NNS 2nd July Episode: స్టేజ్‌పై భాగీకి అమర్ ముద్దు.. కోపంలో అరుంధతి.. దొరికిపోయిన మనోహరి!
NNS 2nd July Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ మంగళవారం (జులై 2) ఎపిసోడ్లో స్టేజ్‌పై భాగీకి అమర్ ముద్దు పెడతాడు. అది అరుంధతికి కోపం తెప్పించగా.. మరోవైపు ఫంక్షన్ కు వచ్చిన తన భర్తను చూసి మనోహరి షాక్ తింటుంది.
NNS 2nd July Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం మంగళవారం (జులై 2) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. అమర్ తన కుటుంబాన్ని తీసుకుని ఆర్మీ మేజర్ రిటైర్మెంట్ ఫంక్షన్‌కి వెళ్తాడు. అదే అవకాశంగా అమర్, భాగీని దగ్గర చేయడానికి ప్రయత్నిస్తాడు శివరామ్. ఇద్దరూ కలిసి కపుల్ ఎంట్రీ, ఫోటో సెషన్స్‌లో పాల్గొనేలా చేస్తాడు. అదంతా చూస్తూ మనోహరి కోపంతో రగిలిపోతుంది.
అంతలో బీహారీ ముఠా చేతికి చిక్కిన బాబ్జీ మనోహరికి కాల్ చేసి ఎక్కడున్నావని అడుగుతాడు. సిటీ శివార్లో ఓ రిసార్ట్‌లో జరుగుతున్న ఆర్మీ ఫంక్షన్లో ఉన్నానని, అమర్ పక్కనే ఉన్నాడని తర్వాత మాట్లాడతానని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది మనోహరి. వెంటనే ఆ ఆర్మీ ఫంక్షన్ ఎక్కడ జరుగుతుందో తెలుసుకోమని తన మనుషులను పురమాయిస్తాడు మనోహరి కోసం వెతుక్కుంటూ వచ్చిన వ్యక్తి.
భాగీకి అమర్ ముద్దు
రిటైర్మెంట్ ఫంక్షన్లో అందరూ సరదాగా గడుపుతారు. పలు జంటలు డ్యాన్స్ చేస్తాయి. తరువాత అమర్ జంటని పిలుస్తారు. ఆశ్చర్యపోతాడు అమర్. అదేంటండీ.. మీ సీనియర్ అన్నారు.. వీళ్లకి మీ గురించి తెలియదా ఏంటి? వెయిట్ లిఫ్టింగ్, పుషప్స్ అయితే ఓకేగానీ మీరు డ్యాన్స్ చేయడం ఏంటి? అని ఆటపట్టిస్తుంది భాగీ. అందరూ బలవంత పెట్టడంతో స్టేజ్మీదకి వెళ్లి డ్యాన్స్ చేస్తారు అమర్, భాగీ.
అప్పుడే అక్కడకు వచ్చిన అరుంధతి వాళ్లని చూసి గుప్తగారు చెప్పినా వినకుండా ఇక్కడకు వచ్చి తప్పు చేశాను అనుకుంటుంది. డ్యాన్స్ తర్వాత కిస్ చేయాలని అందరూ పట్టుబట్టడంతో భాగీని చెయ్యిపై ముద్దుపెట్టుకుంటాడు అమర్. డ్యాన్స్ బాగా చేశావని మిస్సమ్మని మెచ్చుకుంటారు పిల్లలు. మీలో ఇలాంటి యాంగిల్ కూడా ఉందని నాకు తెలియదు సార్ అంటాడు రాథోడ్.
అమరే మా ఆయన అని చెప్పిన అరుంధతి
దిగులుగా కూర్చున్న మనోహరిని ఎంత కష్టమొచ్చింది నీకు, పగోడికి కూడా ఇలాంటి పరిస్థితి రావొద్దు. మమ్మల్ని చూస్తూ ఇక్కడే ఉండి తట్టుకోలేవుగానీ ఇంటికెళ్లి పెరుగన్నం తిని పడుకోపో.. అని ఆటపట్టిస్తుంది మిస్సమ్మ. ఫంక్షన్లో అరుంధతిని చూసిన భాగీ పరిగెత్తుకుంటూ పిలుస్తూ వెళ్తుంది. ఎక్కడికి అని అడిగిన రాథోడ్‌తో అక్కతో మాట్లాడ్డానికి అంటుంది మిస్సమ్మ.
ఈ ఫంక్షన్లో ఈమెకి తెలిసిన వాళ్లెవరు ఉన్నారు సార్ అంటాడు రాథోడ్. పిల్లల్ని దింపడానికి స్కూల్‌కి వెళ్తుంది కదా.. ఎవరైనా పరిచయమై ఉంటారు అంటాడు అమర్. అరుంధతి దగ్గరకు వెళ్లిన భాగీ.. మీరేంటక్కా.. ఇక్కడున్నారు? మీ ఫ్యామిలీ ఏది? బావగారిని నాకు పరిచయం చేయండి అంటుంది. అమర్‌ని చూపిస్తుంది అరుంధతి. అదేంటక్కా.. మీ ఆయన్ని చూపించమంటే మా ఆయన్ని చూపిస్తున్నారు అంటుంది మిస్సమ్మ. ఆయన పక్కన ఉన్నాయన అని చెప్పి తొందరగా అక్కడ నుంచి వెళ్తుంది అరుంధతి.
ఫంక్షన్‌కి వచ్చిన మనోహరి భర్త
మనోహరి కోసం వెతుక్కుంటూ ఫంక్షన్‌కి వచ్చిన రణ్‌వీర్‌ని తొందరపడి ఏం చేయొద్దని హెచ్చరిస్తాడు అతని వెంట వచ్చిన వ్యక్తి. అసలే ఇది ఆర్మీ ఫంక్షన్ ఏదైనా తేడా జరిగితే తప్పించుకోలేం అని చెప్తాడు. రణ్‌వీర్‌ని చూసి షాకవుతుంది మనోహరి. మను ఎవరిని చూసి ఇంత కంగారు పడుతోంది.. అంటూ చుట్టూ చూస్తుంది అరుంధతి.
అక్కడ మనోహరి భర్త కనిపించడంతో.. అంటే గుప్తగారు చెప్పింది నిజమే అనుకుంటుంది. తన భర్త కంటపడకుండా దాక్కుంటుంది మనోహరి. అతని మనుషులు ఫంక్షన్ అంతటా వెతుకుతారు. రణ్వీర్ మనుషులు మనోహరిని పట్టుకుంటారా? అమర్‌కి మనోహరి గతం తెలియనుందా? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు జులై 02న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తప్పకుండా చూడాల్సిందే!
టాపిక్