NNS 28th January Episode: మారువేషంలో వచ్చిన చిత్రగుప్తుడు.. యమలోకానికి ఆరు.. ఇంట్లో నుంచి వెళ్లిపోయిన అమర్!
NNS 28th January Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ మంగళవారం (జనవరి 28) ఎపిసోడ్లో మారువేషంలో వచ్చిన చిత్రగుప్తుడు.. ఆరును యమలోకానికి తీసుకెళ్తాడు. మరోవైపు అంజలిని తీసుకెళ్లడానికి రణ్‌వీర్ కు ఫోన్ చేస్తుంది మనోహరి.
NNS 28th January Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం ఈరోజు (జనవరి 28) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. కోయదొర వేషంలో వచ్చిన చిత్రగుప్తుడు ఆరు ఆత్మని యమలోకానికి తీసుకుని వెళ్తాడు. యమలోకంలో మాయాపేటికలో జరుగబోయే విషయాలు చూస్తుంది ఆరు. గుప్త వెతుకుతూ వెళ్తాడు. మాయపేటిక చూస్తున్న ఆరును చూసి షాక్ అవుతాడు.

ఆరుపై గుప్త ఆగ్రహం
మా లోకంలో కూడా నువ్వు నీ తింగరి వేషాలు వేస్తున్నావా..? అంటూ దగ్గరకు వెళ్లగానే మాయపేటికలో మనోహరికి రణవీర్ వార్నింగ్ ఇవ్వడం, మనోహరి, అంజు దగ్గరకు వెళ్లడం చూస్తుంది ఆరు. గుప్త కోపంగా బాలిక నువ్వు మాయాపేటిక చూడటం ఇక్కడ ఎవరైనా చూస్తే మాకు నరకంలో విధించే శిక్షలు విధిస్తారు అని భయపడుతుంటే.. మనో మళ్లీ ఏదో ప్లాన్ చేస్తుంది గుప్త గారు అంటుంది ఆరు.
నేను ఏమీ మాట్లాడుతుంటిని.. నువ్వు ఏమీ సమాధానం ఇస్తుంటువి అంటాడు గుప్త. మను ఎక్కడి నుంచో ఇంటికి రణవీర్‌తో ఏదేదో మాట్లాడుతుంది అని అరు చెప్పగానే.. ముందు నువ్వు ఆ మాయాపేటిక మూయుము అంటూ కోపంగా చెప్తూ.. ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరుతున్నాయి బాలిక అంటాడు.
ఆరు అర్థం కాలేదని చెప్పగానే.. ఆనాడు వద్దని వదిలించుకున్నవాళ్లే ఈనాడు కావాలని దగ్గరకు చేర్చుకుంటున్నారు అని గుప్త చెప్పగానే.. అంజును తీసుకెళ్తున్నారా..? అయితే వెంటనే ఈ విషయాన్ని మా ఆయనకు చెప్పండి ప్లీజ్ గుప్త గారు. నేను ఇక ఎక్కడికి వెళ్లను.. ఫ్లీజ్ ఈ ఒక్క సాయం చేయండి అని రిక్వెస్ట్ చేయగానే.. నేను కూడా నీ లాగే చూడటం తప్ప ఏమీ చేయలేనని చెప్తుండగానే యముడు పిలవగానే.. కంగారుగా వెళ్లిపోతాడు గుప్త.
ఒకరి కళ్లలోకి మరొకరు చూసుకున్న అమర్, మిస్సమ్మ
మిస్సమ్మను తీసుకుని ఇంటికి వచ్చిన అమర్.. హ్యాపీయా అని అడుగుతాడు. మిస్సమ్మ సంతోషంగా చాలా చాలా అంటే చాలా మీకు ఎన్నిసార్లు థాంక్స్ చెప్పినా సరిపోదు అంటుంది. థాంక్స్ చెప్పొద్దు నువ్వు ఏం చేయాలనుకున్నా నీకు ఈ ఇల్లు పిల్లలు అడ్డు రాకూడదు.. ముందు ఎలా ఉండేదానివో అలాగే ఉండు అని అమర్ చెప్పగానే.. నేను చాలా హ్యాపీగా ఉన్నానండి మీకు కనిపించడం లేదా..? మీకు తెలియడం లేదా..?
నేను హ్యాపీగా ఉండాలంటే నేను ఎక్కడికో వెళ్లి ఏదో చేస్తేనే రాదు.. ఈ ఇంట్లో మీ పక్కనే ఉంటే నాకు హ్యాపీగా ఉంటుంది అని చెప్తూ అమర్ కళ్లల్లోకి చూస్తుంది. అమర్ కూడా మిస్సమ్మ కళ్లల్లోకి చూస్తాడు. ఇంతలో మనోహరి వచ్చి వాళ్లిద్దరి ఆ పొజిషన్ లో చూసి బాధపడుతుంది. వీళ్లిద్దరూ ఒక్కటయ్యారా..? అసలు తన జడలో మల్లెపూలు ఏంటి అని మనసులో అనుకుంటుంది. నిర్మల, శివరాం వచ్చి అమర్, మిస్సమ్మలను చూసి హ్యాపీగా ఫీలవుతారు. మనోహరి ఏదో చేసేలా ఉందని దగ్గరకు వెళ్లి అమర్‌ను పలకరిస్తారు నిర్మల, శివరాం.
రణ్‌వీర్ వచ్చాడని చెప్పిన అంజు
మనోహరి వెళ్లి అమర్ పొద్దున అనగా వెళ్లారు ఎక్కడికి వెళ్లారు అని అడుగుతుంది. ఆయనకు తెలిసిన వాళ్లను కలవడానికి తీసుకెళ్లారు అంటుంది మిస్సమ్మ. మనోహరి ఓహో నువ్వేదో మిస్సమ్మకు బుల్లెట్ నేర్పిస్తున్నావేమో అనిపిస్తుంది అంటుంది మనోహరి. అమర్, మిస్సమ్మ షాక్ అవుతారు. ఇంతలో పిల్లలు రాగానే.. డిన్నర్ చేశారా..? అని అమర్ అడుగుతాడు. చేశామని అంజు చెప్తుంది. డాడ్ మీరు బయటకు వెళ్లారని తెలిసి వీళ్లకు టైం టేబుల్ ఫాలో అవ్వాలని చెప్పాను.. అంటూ డాడ్ చెప్పడం మర్చిపోయా రణవీర్ అంకుల్ సిటీకి వచ్చారంట అంటుంది.
నీకెవరు చెప్పారు అని అమర్ అడగ్గానే.. మనోహరి ఆంటీ చెప్పింది అని అంజు చెబుతుంది. రణవీర్ అంకుల్ వచ్చాడని నీకెందుకు చెప్పారు అని మిస్సమ్మ అడిగితే.. ఊరికే చెప్పారు అంటుంది. మనోహరి భయంతో ఎలాగైనా తప్పించుకోవాలని ఏదేదో మాటలు చెప్పి తప్పించుకుంటుంది.
రణ్‌వీర్‌కు మనోహరి ఫోన్
ఇంతలో రాథోడ్ పేపర్ తీసుకుని వచ్చి సార్ మెసేజ్ అంటూ ఇస్తాడు. మిస్సమ్మ కంగారుగా ఏమైందండి అని అడుగుతుంది. మేజర్ గారు మెసేజ్ చేశారు. నెక్ట్స్ వీక్ జరగాల్సిన మీటింగ్ రేపటికి అరేంజ్ చేశారట.. నాకు రాథోడ్‌కు ఇంకో గంటలో ఫ్లైట్ ఉంది మేము వెళ్లాలి అని అమర్ చెప్పగానే.. మనోహరి హ్యాపీగా ఊపిరి పీల్చుకుంటుంది.
అమర్ ఊర్లో ఉండడు.. అంజును తీసుకెళ్లొచ్చు అనుకుంటుంది. వెంటనే తన రూంలోకి వెళ్లి రణవీర్‌కు ఫోన్ చేసి విషయం చెప్తుంది. రేపు పొద్దున్నే వచ్చి అంజలిని తీసుకెళ్లు అని చెప్తుంది. సరే అంటాడు రణవీర్.
యముడిని కలవాలన్న ఆరు
యమలోకంలో ఉన్న ఆరు కోపంగా అరుస్తుంటే.. చిత్రగుప్తుడు వచ్చి బాలిక ఎందుకు అరుస్తున్నావు అని అడుగుతాడు. ఆరు కోపంగా మీరు నా అనుమతి లేకుండా ఇక్కడికి తీసుకొచ్చావు కాబట్టి నేను నీతో మాట్లాడను అంటుంది. ఇంతలో గుప్త వస్తాడు. మాయా పేటిక గురించి చెబితే నేను ప్రమాదంలో పడతాను అనుకుంటాడు.
అప్పుడే మాయా పేటిక గురించి చెప్తుంది ఆరు. వెంటనే వెళ్లి యముడిని కలవడానికి గంట మోగిస్తుంది. యముడు కోపంగా రావడంతో ఆరు భయపడుతుంది. ఆరు మళ్లీ భూలోకానికి ఎలా వస్తుంది? రణ్‌వీర్ బారినుంచి అంజుని మిస్సమ్మ ఎలా కాపాడుతుంది? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు జనవరి 28న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తప్పకుండా చూడాల్సిందే!
టాపిక్