NNS 26th March Episode: అరుంధతి న​గలు కొట్టేసేందుకు మనోహరి ప్లాన్​.. పౌర్ణమి రోజున అరుంధతికి అతీత శక్తులు-zee telugu serial nindu noorella saavasam today 26th march episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns 26th March Episode: అరుంధతి న​గలు కొట్టేసేందుకు మనోహరి ప్లాన్​.. పౌర్ణమి రోజున అరుంధతికి అతీత శక్తులు

NNS 26th March Episode: అరుంధతి న​గలు కొట్టేసేందుకు మనోహరి ప్లాన్​.. పౌర్ణమి రోజున అరుంధతికి అతీత శక్తులు

Hari Prasad S HT Telugu
Published Mar 26, 2024 12:08 PM IST

NNS 26th March Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ మంగళవారం (మార్చి 26) ఎపిసోడ్లో అరుంధతి నగలు కొట్టేసేందుకు మనోహరి ప్లాన్ చేస్తుంది. మరోవైపు మిస్సమ్మను అమర్ వెతుకుతుంటాడు.

అరుంధతి న​గలు కొట్టేసేందుకు మనోహరి ప్లాన్​.. పౌర్ణమి రోజున అరుంధతికి అతీత శక్తులు
అరుంధతి న​గలు కొట్టేసేందుకు మనోహరి ప్లాన్​.. పౌర్ణమి రోజున అరుంధతికి అతీత శక్తులు

NNS 26th March Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం మంగళవారం (మార్చి 26) 193వ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. అత్తయ్య గారు.. అత్తయ్య గారు.. అంటూ అమర్​ తల్లి నిర్మలని పిలుస్తుంది మనోహరి. ఏంటి అత్తయ్య గారు ఈ పిలుపు నీకు కొత్తగా ఉన్నా అమర్ కి నాకు పెళ్లి అయిన తర్వాత అలాగే పిలవాలి కదా అందుకే అలవాటు చేసుకుంటున్నాను అంటుంది మనోహరి. నిర్మలను మనోహరి అత్తయ్యా అంటూ పిలవడంతో నిర్మల షాక్‌ అవుతుంది.

దీంతో ఇలా పిలవడం మీకు కొత్తగా ఉండొచ్చు నచ్చకుండా కూడా ఉండొచ్చు అంటూ మనోహరి అనడంతో నిర్మల అలాంటిదేం లేదంటుంది. అయితే ఇది మీకు పిలుపే అయ్యుండొచ్చు. కానీ ఇది నాకు ఆరు ఇచ్చిన బాధ్యత అంటుంది. అసలు ఇదంతా ఆరునే పక్కన ఉండి జరిపిస్తున్నట్టుంది అంటుంది మనోహరి. అవునమ్మా నా కొడలు ఆశీస్సులు ఉంటేనే అమర్‌ పెళ్లి జరుగుతుంది అంటుంది నిర్మల.

మనోహరి చేతికి అరుంధతి నగలు

అత్తయ్య గారు ఆరు నగలు ఎక్కడున్నాయి అని అడుగుతుంది మనోహరి. ఆ నగలతో నీకేంటి పని.. అడిగేది నిన్నే అమ్మాయి అంటాడు శివరామ్​. పెళ్లికోసం.. ఇలా నాకంటూ ఒక కుటుంబం వస్తుందని నేను అనుకోలేదు. నేను దాచుకోవడానికి డబ్బులు, కానీ నగలు కానీ సంపాదించుకోలేదు. అయినా నగలు వేసుకుని హూందాగా కనిపించాలని నాకేం ఆశ లేదు అంకుల్‌ అంటుంది మనోహరి.

ఆగమ్మా.. పద అరుంధతి నగలు ఇస్తాను. పదమ్మా రా.. అంటూ లోపలికి తీసుకెళ్లి అరుంధతి నగలు తీసి మనోహరికి ఇస్తుంది నిర్మల. అందులో తాళి లేదని మనోహరి చెప్పడంతో.. పెళ్లికోసం కొత్తది చేయించమని అమర్‌కు చెప్తానులే అనగానే.. మిస్సమ్మకు ఇచ్చిన నగలు కూడా ఇవ్వమని అడుగుతే బాగుంటుంది అని మనోహరి అంటుంది. అలా చెప్పగానే గిఫ్టుగా ఇచ్చిన నగలు తిరిగి ఇవ్వమని అడిగితే బాగుండదని నిర్మల అంటుంది. కానీ మనోహరి బయటకు వెళ్లి మిస్సమ్మను పిలిచి నగలు ఇవ్వమని అడుగుతుంది.

దీంతో మిస్సమ్మ నగలు తీసుకొచ్చి ఇస్తుంది. బాగానే ఉందా? బాగానే ఉంటుందిలే.. సరే అత్తయ్యా ఇవి ఈరోజు నుంచి నావే కాబట్టి జాగ్రత్తగా కాపాడతాను అంటుంది మనోహరి. సరేనమ్మా జాగ్రత్త అంటుంది నిర్మల. నెక్లెస్‌ ఇవ్వగానే ఇక నుంచి నీకు ఈ ఇంట్లో తిరుగులేదు అనుకున్నావా? నువ్వు ఎంత ఫాస్ట్‌ గా అందరికీ దగ్గరయ్యావో అంతే స్పీడుగా దూరం చేస్తాను అని వార్నింగ్ ఇచ్చి మనోహరి నగలు తీసుకుని వెళ్లిపోతుంది.

సమ్మర్ క్యాంపుకు పిల్లలు

అమర్‌ తాను అరుంధతిని పట్టుకున్న విషయం గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇంతలో రాథోడ్‌ వస్తాడు. చెప్పు రాథోడ్‌ అని అమర్​ అనగానే పిల్లలను సమ్మర్‌ క్యాంపుకు పంపడం కరెక్టు కాదేమో అనిపిస్తుంది సార్‌. ఇప్పటికే ఒంటరిగా ఫీలవుతున్న పిల్లల్ని మళ్లీ ఒంటరి వాళ్లను చేయడం కరెక్టు కాదేమో.. మిస్సమ్మ చూసుకుంటుంది సార్​ అంటాడు రాథోడ్​.

పిల్లల్ని మిస్సమ్మ బాగా చూసుకుంటుందని నాకు బాగా తెలుసు. పిల్లలు సమ్మర్‌ క్యాంపుకు వెళ్లడం ఇష్టం ఉందని లెటర్‌ రాశారు. కానీ ఇష్టం లేకపోయినా క్యాంపుకు పంపేవాణ్ని. ఎందుకంటే పిల్లలు పెళ్లి చూసి తట్టుకోలేరు అంటూ అమర్‌ చెప్పగానే రాథోడ్‌ ఏడుస్తాడు. మంచితనానికి రోజులు లేవు సార్‌ అంటూ బాధపడతాడు.

మానవులకు అర్థం అయినచో ఇక అది దైవకార్యం ఎలా అవుతుంది అంటూ మాట్లాడుకుంటుంటాడు. ఇంతలో అరుంధతి రావడం చూసి పాటలు పాడుకుంటాడు గుప్త. నాకు మనఃశాంతి లేకుండా చేసి ఈయన మాత్రం చిల్‌ అవుతున్నారు. బాగా తిని చెట్టుకింద సేద తీరుతున్నారా? గుప్త గారు.. పౌర్ణమి రోజు ఏం జరుగుతుందో చెప్తారా? మీరు నాకు ఒక్క హెల్ప్‌ చేయండి మీకు నేను ఒక హెల్ఫ్‌ చేస్తాను అంటుంది అరుంధతి.

అయితే నా అంగుళీకము ఇస్తే చెప్తాను అనడంతో అరుంధతి ఇవ్వను గాక ఇవ్వను అంటూ పౌర్ణమి రోజు నేను ఎవరిలోనైనా దూరే శక్తి వస్తుందా? అనగానే గుప్త షాక్‌ అవుతాడు. తర్వాత అరుంధతి వెళ్లిపోతుంది. మరోవైపు మనోహరి పిల్లలను పిలిచి డిన్నర్‌ చేయండని చెప్తుంది. క్యాంపుకు కావాల్సినవన్నీ సర్దుకున్నారా? అంటూ అడుగుతుంది.

దీంతో పిల్లలు కోపంగా చూస్తుంటారు. ఇంతలో అమర్‌ వచ్చి మిస్సమ్మ ఎక్కడ అని అడగడంతో మనోహరి కోపంగా చూస్తుంటుంది. మిస్సమ్మ ఎక్కడకు వెళ్లింది? పౌర్ణమి రోజు ఏం జరగనుంది? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు మార్చి 26న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తప్పకుండా చూడాల్సిందే!

Whats_app_banner