NNS 27th February Episode: మనోహరికి మంగళ ఫోన్.. కూతురు పెళ్లి ఆపేందుకు బయల్దేరిన రామ్మూర్తి!
NNS 27th February Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ మంగళవారం (ఫిబ్రవరి 27) ఎపిసోడ్లో మనోహరికి మంగళ ఫోన్ చేస్తుంది. మరోవైపు కూతురు పెళ్లి ఆపేందుకు రామ్మూర్తి బయలుదేరుతాడు.
NNS 27th February Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం మంగళవారం (ఫిబ్రవరి 27) 170వ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఆకలేస్తుందని చెప్పిన మిస్సమ్మకు అన్నం తెస్తానని చెప్పి డోర్ లాక్ చేస్తుంది మనోహరి. అటుగా వెళ్లిన అమర్ మిస్సమ్మ రూమ్ డోర్ బయట నుండి గడియ పెట్టి ఉండటం చూసి పిలుస్తాడు. లోపల ఉండి బయట డోర్ పెట్టడం ఏంటని అనుమానంతో డోర్ ఓపెన్ చేస్తాడు. కంగారుగా కనిపించిన మిస్సమ్మని ఇంకా పడుకోలేదు ఏంటి అని అడుగుతాడు అమర్.
పడుకుంటానండి అని అంటుంది మిస్సమ్మ. ఏమైనా తిన్నావా లేదా ఉండు అని నీలని పిలుస్తాడు అమర్. ఫర్వాలేదండి పడుకుంటాను అంటున్న భాగమతితో... అన్నం తినకపోతే నిద్ర పట్టదు.. ఉండు నేనే తీసుకొస్తాను అని అమర్ వెళ్లి అన్నం తీసుకొస్తాడు. అమర్ స్వయంగా భాగమతికి అన్నం తినిపిస్తాడు. స్పూన్ తో తనకు తినిపించడం రావట్లేదని చెయ్యితో తినిపిస్తూ ఉంటాడు. అన్నం తినిపిస్తున్న అమర్ అలాగే చూస్తూ ఉంటుంది భాగమతి. అన్నం తినిపిస్తూ ఉండగా పొలమారితే మంచినీళ్లు తాగిస్తాడు అమర్. ఇప్పుడు ఓకేనా అంటాడు అమర్.
ఎర్రగా పండిన మిస్సమ్మ గోరింటాకు
మిస్సమ్మ ఏది నీ చేతులు ఎలా పండాయి చూపించు అంటుంది నిర్మల. భాగమతి చేతులు చూపెడుతుంది. ఎంత ఎర్రగా పండాయి అంతకంటే మంచి మొగుడు వస్తాడు అంటుంది నిర్మల. భాగమతి తన చేతులు పైకి పెట్టి చూసుకుంటూ ఉండగా చేతుల మధ్యలో నుంచి అమరేంద్ర బయట ఎవరితో మాట్లాడుతూ కనపడతాడు. అమరేంద్ర ని అలాగే చూస్తూ ఉంటుంది భాగమతి.
అమర్ ఇలా రా అని నిర్మల పిలుస్తుంది. మిస్సమ్మ చేతులు చూడు ఎంత ఎర్రగా పండాయో చూపించు మిస్సమ్మ అంటుంది నిర్మల. భాగమతి తన చేతులు చూపెడుతుంది. అది చూసిన అమర్ షాకవుతాడు. మిస్సమ్మ నీ చేతులు ఎంత ఎర్రగా పండాయి.. అంతకంటే మంచి మొగుడు వస్తాడు అంటాడు రాథోడ్. నిర్మల తన కోడలు ఆత్మబంధువైన ఆర్జే భాగీ గురించి మిస్సమ్మకు చెబుతుండగా అడ్డుకుని అమ్మ గుడికి వెళ్ళాలి కదా రెడీ అవ్వండి అంటాడు అమర్. మిస్సమ్మ ఈ చీర కట్టుకొని రెడీ అయ్యేసి రా.. గుడికి వెళ్దాం అని నిర్మల చెబుతుంది.
మనోహరిని నిలదీసిన అమర్
మనోహరి మంగళ కి ఫోన్ చేస్తుంది. మేడం చిన్న పాప పెళ్లికి రాకుండా చూసుకోండి అని మంగళ అంటుంది. ఇవన్నీ పనులు చేసే ముందు ఉండాలి అంటుంది మనోహరి. ఇప్పుడు అవన్నీ ఎందుకు మేడం.. అంజలి రాకుండా చూడండి అంటుంది మంగళ. పిల్లల సంగతి నేను చూసుకుంటాను మీరైతే త్వరగా వచ్చేయండి అని చెబుతుంది మనోహరి.
ఆ మాటలు వింటాడు అమర్. ఎవరితో మాట్లాడుతున్నావు మనోహరి.. ఎవరి అంతు చూస్తా అంటున్నావ్ అంటాడు అమర్. భాగమతి వాళ్ళ పిన్ని తో మాట్లాడుతున్నాను అమర్.. పెళ్లి అయిపోయిన తర్వాత నైట్ చిన్న బారాత్ ఏర్పాటు చేయమన్నాను.. కుదరదు అన్నారంట.. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను అని మంగళకి చెబుతున్నాను అంతే అంటుంది మనోహరి.
అవన్నీ రాథోడ్ చూసుకుంటాడు పద గుడికి వెళ్దాం అంటాడు అమర్. అమర్ ఇప్పుడు పిల్లలు పెళ్లికి రావడం అవసరం అంటావా.. ఎగ్జామ్స్ ఉన్నాయి పిల్లలు డిస్టర్బ్ అవుతున్నారు అంటుంది మనోహరి. పిల్లలు మిస్సమ్మ పెళ్లికి రాకపోతే ఎలా మేడం.. అయినా ఈరోజు ఆదివారం కదా మేడం అంటాడు రాథోడ్. ఆదివారం అయినా ఇంట్లో ఉండి చదువుకుంటారు కదా.. స్టడీ డిస్ట్రబ్ అవ్వకూడదు అంటుంది మనోహరి. ఈ పరిస్థితుల్లో అంజలిని ఒంటరిగా వదిలేయడం నాకు ఇష్టం లేదు మనోహరి ఏం పర్వాలేదు అంటాడు అమర్.
లేచి కూర్చున్న రామ్మూర్తి
ఇప్పుడు ఎలా అంజలి పెళ్లికి రాకూడదు అని టెన్షన్ పడుతూ ఉంటుంది మనోహరి. భగవంతుడా ఆ కాళీతో నా కూతురు పెళ్లి జరగకూడదు నాకోసం నా కూతురు ఈ పెళ్లి చేసుకుంటుంది నా కూతురు జీవితాంతం పెళ్లి కాకుండా నాతో ఒంటరిగా ఉండిపోయినా పర్వాలేదు కానీ ఆ దుర్మార్గుడితో పెళ్లి జరగకూడదు.. నేను ఏదో ఒక రకంగా పెళ్లి ఆపాలి లేదంటే నాలాగే నా కూతురు కష్టాల్లో బాధని ఒంటరితనంలో మనశ్శాంతిని పోగొట్టుకొని జీవితాంతం బాధపడాల్సి ఉంటుంది మంచి వాళ్లకు మంచి జరుగుతుందని అంటారు నా కూతురు పెళ్లి నేనే ఆపాలి ఎవరు వచ్చి ఆపలేరు అని రామ్మూర్తి అనుకుంటాడు.
రామ్మూర్తి శతవిధాల ప్రయత్నించి లేసి కూర్చుంటాడు. కట్ చేస్తే, ఏమైందిరా తమ్ముడు ఎందుకు అంత కంగారు పడుతున్నావ్ అని మంగళ అడుగుతుంది. నువ్వు కంగారు పడట్లేదు ఏందని నేను ఆలోచిస్తున్నాను అక్క.. ఆ అంజలి పెళ్లికి వస్తే పెళ్లి ఆగిపోతుంది.. బావ వచ్చి నిజం చెప్పిన ఈ పెళ్లి జరగదు.. వీళ్ళ ఇద్దరికీ నిజం తెలిస్తే మన ముగ్గురిని చంపేస్తారు అంటాడు కాళీ. చిన్న పాప పెళ్లి కి రాకుండా మనోహరి చూసుకుంటాను అంది కదరా ఇంకా ఎందుకు టెన్షన్ పడుతున్నావ్ నా టెన్షన్ అంత అది కాదురా మీ బావని పెళ్లికి తీసుకురాలేదని భాగమతి ఎక్కడ గొడవ చేస్తుందో నని నేను టెన్షన్ పడుతున్నాను అంటుంది మంగళ.
అంజలి పెళ్లికి వెళ్తుందా?
నర్స్‌ను పెట్టొచ్చామని చెప్పు అంటాడు కాళీ. ఏదో ఒకటి చెప్పి పెళ్లి జరిపించాలి రా అంటుంది మంగళ. అమరేంద్ర ఎవరితో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. దేవుడా పెళ్లి రోజు రానే వచ్చింది భాగీకి నిజం చెప్పలేను తను బాధ పడుతుంటే చూస్తూ ఉండలేను ఇప్పుడు ఎలా అని అరుంధతి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంతలో ముత్తైదువులు భాగమతిని పెళ్లికూతురు గారు రెడీ చేసి కార్ దగ్గరికి తీసుకు వస్తూ ఉంటారు.
ఇంత మంచి అమ్మాయిని ఆ దుర్మార్గుడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారా ఏదో ఒక విధంగా ఈ పెళ్లి ఆగిపోయేలా చేయి స్వామి అంటుంది అరుంధతి. ఫోన్ మాట్లాడుతూ భాగమతిని చూసి కనురెప్ప కొట్టకుండా చూస్తూ ఉంటాడు అమర్. ముత్తైదులు భాగమతిని తీసుకువచ్చి అమర్ ముందు నిలబెట్టి వెళ్ళిపోతారు. తనను చూసి మొహం పక్కకు తిప్పుకుంటాడు అమర్.
అమర్ మిస్సమ్మ ఎంత అందంగా ఉందో చూడ చక్కగా ఉంది నా దిష్టే తగిలేలా ఉంది అంటుంది నిర్మల. అవునమ్మా అంటాడు అమర్. ఈరోజు కోసమే ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్నాను భాగీకి పెళ్లి అయిపోతే ఈ ఇంటి వైపుకు రానివ్వను ఆ తరువాత నా ఫోకస్ అంతా నీ మీద పెడతాను అమర్ అని అనుకుంటుంది. అమర్ టైం అవుతుంది బయలుదేరుదామా అని అంటుంది.
అమర్.. నువ్వు, భాగమతి రాథోడ్ ముందు కార్లో వెళ్ళండి పిల్లలని నేను తీసుకొస్తాను అని మనోహరి అంటుంది. పిల్లల్ని అమ్మానాన్న తీసుకొస్తారు మనోహరి.. నువ్వు కూడా మాతోటే రా అంటాడు అమర్. నేను పిల్లల్ని తీసుకొని ఏమైనా మర్చిపోయావేమో చూసుకొని వస్తాను.. మీరు పదండి అని మనోహరి అంటుంది. అంజలిని పెళ్లికి రాకుండా మనోహరి ఏం చేస్తుంది? రామ్మూర్తిని చూసి భాగమతి ఏం చేస్తుంది? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు ఫిబ్రవరి 27న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తప్పకుండా చూడాల్సిందే!