. మనోహరి కొత్త నాటకం.. హాల్లో అరుంధతి ఫొటో!

NNS 31st December Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం ఈరోజు (డిసెంబర్ 31) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఆరు అస్థికలు తాకిన భాగీ ఎమోషనల్​ అవడంతో నిజం తెలిసిన అమర్​ లోలోపలే బాధపడతాడు. స్టోర్ రూంలోకి వెళ్లి ఆరు ఫోటో తీసుకుంటాడు. ఫోటో చూస్తూ.. ఆరుతో ఉన్న మధుర జ్ఞాపకాలు గుర్తు చేసుకుని ఏడుస్తుంటాడు. చావు కూడా మనల్ని వేరు చేయలేదని నువ్వు అంటే నేను ఏమో అనుకున్నాను. కానీ నువ్వు చనిపోయినా కూడా నా చుట్టే ఉన్నావా అనుకుంటాడు.

yearly horoscope entry point

రాథోడ్‌కు ప్లాన్ చెప్పిన మిస్సమ్మ

మిస్సమ్మను బయటకు తీసుకుకెళ్లిన రాథోడ్‌.. మనోహరి శ్మశానానికి వచ్చిన విషయం చెప్తాడు. అసలు మనోహరి ఏం చేయాలనుకుంటుంది. మనోహరికి కావాల్సింది ఆయన పక్కన ఉండటం.. నేను లేకుండా పోవడం అయినా అక్క అస్థికలు తీసుకుని ఏం చేసుకుంటుంది అంటూ ఆలోచిస్తారు. ఇంతలో మనోహరి కచ్చితంగా ఘోర కోసమే అస్థికలు తీసుకోవాలని చూస్తుంది అని మిస్సమ్మ చెప్పగానే.. అంత కచ్చితంగా ఎలా చెప్తున్నావు మిస్సమ్మ అని రాథోడ్‌ అడుగుతాడు.

నువ్వే ఆలోచించు అక్క ఆత్మ మన చుట్టే తిరుగుతుంది. అక్క చనిపోయిన తర్వాతే ఘోర ఈ ఇంటి చుట్టు తిరుగుతున్నాడు. ఇంట్లోకి ఇన్ని సార్లు వచ్చిన ఘోర ఇంట్లోంచి ఏమీ తీసుకెళ్లలేదు. ఘోరాకు హెల్ప్‌ చేస్తుంది మనోహరి అనే అనుమానం ఉంది. జరిగినవన్నీ ఒక్కసారి ఆలోచిస్తే క్లారిటీ వస్తుంది అని మిస్సమ్మ చెప్పగానే.. అంతే మిస్సమ్మ.. అసలు మా మేడం ఇంత కసాయి వ్యక్తితో ఎలా స్నేహం చేసింది అంటాడు రాథోడ్‌. తన మాటలతో అందరినీ మాయ చేస్తుంది అని మిస్సమ్మ చెప్తుంది.

అయితే సార్‌కు చెప్తామని రాథోడ్‌ అనగానే వద్దని ఎవ్వరూ నమ్మరని మనవి అనుమానాలు మాత్రమే అవి నిజం అవ్వాలంటే మనం సాక్ష్యాలు సంపాదించాలి. ఇక మనోహరి టైం దగ్గర పడింది అని మిస్సమ్మ చెప్పగానే మనం ఏదో ఒకటి చేయడానికి ముందే ఆ మనోహరి ఆస్థికలు తీసుకెళ్లి ఘోరాకు ఇస్తుందేమో అంటూ అనుమానంతో మనం ఒక ప్లాన్‌ చేద్దాం అని తన ప్లాన్‌ రాథోడ్‌కు చెప్పగానే.. సరే మిస్సమ్మ అంటాడు.

హాల్లోకి ఆరు ఫొటో

అమర్.. ఆరు ఫోటో పెట్టకుండా ఏదైనా చేయాలని మనోహరి మనసులో అనుకుంటుంది. కిటికీలోంచి చూస్తున్న ఆరు కూడా భగవంతుడా ఇన్ని రోజులు మిస్సమ్మ నా ఫోటో చూడకుండా ఆపావు.. ఇంకొక మూడు రోజులు ఆపు స్వామి. పౌర్ణమి ముగిసిన తర్వాత ఎలాగో నేను పైకి వచ్చెదను అంత వరకు ఎలాగైనా ఆపు స్వామి అని ప్రార్థిస్తుంది. సమయం ముగిసిపోయాక ఆ జగన్నాథుడిని ప్రార్థించినా లాభం లేదు బాలిక అంటాడు గుప్త.

ఫోటో కోసం వెళ్లిన అమర్‌ ఇంకా రాలేదని పిలుచుకురావడానికి నిర్మల వెళ్తుంది. ఆరు ఫోటో చూస్తూ ఏడుస్తున్న అమర్‌ను ఓదారుస్తుంది. అరుంధతి ఎక్కడికీ పోలేదని, ఎప్పుడు నీ పక్కనే ఉంటుందని, పద నాన్నా వెళ్దాం అని చెప్పగానే అమర్‌ ఫోటో తీసుకుని హాల్‌ లోకి వస్తాడు. మనోహరి షాక్‌ అవుతుంది. బయటకు వెళ్లిన మిస్సమ్మ ను అమర్ పిలుస్తాడు. మిస్సమ్మ వస్తున్నాను అంటూ కిందకు వస్తుంది. అమర్‌.. ఆరు ఫోటోను హాల్ లో పెడుతుంటే మనోహరి ఆపుతుంది.

మనోహరి కొత్త ప్లాన్

ఒక్క నిమిషం ఆగు అమర్‌ అని చెప్తుంది. స్వామిజీ చెప్పినట్టు చేయడం మంచిదే అందుకు ఆరు ఎక్కడ ఉన్నా సంతోషిస్తుంది. కానీ అంతకు మించి బాధపడుతుంది అని మనోహరి చెప్పగానే ఏం మాట్లాడుతున్నారు మనోహరి గారు అని మిస్సమ్మ అడుగుతుంది. ఆంటీ.. ఆరు బతికి ఉన్నప్పుడు మనం ఎలా చేసేవాళ్లం.. ఈ ఇంటి దేవతలా చూసేవాళ్లం. అలాంటిది ఆరు చనిపోయిన తర్వాత ఇన్ని రోజులకు ఆరు ఫోటో ముందు దీపం పెట్టి అస్థికలు పుణ్య నదుల్లో కలపాలనుకున్నాం.

కానీ ఇలా అస్థికలు పెట్టి, దీపం వెలిగించి నన్ను దూరం చేసుకుంటారా అని బాధపడుతుంది. మనం ఇంట్లో దేవుడిని ఎలా పూజిస్తామో.. ఆరును కూడా అలాగే పూజిద్దాం అని చెప్తుంది. శివరాం కూడా మనోహరి చెప్పింది నిజమే.. రేపు ఉదయం దేవుడి ముందు దీపం వెలిగించి ఆరు ఫోటో ముందు దీపం పెడదాం అంటాడు.

అరుంధతి ఫొటో భాగీ చూస్తుందా?

సరే నాన్నా.. మిస్సమ్మ రేపు ఉదయం మనిద్దరం కలిసి దీపం వెలిగిద్దాం అని చెప్పి ఫోటో నిర్మలకు ఇచ్చి వెళ్లిపోతాడు. అస్థికలు లోపలికి తీసుకెళ్లు అంటూ నిర్మల, మిస్సమ్మకు చెప్పగానే అలాగేనని మిస్సమ్మ పైకి వెళ్తుంది. దీంతో ఊపిరి పీల్చుకున్న మనోహరి ప్రస్తుతానికైతే ఆపాను.. కానీ రేపు అది ఫోటో చూడకుండా పర్మినెంట్‌గా దాన్ని పంపించే ఏర్పాట్లు చేయాలి అని మనసులో అనుకుంటుంది.

కిటికీలోంచి అంతా చూస్తున్న ఆరు కూడా హ్యాపీగా ఫీలవుతూ.. గుప్తను తిడుతుంది. హాల్లో పెట్టిన ఆరు ఫొటోని భాగీ చూస్తుందా? తనతో మాట్లాడుతున్న పక్కింటి అక్కనే ఆ ఇంటి కోడలు అరుంధతి అని భాగీకి తెలిసిపోతుందా? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు డిసెంబర్​ 31న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తప్పకుండా చూడాల్సిందే!

Whats_app_banner