NNS 22nd January Episode: ఆరు అస్థికల్ని నదిలో కలపొద్దన్న స్వామీజీ.. వెళ్లిపోయిన గుప్త.. ఇంట్లో అందరికీ అమర్​ ట్రైనింగ్​-zee telugu serial nindu noorella saavasam today 22nd january episode nns serial today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns 22nd January Episode: ఆరు అస్థికల్ని నదిలో కలపొద్దన్న స్వామీజీ.. వెళ్లిపోయిన గుప్త.. ఇంట్లో అందరికీ అమర్​ ట్రైనింగ్​

NNS 22nd January Episode: ఆరు అస్థికల్ని నదిలో కలపొద్దన్న స్వామీజీ.. వెళ్లిపోయిన గుప్త.. ఇంట్లో అందరికీ అమర్​ ట్రైనింగ్​

Hari Prasad S HT Telugu
Jan 22, 2025 02:13 PM IST

NNS 22nd January Episode: నిండు నూరేళ్ల సావాసం బుధవారం (జనవరి 22) ఎపిసోడ్లో ఆరు అస్థికలను కలపొద్దని స్వామీజీ చెబుతాడు. దీంతో గుప్త కనిపించకుండా వెళ్లిపోతాడు. మరోవైపు కుటుంబ సభ్యులందరికీ అమర్ ట్రైనింగ్ మొదలుపెడతాడు.

ఆరు అస్థికల్ని నదిలో కలపొద్దన్న స్వామీజీ.. వెళ్లిపోయిన గుప్త.. ఇంట్లో అందరికీ అమర్​ ట్రైనింగ్​
ఆరు అస్థికల్ని నదిలో కలపొద్దన్న స్వామీజీ.. వెళ్లిపోయిన గుప్త.. ఇంట్లో అందరికీ అమర్​ ట్రైనింగ్​

NNS 22nd January Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం ఈరోజు (జనవరి 22) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఓసారి చూద్దాం. గుప్త కనిపించడం లేదని వెతుకుతుంది ఆరు. అసలు ఆ సాధువు ఎవరు నా ఆస్థికలు కలపొద్దు అని ఎందుకు చెప్పారు అని ఆలోచిస్తుంది. గుప్త గారు మీరు ఇక్కడే ఎక్కడో దాక్కున్నారని నాకు తెలస్తుంది అనుకుంటూ గార్డెన్‌ లో అటూ ఇటూ తిరుగుతుంటే బయట లైట్‌ ఆఫ్‌ చేయడానికి వచ్చిన మిస్సమ్మ.. గార్డెన్‌ లో తిరుగుతున్న ఆరును చూస్తుంది.

అక్క వస్తే తాను వెళ్లిపోతానన్న మిస్సమ్మ

వచ్చి అక్క ఇక్కడ ఏం వెతుకుతున్నారు అని అడుగుతుంది. రింగు పోయిందని అదే వెతుకుతున్నానని చెప్తుంది ఆరు. అయితే ఇంట్లోకి వెళ్లి లైట్ తీసుకొస్తాను ఉండు అక్కా ఇద్దరం కలిసి వెతుకుదాం అంటుంది మిస్సమ్మ. ఏమీ వద్దులే మిస్సమ్మ అది గోల్డ్‌ రింగేం కాదు.. ఉదయం వెతుక్కుంటాను అని ఆరు చెప్తూ ఇంట్లో అందరూ పడుకున్నట్టు ఉన్నారు అంటుంది. లేదక్కా పడుకున్నా పడుకోనట్టే అని మిస్సమ్మ చెప్తుంది.

ఎందుకు ఏమైందని ఆరు అడగ్గానే.. అక్క​ అస్థికలు నదిలో కలపలేదన్న బాధో.. అక్క ఇంటి చుట్టూ తిరుగుతుందనే సంతోషమో తెలియడం లేదక్కా అంటుంది మిస్సమ్మ. మరి నువ్వేం అనుకుంటున్నావు అని ఆరు అడిగితే నాకెందుకో ఆరు అక్కా మళ్లీ ఈ ఇంట్లోకి ఏదో ఒక రూపంలో వస్తుందనిపిస్తుంది అని మిస్సమ్మ చెప్పగానే.. నువ్వు ఊరుకో మిస్సమ్మ.. చనిపోయిన వాళ్లు మళ్లీ ఎలా తిరిగి వస్తారు అంటూ ప్రశ్నిస్తుంది ఆరు.

లేదక్కా సాక్షాత్తూ ఆ దేవుడే వచ్చి అక్క అస్థికలు కలపకుండా చేయడం.. అక్క ఆత్మ ఇక్కడే తిరగడం.. ఆ అవకాశం ఉంటే అక్క మళ్లీ తిరిగి రావాలని ఆ దేవుడిని కోరుకుంటాను అంటుంది మిస్సమ్మ. దీంతో ఆరు కోపంగా ఏం మాట్లాడుతున్నావు మిస్సమ్మ.. మరి ఆరు తిరిగి వస్తే నీ పరిస్థితి ఏంటి అని అడుగుతుంది. ఇది ఆరు అక్కా కుటుంబం.. ఆవిడ తిరిగి వస్తే నేను వెళ్లిపోతాను అంటూ ఏడుస్తుంది మిస్సమ్మ. నువ్వు అలా మాట్లాడకు మిస్సమ్మ.. ఆయన పక్కన ఉండే అధికారం ఎవరికైనా ఉందంటే.. అది నీకే.. ఈ ఇంట్లో నీ స్థానం.. ఆయన జీవితంలో నీ స్ధానాన్ని కానీ ఎవ్వరూ మార్చకూడదు. నువ్వు సంతోషంగా ఉండాలి మిస్సమ్మ అంటూ ఆరు ఏడుస్తుంది.

అంజుకు అమర్ క్లాస్

పొద్దున్నే అలారం మోగగానే.. పిల్లలందరూ ఉలిక్కిపడి నిద్ర లేస్తారు. వెంటనే అమర్‌ వచ్చి అలారం ఆఫ్ చేస్తాడు. ఇంత పొద్దున్నే ఎవర్రా అలారం పెట్టింది ఎవర్రా అంటూ అరుస్తుంది అంజు.. అమర్ కనిపించగానే.. షాకింగ్‌ గా చూస్తూ.. గుడ్‌ మార్నింగ్ డాడ్‌.. అదే పొద్దున్నే ఎలా లేవాలో చెప్తున్నాను అంటుంది అంజు.

దీంతో అమర్‌ కోపంగా అంటే అలారం మోగకపోతే మీరు సిక్స్‌కు లేవలేరా..? మీ డిసిప్లీన్‌ ఏమైంది అంటాడు. ఇంత గ్యాప్ వచ్చింది కదా..? అందుకే గురకపెట్టి నిద్ర పోతున్నాం.. అంటుంది అంజు. దీంతో రేపట్నించి ఇలా సిక్స్‌ కు లేవడం కాదు.. సిక్స్‌ వరకే లేచి రెడీ అయి కిందకు రావాలి అంటాడు అమర్‌. పిల్లలందరూ షాక్‌ అవుతారు.

అందరికీ అమర్ ట్రైనింగ్

గార్డెన్‌ లోకి వెళ్లిన అమర్‌..విజిల్‌ వేస్తాడు. ఇంట్లో అందరూ షాక్‌ అవుతారు. కిచెన్‌ లో ఉన్న మిస్సమ్మ కుక్కర్‌ చూస్తూ.. పప్పు ఉడకకుండానే విజిల్‌ వేస్తుందేంటి..? అని కన్ఫ్యూజ్ అవుతుంది. పూజ చేస్తున్న నిర్మల ఏంటండీ పొద్దున్నే విజిల్ వేస్తున్నారేంటి అని అడుగుతుంది. ఆ నేనే టైం పాస్‌ కు విజిల్‌ వేశాను అంటాడు శివరాం.. ఆ విజిల్ సౌండ్‌ బయటి నుంచి వచ్చింది అంకుల్‌ అని మనోహరి చెప్తుంది. ఇంతలో పిల్లలు రెడీ అయి గార్డెన్‌ లోకి వెళ్తారు. టూ మినిట్స్ టైం ఇస్తే మీరు ఫైవ్‌ మినిట్స్‌ తీసుకున్నారు అంటాడు అమర్.

వీడేంటే మళ్లీ ట్రైనింగ్‌ క్యాంపు మొదలు పెట్టాడు అంటాడు శివరాం.. ఏమోనండి నాకేం తెలుసు అంటుంది నిర్మల. ఇంతలో మిస్సమ్మ వచ్చి మామయ్యా పొద్దున్నేనిద్ర లేపి ఈ ఎక్సర్‌ సైజు లేంటి చాదస్తం కాకపోతే అంటుంది మిస్సమ్మ.. ఏమోనమ్మా అంటాడు శివరాం. ఆరు మళ్లీ అమర్​ కుటుంబంలోకి ఎలా రాబోతుంది? గుప్త ఎక్కడికి వెళ్లాడు? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు జనవరి​ 22న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తప్పకుండా చూడాల్సిందే!

Whats_app_banner