NNS 28th February Episode: తన తండ్రి ఎక్కడ అని నిలదీసిన భాగమతి.. పిల్లలు మిస్సమ్మ పెళ్లికి వెళ్లకుండా మనోహరి ప్లాన్​​​​-zee telugu serial nindu noorella saavasam today 28th february episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Zee Telugu Serial Nindu Noorella Saavasam Today 28th February Episode

NNS 28th February Episode: తన తండ్రి ఎక్కడ అని నిలదీసిన భాగమతి.. పిల్లలు మిస్సమ్మ పెళ్లికి వెళ్లకుండా మనోహరి ప్లాన్​​​​

Hari Prasad S HT Telugu
Feb 28, 2024 01:09 PM IST

NNS 28th February Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ బుధవారం (ఫిబ్రవరి 28) ఎపిసోడ్ లో తన తండ్రి ఎక్కడ అని భాగమతి నిలదీయగా.. ఆమె పెళ్లికి అమర్ పిల్లలు వెళ్లకుండా మనోహరి ప్లాన్ చేస్తుంది.

నిండు నూరేళ్ల సావాసం సీరియల్
నిండు నూరేళ్ల సావాసం సీరియల్

NNS 28th February Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం బుధవారం (ఫిబ్రవరి 28) 171వ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. మనోహరి చెప్పినట్టు అమర్​, భాగమతి, శివరామ్, నిర్మల ఒక కారులో గుడికి బయలుదేరుతారు. అవకాశం కల్పించుకుని మా ఆయన పక్కన కూర్చోవాలి అనుకునే మను.. ఈరోజు ఆయనే రమ్మని పిలిచినా ఎందుకు వెళ్లట్లేదు అనుకుంటుంది అరుంధతి.

భాగీ పెళ్లికి అరుంధతి

అమ్మగారు మీరు అనుకున్నది అనుకున్నట్టు పట్టుబట్టి సాధించారు అంటుంది నీల. మేము వచ్చేదాకా ఇల్లు ని జాగ్రత్తగా చూసుకో అని నీలతో చెబుతాడు రాథోడ్. నా అమర్ తో నిన్ను జంటగా పంపిస్తున్నాను అంటే ఇక నువ్వు ఎప్పటికీ తిరిగి మళ్ళీ ఇంటికి రావు భాగీ అనుకుంటుంది మనోహరీ. మను.. ఎందుకే ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నావ్, ఏం చేయాలనుకుంటున్నావ్ అంటుంది అరుంధతి.

రాథోడ్ బయలుదేరుదామా అని పిల్లలు అంటారు. అబ్బో సూపర్ గా తయారయ్యారుగా అని రాథోడ్ అంటాడు. మరి మిస్సమ్మ పెళ్ళంటే ఆ మాత్రం ఉండాలి కదా అంటారు పిల్లలు. అందరూ కార్లో కూర్చొని బయలుదేరుతూ ఉండగా అరుంధతి కూడా కారెక్కి ఇది ఏం చేస్తుందో తెలుసుకోవాలంటే దీని వెనకాల వెళ్లాలి అనుకుంటుంది. మనోహరి పిల్లల్ని చూసి నవ్వుతుంది. ఇది నవ్వుతుందంటే కచ్చితంగా ఏదో చేస్తుంది మను.. నా పిల్లలను ఏం చేయాలనుకుంటున్నావే అనుకుంటుంది అరుంధతి.

మండపానికి బయలుదేరిన రామ్మూర్తి

రామ్మూర్తి బలవంతంగా లేచి కింద పడిపోతూ నడవలేక అడుగులు తడబడుతున్న మండపానికి బయలుదేరుతాడు. అమరేంద్ర వాళ్లు కార్లో వెళ్తూ ఉంటారు. అమరేంద్ర ఎఫ్ఎం పెడతాడు. అందులో భాగీ కి సంబంధించిన ప్రశ్న వస్తుంది. వెంటనే అమరేంద్ర ఎఫ్ఎం ఆపేస్తాడు. ఆర్జే భాగీ అంటే మా కోడలికి ఎంత ఇష్టమో తెలుసా మిస్సమ్మ.. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా అంతలా దగ్గర అయిపోయారు అంటుంది నిర్మల.

అందుకే ఒకరు నొకరు కలుసుకోవాలనుకున్నారు.. మా కోడలికి ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టం అమ్మ కానీ ఏం చేస్తాం వాళ్ళిద్దరూ కలవకుండానే దేవుడు మా కోడలిని తీసుకువెళ్లిపోయాడు అంటాడు శివరామ్. ఎవరి గురించి మాట్లాడుతున్నారు అని అడుగుతుంది భాగమతి. భాగీ పెళ్లయ్యే దాకా అరుంధతి గురించి తెలియకూడదు అనుకున్నాను.. తెలిసేలా ఉంది అని టాపిక్ ని డైవర్ట్ చేస్తూ మీ నాన్న ఎలా ఉన్నాడు మిస్సమ్మ పెళ్లికి వస్తున్నాడా అని అడుగుతాడు అమర్​.

ఆయన కోసం చేసుకుంటున్న పెళ్లి.. ఆయన రాకపోతే ఎలాగండి అంటుంది భాగమతి. అదేంటి మిస్సమ్మ అలా అంటావ్ అంటాడు శివరామ్. మా నాన్న కళ్ళల్లో సంతోషం చూడడం కోసం ఇప్పుడు పెళ్లి జరుగుతుంది కదా దాని గురించి మాట్లాడుతున్నాను అంకుల్ అంటుంది భాగమతి. మీ నాన్న కోసం ఇంత తొందరగా నీ పెళ్లి జరుగుతుందా అంటాడు శివరామ్.

పిల్లలను ఆపడానికి మనోహరి ప్లాన్

రామ్మూర్తి రోడ్డు మీద నడుచుకుంటూ వాళ్ళని వీళ్ళని లిఫ్ట్ అడిగి, గుడి దగ్గర డ్రాప్ చేయరా అని అడుగుతాడు. రాథోడ్, పిల్లలు, మనోహరి ప్రయాణిస్తున్న కారు సడన్​గా ఆగిపోతుంది. ఏమైంది రాథోడ్ అడుగుతుంది అంజలి. ఇప్పుడే ఆగిపోయింది కదా అంజలి పాప దిగి చూస్తే తెలుస్తుంది ఏమైందో అని రాథోడ్ కారు దిగి చూస్తాడు. కారు ఆగిపోయింది ఇది నవ్వుతుంది అంటే ఇదే ఏదో ఒకటి చేసి ఉంటుంది అనుకుంటుంది అరుంధతి.

బ్యాటరీ వైరు ఇంటి దగ్గరే తెగిపోయినట్టుందే చూసుకోలేదు ఇప్పుడెలా అనుకుంటాడు రాథోడ్. ఏమైంది రాథోడ్ అంటారు పిల్లలు. బ్యాటరీ వైర్ తెగిపోయింది అమ్మ కారు నడవడం కష్టం అంటాడు రాథోడ్. ఇప్పుడు ఎలా రాథోడ్ పెళ్లికి లేట్ అయిపోతుంది అంటారు పిల్లలు. అంజలి పాప మీరు ఇక్కడే ఉండండి నేను వెళ్లి మెకానిక్ ని తీసుకొస్తాను అని రాథోడ్ వెళ్ళిపోతాడు. పిల్లలు నీళ్లను చూసి మాట్లాడుకుంటూ నవ్వుతూ ఉంటారు. మనోహరి పిల్లలను చూసి నవ్వుతుంది. ఇక రెండో స్టెప్ మొదలు పెట్టాలి అనుకుంటూ.. పిల్లలు రాథోడ్ రావడానికి లేట్ అవుతుంది అనుకుంటా మనం వెళ్దామా అంటుంది. రాథోడ్ వచ్చాక వెళ్దామా ఆంటీ అంటుంది అమృత.

నేనున్నాను కదా మనం కలిసి వెళ్దాం అంటుంది మనోహరి. రాథోడ్ ఉంటేనే ఎటైనా వెళ్ళమని డాడీ చెప్పాడు రాథోడ్ లేకుండా మేము రాము ఆంటీ అంటుంది అమృత. ఏం మను ఏం చేయాలనుకుంటున్నావే నా పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్తావ్ నా పిల్లలకి ఏమన్నా అయితే మా ఆయన నిన్ను చంపేస్తాడు అని అరుంధతి అంటుంది. రాథోడ్ మీ నాన్న కోసం పని చేస్తాడు నేను మీ అమ్మ ఫ్రెండ్ ని.. నా కన్నా రాథోడ్ మీదే మీకు నమ్మకం ఎక్కువ అని మనోహరి అంటుంది.

సరే ఆంటీ ఎలా వెళ్దాం అని అంజలి అంటుంది. ఏదైనా కారు వస్తుందేమో లిఫ్ట్ అడుగుదాం అని మనోహరి అంటుంది. ఇంతలో ఒక కారు వస్తుంది కార్ ఆపి లిఫ్ట్ అడుగుతుంది మనోహరి. అతను ఓకే మేడం అని అంటాడు. పిల్లలందరూ కారులో కూర్చుంటారు మనోహరి ముందు సీట్లో కూర్చుంటుంది.

నాన్న ఎక్కడ అని నిలదీసిన భాగమతి

అమరేంద్ర వాళ్ళు గుడి దగ్గరికి వస్తారు. కాళీ పెళ్లి పీటల మీద కూర్చొని పూజ చేస్తూ ఉంటాడు. వాళ్లని చూసినా మంగళ ఆ పిల్లల్ని తీసుకురాలేదు రా నేను వెళ్లి వాళ్ళని తీసుకొస్తాను అని వెళుతుంది. మంగళ వెళ్తున్నప్పుడు పసుపు ఉన్న తాంబాలం తగిలి పసుపంతా కింద పడుతుంది. ఎంత అందంగా ఉన్నావు అమ్మాయి కుందన బొమ్మలా ఉన్నావు రా అనుకుంటూ మంగళ భాగీని తీసుకువెళ్తుంది.

అమరేంద్ర భాగమతి వెళ్తూ ఉండగా అక్కడ శివయ్య కనపడతాడు. భాగమతి శివయ్యకి నమస్కారం పెట్టుకుంటుంది. వాళ్ళిద్దరూ పసుపులో నుంచి అడుగు తీసి అడుగు వేస్తూ ఉంటే పసుపు అడుగులు పడతాయి. భాగమతి మంగళసూత్రాన్ని చూసి మొహం చాటేసుకుంటుంది. ఇదేంటమ్మా పెళ్లంటే హడావుడిగా బంధువులు చుట్టాలు చాలామంది ఉండాలి పట్టుమని పదిమంది కూడా లేరేంటి అంటాడు శివరామ్.

మా ఊరు చాలా దూరం కదా సార్ పిలిచినా ఎవరూ రారు అందుకే ఇక్కడ ఉన్న కొద్దిమందిని పిలిచాం అంటాడు కాళీ. పెళ్లి గ్రాండ్ గా ఫంక్షన్ హాల్ లో జరిపిస్తామంటే గుళ్లోనే ఎందుకు చేయాలన్నారు అని అడుగుతుంది నిర్మల. మీలాంటి గొప్పోళ్ళ ఆశీస్సులు ఆ భగవంతుడి ఆశీర్వాదం ఉంటే చాలు కథ అమ్మగారు అంటుంది మంగళ. భాగమతి గుడి అంతా చూసి పిన్ని.. నాన్న ఎక్కడ? అని అడుగుతుంది.

మీ నాన్న ఇంకా రాలేదు భాగీ అని అంటుంది మంగళ. నాన్న నా పెళ్ళికి రాకుండా ఇంట్లో ఏం చేస్తున్నాడు పిన్ని.. ఒక మాట చెప్తే నేనే వచ్చేటప్పుడు తీసుకువచ్చే దాన్ని కదా అని అంటుంది భాగమతి. ఎందుకు వదిలేసి వచ్చానమ్మా నర్స్ ని పెట్టాను మీ నాన్నకి సూదేస్తే నిద్రొస్తుంది, కాసేపు పడుకున్న తర్వాత తీసుకు రమ్మన్నాను వస్తాడులే, పెళ్లి కానివ్వు అంటుంది మంగళ. మిస్సమ్మ నేను వెళ్లి మీ నాన్నని తీసుకొస్తాను అని అంటాడు అమర్​.

రామ్మూర్తి రోడ్డు మీద నడవలేక నడవలేక వస్తూ ఉంటాడు. ఆయన కార్లకు కూర్చోలేడు బాబు అంబులెన్స్ లో తీసుకొచ్చే ఏర్పాటు చేశాను అని మంగళ చెబుతుంది. పెళ్లి సమయానికి రామ్మూర్తి గుడికి చేరుకుంటాడా? పిల్లలు మిస్సమ్మ పెళ్లికి ఎలా వస్తారు? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు ఫిబ్రవరి 28న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తప్పకుండా చూడాల్సిందే!

WhatsApp channel