NNS 30th April Episode: మిస్సమ్మను బయటకు గెంటేసిన పిల్లలు.. ఇంట్లో నుంచి వెళ్లిపోతానన్న మనోహరి..!
NNS 30th April Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ మంగళవారం (ఏప్రిల్ 30) ఎపిసోడ్లో తమ రూమ్ లోకి భాగీ రాకుండా పిల్లలు గెంటేస్తారు. మరోవైపు ఇల్లు వదిలి వెళ్లడానికి ప్రయత్నించిన మనోమరిని అమర్ వారిస్తాడు.
NNS 30th April Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం మంగళవారం (ఏప్రిల్ 30) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. అమర్, భాగీ కుడికాలు పెట్టి ఇంట్లోకి వస్తారు. అమర్ కోపంగా వెళ్లిపోతుంటే.. అలా వెళ్ళిపోకు మీ ఇద్దరూ కలిసి దేవుడికి దీపం పెట్టి ఆశీర్వాదం తీసుకోండి మీ బంధం బలపడాలని అంటుంది నిర్మల. అమ్మ ఈ బంధమే అబద్ధం అనుకుంటుంటే ఇంకా బంధం బలంగా ఉండాలని దేవుడికి దండం ఎలా పెట్టుకుంటాను నాకు ఇలాంటివన్నీ నచ్చవు అంటాడు అమర్.
మిస్సమ్మను గెంటేసిన పిల్లలు
మిస్సమ్మ నువ్వు వెళ్లి దీపం పెట్టు అని నిర్మల సైగ చేస్తుంది. భాగమతి భయపడుకుంటూ వెళ్లి దేవుడికి దీపారాధన చేసి హారతి ఇచ్చి అమర్ దగ్గరికి వచ్చి నిలబడుతుంది. అమర్ హారతి తీసుకొని మిస్సమ్మని అక్షంతలు వేసి ఆశీర్వదించు అంటుంది నిర్మల. భాగమతి అమర్‌కి హారతి ఇస్తుంది. నిర్మల హారతి ప్లేట్ ని తీసుకొని అమర్ కాళ్లు మొక్కు ఆశీర్వదిస్తాడు అని చెబుతుంది.
భాగమతి అమర్ కాళ్ళకి నమస్కారం పెడుతుంది. కోపంతో పిడికిలి బిగించిన అమర్ అక్షింతలు తెలియకుండానే తనమీద వేసేస్తాడు. మనోహరి షాకవుతుంది. రామ్మూర్తి, కరుణ ఆనందపడతారు. రామ్మూర్తి, మంగళ వెళ్లొస్తాం అని చెప్పి బయలుదేరతారు. భాగీ పిల్లలతో మాట్లాడటానికి ప్రయత్నిస్తుంది. కానీ మిస్సమ్మ తమను మోసం చేసిందని కోపంగా ఉన్న పిల్లలు రూమ్‌లోకి వెళ్లిపోతారు.
వాళ్ల వెనకే వెళ్లి మాట్లాడదామనుకుంటుంది మిస్సమ్మ. కానీ పిల్లలు మిస్సమ్మను తమతో ఏం మాట్లాడొద్దనీ, ఇంకా తను చెప్పే మాటలు విని మోసపోవడానికి సిద్ధంగా లేమని అరుస్తారు. మిస్సమ్మ వారికి ఎంత నచ్చజెప్పాలని చూసినా ఫలితం లేకుండా పోతుంది. ఆఖరికి నలుగురు పిల్లలు కలిసి మిస్సమ్మని బలవంతంగా తమ రూమ్ నుంచి బయటకు గెంటేస్తారు.
మనోహరిని వారించిన అమర్
అమర్, భాగీల పెళ్లితో తనకి ఆ ఇంట్లో స్థానంలేకుండా పోయిందని కోపంతో రగిలిపోతుంది మనోహరి. వెంటనే తన బట్టలు సర్ది తీసుకురమ్మని నీలకు చెబుతుంది. ప్లాన్‌లో భాగంగా సూట్‌కేస్‌తో ఇంట్లో నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. వద్దమ్మా.. వెళ్లొద్దమ్మా.. అంటూ నీల మనోహరిని వారిస్తుంది. కానీ మనోహరి ప్లాన్ ప్రకారం ఇంట్లో ఎవరూ ఆమెను ఆపరు.
అదేంటి.. అని గుమ్మంలో నిల్చున్న మనోహరికి మిస్సమ్మ సామానుని లోపలకు తెస్తున్న రాథోడ్ ఎదురు పడతాడు. మిస్సమ్మ సామానుని అమర్ రూమ్‌లో సర్దమని చెబుతాడు శివరామ్. అమర్ తనకి ఇష్టం లేదని చెప్పినా లెక్కజేయకుండా ఎవరికి ఇష్టం ఉన్నాలేకపోయినా మీరిద్దరూ భార్యాభర్తలు, ఒకే గదిలో ఉండి తీరాల్సిందే అంటాడు శివరామ్.
ఇంట్లో నుంచి వెళ్లిపోతున్న మనోహరిని ఆగమంటాడు అమర్. మోసం చేసిన వాళ్లే ఇంట్లో ఉన్నప్పుడు అరుంధతికి కావాల్సిన దానివి నువ్వెందుకు వెళ్లిపోతున్నావ్ అని అడుగుతాడు. ఇప్పుడు అరుంధతికి ఆ ఇంట్లో స్థానం లేదని తాను వెళ్లిపోవడమే కరెక్టంటుంది మనోహరి. ఎందుకుమ్మా అలా మాట్లాడతావు. ఈ పెళ్లి దైవనిర్ణయం అందుకే అంగీకరించక తప్పదు. అమర్తో నీ పెళ్లి జరగనందుకు మేం కూడా బాధపడుతున్నాం అంటుంది నిర్మల.
లోకం విడిచి వెళ్లడానికి అరుంధతి రెడీ
అమర్ చెప్పడంతో ఇంట్లో ఉండేందుకు ఒప్పుకుంటుంది మనోహరి. తన ప్లాన్ ప్రకారం ఇక ఆ ఇంట్లో నుంచి తనను పంపించే వీలులేకుండా చేసుకున్నానని ఆనందపడుతుంది. పాటలు పాడుకుంటూ ఉల్లాసంగా ఉన్న చిత్రగుప్త దగ్గరకు వెళ్లి తనని వెంటనే యమలోకానికి తీసుకెళ్లమని కోరుతుంది అరుంధతి. చనిపోయినప్పటి నుంచీ నీ భర్త, పిల్లలు, కుటుంబం క్షేమంగా ఉండాలని కాంక్షిస్తూ నాతో రానని మొండికేసి ఇప్పుడేంటి అంత తొందరపడుతున్నావంటాడు గుప్త.
ఏం లేదు మీరు నన్ను వెంటనే ఇక్కడ నుంచి తీసుకెళ్లండి అంటుంది అరుంధతి. భాగీని తన భార్యగా అమర్ అంగీకరిస్తాడా? అమర్ నుంచి భాగీని దూరం చేయడానికి మనోహరి వేయబోయే ప్లాన్ ఏంటి? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు ఏప్రిల్ 30న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తప్పకుండా చూడాల్సిందే!
టాపిక్