NNS 26th December Episode: ​​​​పక్కింటి అక్కనే ఆరు ఏమోనన్న రాథోడ్​.. మిస్సమ్మలో మొదలైన అనుమానం.. మనోహరికి వార్నింగ్​​!-zee telugu serial nindu noorella saavasam today 26th december episode nns serial today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns 26th December Episode: ​​​​పక్కింటి అక్కనే ఆరు ఏమోనన్న రాథోడ్​.. మిస్సమ్మలో మొదలైన అనుమానం.. మనోహరికి వార్నింగ్​​!

NNS 26th December Episode: ​​​​పక్కింటి అక్కనే ఆరు ఏమోనన్న రాథోడ్​.. మిస్సమ్మలో మొదలైన అనుమానం.. మనోహరికి వార్నింగ్​​!

Hari Prasad S HT Telugu
Dec 26, 2024 06:00 AM IST

NNS 26th December Episode: ​​​​నిండు నూరేళ్ల సావాసం గురువారం (డిసెంబర్ 26) ఎపిసోడ్లో పక్కింటి అక్కనే ఆరునేమో అని మిస్సమ్మతో అంటాడు రాథోడ్. దీంతో ఆమెలో అనుమానం మొదలవుతుంది. అటు స్వామిజీ ఆశ్రమానికి అమర్ బయలుదేరుతాడు.

పక్కింటి అక్కనే ఆరు ఏమోనన్న రాథోడ్​.. మిస్సమ్మలో మొదలైన అనుమానం.. మనోహరికి వార్నింగ్​​!
పక్కింటి అక్కనే ఆరు ఏమోనన్న రాథోడ్​.. మిస్సమ్మలో మొదలైన అనుమానం.. మనోహరికి వార్నింగ్​​!

NNS 26th December Episode: ​​​​జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం ఈరోజు (డిసెంబర్ 26) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. రాథోడ్‌ ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు చెప్పు అని మిస్సమ్మ అడగ్గానే నీ గురించే అని రాథోడ్ చెప్తాడు. మా నాన్న కూడా నా గురించి ఇంతలా ఆలోచించి ఉండరు. అన్నయ్య అనే పదానికి నిలువెత్తు రూపం రాథోడ్‌ నువ్వు అని మిస్సమ్మ అనగానే రాథోడ్ తల బాదుకుంటాడు.

yearly horoscope entry point

పక్కింటి అక్కే ఆరు అన్న రాథోడ్

ఏమైంది రాథోడ్‌ అని మిస్సమ్మ అడగ్గానే ఇందాక స్వామిజీ వచ్చి మేడం గారు ఇక్కడే తిరుగుతుంది కదా ఎవరికీ కనిపించని మేడం ఆత్మ నీకు కనిపిస్తుందేమోనని నాకు అనుమానం అంటాడు. మిస్సమ్మ నేను పక్కింటి అక్కతో మాట్లాడుతున్నాను అని చెప్పగానే మాకెవరికీ కనిపించని పక్కింటి అక్క నీకెలా కనిపిస్తుంది అని అడగ్గానే ఆరు అక్క ఫోటో నేను చూశాను.

తను ఆరు అక్క కాదు. అయినా ఆత్మలను ఎవరైనా పట్టుకుంటారా..? కానీ నేను పక్కింటి అక్కను చాలా సార్లు పట్టుకున్నాను అని చెప్పగానే అవునా సరే అని రాథోడ్‌ వెళ్లిపోతాడు.

మనోహరికి మిస్సమ్మ వార్నింగ్

మనోహరి ఆలోచిస్తూ.. ఆ ముసలోళ్లు నా ప్రతి ప్లానుకు అడ్డు పడుతూనే ఉన్నారు. దాన్ని పౌర్ణమి లోపు పంపించేద్దాం అనుకుంటే పౌర్ణమి వరకు ఆపేశారు. దానికి ఈ మిస్సమ్మ కూడా వత్తాసు పలికింది. ఇప్పుడు ఆ పౌర్ణమి రోజు అది ఎందుకు సైలెంట్‌ గా ఉంటుంది. అయినా దాన్ని ఎలాగో మూడు రోజులు ఆపితే దాని పీడ విరగడ అయిపోతుంది అని మాట్లాడుకుంటుంటే.. మిస్సమ్మ వస్తుంది. మిస్సమ్మను చూసిన మనోహరి షాక్‌ అవుతుంది.

నేను మాట్లాడుకున్నది మొత్తం విందా అని మనసులో అనుకుంటుంది. మిస్సమ్మ దగ్గరకు వచ్చి నువ్వు ఇక మారవా మనోహరి ఎప్పుడూ ఇలా ఎవరినో ఒకరిని బాధపెడుతూనే ఉంటావా..? అంటూ ప్రశ్నిస్తుంది. మనోహరి రిలాక్స్‌ అవుతుంది. నేను మాట్లాడుకుంది వినలేదు అని మనసులో అనుకుని ఇంతకీ నువ్వు ఎందుకు వచ్చావు అని అడుగుతుది. నువ్వు ఆరోజు నాకు చూపించింది ఆరు అక్క ఫోటోనేనా..? అని అడుగుతుంది.

దీంతో ఆరు ఫోటోనే అని మనోహరి చెప్తుంది. దీంతో నీ మాటల్లో కంగారు.. ముఖంలో టెన్షన్‌ చూస్తుంటే ఇక్కడేదో జరుగుతుంది అని నాకు అనుమానంగా ఉంది అంటుంది. నువ్వు ఇక్కడి నుంచి వెళ్లు అని తిడుతుంది మనోహరి.

ఘోర గురించి అడిగిన అమర్

ఇంతలో అమర్‌ వస్తాడు. నేను మీ ఇద్దరితో మాట్లాడాలని వచ్చాను అని చెప్తాడు. ఏంటి అమర్‌ అని మనోహరి అడుగుతుంది. ఘోర గురించి మాట్లాడాలి అని అమర్‌ చెప్తాడు. మనోహరి భయంతో ఘోర గురించా..? ఏం మాట్లాడాలి.. అని అడుగుతుంది. మనం ఆరు అస్థికలు నదిలో కలిపేస్తున్నామని ఆ ఘోరకు తెలిస్తే వాడు మళ్లీ మన ఇంటికి వస్తాడు. అందుకే మీరు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడానికి వచ్చాను.

ముఖ్యంగా మనోహరి నువ్వు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఆ ఘోర మన ఇంటికి వచ్చిన ప్రతిసారి నీ రూంలోకి వచ్చాడని నాకు అనుమానంగా ఉంది అని చెప్పడంతో మనోహరి మరింత టెన్షన్‌గా ఇక రాడులే అమర్‌ అని అంటుంది. దీంతో నీకెలా తెలుసు అంత కచ్చితంగా ఎలా చెప్తున్నావు అని అమర్‌, మిస్సమ్మ అడుగుతారు. మనం ఎవ్వరం చెప్పకపోతే ఘోరకు ఎలా తెలుస్తుంది. అందుకే రాడులే అని చెప్పాను అంటుంది మనోహరి.

గుప్తకు తెలిసిపోయిన ఘోర శపథం

ఘోర పూజలు చేస్తుంటాడు. ఆరు అస్థికలు నదిలో కలపడం తెలుస్తుంది. వెంటనే పూజలోంచి బయటకు వచ్చిన ఘోర నా పూజలకు అడ్డు తగిలింది ఎవరు..? దేవా ఎక్కడ తప్పు జరుగుతుంది. నా పూజల లోపమా..? చెప్పు అని అడగ్గానే ఘోర గురువు వచ్చి ఆ ఆత్మ ఆస్థికలు పుణ్యనదుల్లో కలపాలని నిర్ణయం తీసుకున్నారు. ఆస్థికలు నదిలో కలిపితే ఆ ఆత్మ నీకు బందీ కాదు. ఇక నువ్వు ఎన్ని పూజలు చేసినా వృథాయే అని చెప్తాడు. దీంతో ఈ సారి ఆ ఆత్మను బంధించకపోతే నా శిరస్సును ఖండించి నీ పాదాల దగ్గర పెడతాను అని ఘోర ప్రతిజ్ఞ చేస్తాడు.

ఘోర ప్రతిజ్ఞ గుప్తకు తెలిసిపోతుంది. గుప్త భయపడుతుంటే యముడు వచ్చి ఆ బాలిక ఆస్థికలు నదిలో కలిపేందుకు ఎలాంటి ఆటంకాలు జరగకూడదు అని హెచ్చరిస్తాడు. ఆస్థికలు నదిలో కలుపే వరకు ఎలాంటి తప్పిదం జరగకుండా చూసుకొమ్ము అని చెప్పగానే గుప్త సరే అంటాడు.

స్వామిజీ ఆశ్రమానికి అమర్

అమర్‌ స్వామిజీ ఆశ్రమానికి బయలుదేరుతాడు. తనతో ఉన్న రాథోడ్ తో మాట్లాడుతూ.. ఆరు అనాథ కాదని తన తల్లిదండ్రులు వద్దని వదిలించుకుని వదిలేయలేదని, తన తండ్రి తన తోడ బుట్టిన మిస్సమ్మ తనను పాతికేళ్లు గుండెల్లో పెట్టుకున్నారని ఆరుకు తెలియాలి. తనను తన కంటే తన కుటుంబం ఎంత ప్రేమించిందో తనకు తెలియాలి. తను అనాథ కావడానికి తన కుటుంబం కాదని తన కర్మ అని ఆరుకు తెలియాలి.

తనతో నేను ఎలా మాట్లాడగలనో తెలుసుకోవడానికే ఆశ్రమానికి వెళ్తున్నాను రాథోడ్‌ అని అమర్‌ చెప్తాడు. పౌర్ణమి రోజు ఆరు అస్థికల్ని నదిలో కలుపుతారా? ఆరు ఆత్మ యమలోకానికి వెళ్తుందా? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు డిసెంబర్​ 26న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తప్పకుండా చూడాల్సిందే!

Whats_app_banner