NNS 02nd April Episode: భాగమతి శరీరంలోకి అరుంధతి ఆత్మ.. మనోహరికి చుక్కలు చూపించనున్న మిస్సమ్మ!
NNS 02nd April Episode: నిండు నూరేళ్లసావాసం సీరియల్ మంగళవారం (ఏప్రిల్ 2) ఎపిసోడ్లో అరుంధతి ఆత్మ భాగమతి శరీరంలోకి వెళ్తుంది. ఆ తర్వాత జరిగే ఘటనలు ఆసక్తికరంగా ఉంటాయి.
NNS 02nd April Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం మంగళవారం (ఏప్రిల్ 2) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. గుప్త నవ్వుతుంటే వెళ్లి తిడుతుంది అరుంధతి. నాకెందుకో ఈ పౌర్ణమికి శక్తులు రాబోతున్నాయి అనిపిస్తుంది అంటుంది అరుంధతి. మా ఆయన పెళ్లి ఆపడానికే నాకు ఆ దేవుడు శక్తులు ఇవ్వబోతున్నట్లు అర్థమవుతుంది అంటుంది.
మనోహరి, ఘోర దగ్గరకు వెళ్లి ఇంట్లో జరిగిన విషయం గురించి చెప్తుంది. దీంతో ఘోర.. అరుంధతి ఆత్మే ఆ కారు ఆపిందని.. పౌర్ణమి గడియలు మొదలయ్యాయి కాబట్టి ఆ ఆత్మకు శక్తులు వచ్చాయని.. నువ్వు జాగ్రత్త పడే సమయం వచ్చిందని.. నువ్వు ఏ మాత్రం ఏమారినా ఈ జన్మకు నువ్వు కోరుకున్నవాడిని పెళ్లి చేసుకోలేవు అని హెచ్చరిస్తాడు.
అరుంధతికి వచ్చే ఆ శక్తి ఏంటి?
అరుంధతి, గుప్తతో తన శక్తుల గురించి మాట్లాడుతుంది. అయినా ఇంత వరకు తీసుకొచ్చిన దేవుడు ఇక్కడ నన్ను వదిలేయడు కదా? మీ ద్వారానే నాకు వస్తున్న శక్తి ఏంటో తెలిసేలా చేస్తాను అంటుంది అరుంధతి. ఆ జగన్నాథుడే నేరుగా దిగివచ్చి నాకు చెప్పినా ఆ శక్తి గురించి నీకు చెప్పను గాక చెప్పను అంటాడు గుప్త. దొరికేశారుగా.. నాకొచ్చిన శక్తి ఏంటో దాంతో నేను ఏం చేస్తానో మీకు అన్నీ తెలుసు.
కానీ నేను అడిగితే మాత్రం తెలియదని కబుర్లు చెప్తున్నారు. ప్లీజ్ గుప్త గారు ఆ శక్తి ఏంటో చెప్పండి అంటుంది అరుంధతి. సరే చెప్తాను. బదులుగా నువ్వు నాకు నా అంగుళీకము ఇవ్వవలెను అంటాడు గుప్త. ఇవ్వనని.. అది ఇస్తే నువ్వు నన్ను తీసుకెళ్తావు అంటుంది అరుంధతి. మరోవైపు మనోహరి నువ్వు ఇందాకటి నుంచి శక్తి వస్తుంది అంటున్నారు కానీ ఏ శక్తి వస్తుందో చెప్పడం లేదేంటి అని ఘోరను అడుగుతుంది.
అయితే నేనే కాదు ఎవ్వరూ చెప్పలేరు కానీ ఆ ఆత్మకు ఆ పరమశివుడే అండగా ఉన్నాడని చెప్తాడు. దీంతో మనోహరి షాక్ అవుతుంది. మరోవైపు గుప్తకు రింగు ఇస్తాను తనకు వచ్చే శక్తి ఏంటో చెప్పమని అరుంధతి అడుగుతుంది. సరే చెప్తాను అని గుప్త చెప్పగానే అరుంధతి రింగు తీసుకురావడానికి వెళ్తుంది.
మిస్సమ్మ శరీరంలోకి అరుంధతి
ఇంతలో మనోహరి ఇంటికి వస్తుంది. గుప్తను చూసి కోపంగా పిలుస్తుంది. ఏయ్ నిన్ను ఈ వేషం తీసేయమన్నాను కదా అంటుంది మనోహరి. ఈ దుస్తులు నాకు బహు సౌకర్యముగా ఉన్నవి. అందులకే ఉంచితిని అంటాడు గుప్త. నువ్వు నీ వేషం నీ మాట అసలేం అర్థం కాదు. సర్లే కానీ నువ్వు ఇక్కడే పడుకుంటావు కదా.. నీకు రాత్రి పూట ఏదైనా తేడాగా అనిపిస్తుందా? అంటుంది మనోహరి.
అనిపించుట ఏలా నేను రోజు మాట్లాడుతుంటిని కదా? అంటాడు గుప్త. మనోహరి షాక్ అవుతుంది. ఏం మాట్లాడింది. నా గురించి ఏమైనా చెప్పిందా అని అడగ్గానే మా బామ్మ మీ గురించి ఏం చెప్పును అని గుప్త చెప్పగానే మనోహరి గుప్తను తిట్టి పౌర్ణమి నాడు ఆత్మలకు శక్తి వస్తుందా? అని అడగ్గానే గుప్త అవన్నీ ఉత్తి మాటలని చెప్తాడు. దూరం నుంచి వింటున్న అరుంధతి షాక్ అవుతుంది.
మనోహరి వెళ్లిపోయాక అరుంధతి గుప్త దగ్గరకు వచ్చి రింగు ఇవ్వనని అంటుంది గుప్త వెళ్లిపోతుంటే అతన్ని ఆపబోయేసరికి అరుంధతి ఆత్మ గుప్త బాడీలోకి వెళ్తుంది. దీంతో అరుంధతి.. గుప్త ఎక్కడని వెతుకుతుంది. ఇంతలో మిస్సమ్మ వస్తుంది. మిస్సమ్మ దగ్గరకు వెళ్లి గుప్త ఎక్కడికి వెళ్లాడని అడుగడంతో మిస్సమ్మ షాక్ అవుతుంది. మిస్సమ్మ కారు అద్దంలో చూపించగానే అరుంధతికి అర్థమై దూరంగా వెళ్లిపోతుంది.
తర్వాత తనకు ఎవరి బాడీలోకైనా వెళ్లే శక్తి వస్తుందని అరుంధతికి అర్థమవుతుంది. దీంతో వెంటనే వెళ్లి మిస్సమ్మ శరీరంలోకి వెళ్తుంది అరుంధతి. మిస్సమ్మ శరీరంలోకి వెళ్లిన అరుంధతి ఏం చేయబోతుంది? మిస్సమ్మ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు ఏప్రిల్ 02న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తప్పకుండా చూడాల్సిందే!