NNS 21st March Episode: అరుంధతిని తాకిన రామ్మూర్తి.. అతడే తన తండ్రి అని తెలుసుకున్న ఆరు ఏం చేసిందంటే..-zee telugu serial nindu noorella saavasam today 21st march episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns 21st March Episode: అరుంధతిని తాకిన రామ్మూర్తి.. అతడే తన తండ్రి అని తెలుసుకున్న ఆరు ఏం చేసిందంటే..

NNS 21st March Episode: అరుంధతిని తాకిన రామ్మూర్తి.. అతడే తన తండ్రి అని తెలుసుకున్న ఆరు ఏం చేసిందంటే..

Hari Prasad S HT Telugu
Published Mar 21, 2024 12:51 PM IST

NNS 21st March Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ గురువారం (మార్చి 21) ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. అరుంధతిని రామ్మూర్తి తాకుతాడు. అతడే తన తండ్రి అని తెలుసుకున్న ఆరు ఏం చేయబోతోందన్నది ఈ ఎపిసోడ్ చూస్తే తెలుస్తుంది.

అరుంధతిని తాకిన రామ్మూర్తి.. అతడే తన తండ్రి అని తెలుసుకున్న ఆరు ఏం చేసిందంటే..
అరుంధతిని తాకిన రామ్మూర్తి.. అతడే తన తండ్రి అని తెలుసుకున్న ఆరు ఏం చేసిందంటే..

NNS 21st March Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం గురువారం (మార్చి 21) 189వ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. అమర్‌ పిల్లలను తన గదిలో తన గుండెల మీద పడుకొబెట్టుకుని నిద్రపోవడాన్ని మిస్సమ్మ చూసి హ్యాపీగా ఫీలవుతుంది. మరోవైపు నుంచి మనోహరి చూసి ఇరిటేషన్‌గా ఫీలవుతుంది. కోపంగా తన రూంలోకి వస్తుంది. మనోహరిని కోపంగా చూసిన నీల ఎందుకమ్మా అంత కోపంగా ఉన్నారని అడుగుతుంది. నేను ఉండాల్సిన ప్లేస్‌లో పిల్లలు ఉన్నారని అది చూసి నా మనసు తట్టుకోవడం లేదని చెప్తుంది మనోహరి.

ఇంతలో లీల ఆ మిస్సమ్మ మాటలు నమ్మి నన్ను దూరం చేశారమ్మా అంటూ అలగడంతో ఆ మిస్సమ్మ పోయిపోయి నాతో పెట్టుకుంది దానికి నాతో పెట్టుకుంటే ఎంత ప్రమాదమో తెలియాలి అని చెప్తుంది మనోహరి. మరోవైపు ఓటమంటే తెలియని ఆ మనోహరికి ఓటమి అంటే ఏంటో రుచి చూపించాలని రాథోడ్‌తో చెప్తుంది మిస్సమ్మ.

భాగీ ఇంటికి అరుంధతి

అరుంధతి భాగమతి ఇంటికి వెళ్తుంటే గుప్త ఆపడానికి ప్రయత్నిస్తాడు. కానీ అరుంధతి ఆగకుండా రామ్మూర్తి ఇంట్లోకి వెళ్లిపోతుంది. నువ్వు... నువ్వు.. అంటాడు రామ్మూర్తి. నేనా.. అంటుంది అరుంధతి. అమరేంద్ర అయ్యవారి ఇంట తోటమాలిని.. తమరితో మాట్లడుటకు వచ్చితిని అంటాడు గుప్త. పగటి వేషగాణ్ని ఇంట్లోకి రానిచ్చావేంటి? ఏమయ్యా ఈయనకంటే బుద్ది లేక రానిచ్చాడు. నువ్వు అలాగే వస్తావా? అంటుంది మంగళ.

అవసరం అయితే తప్పా మాట్లాడొద్దని నీకు ముందే చెప్పాను కదా? ముందు రెండు టీలు పెట్టు.. అంటాడు రామ్మూర్తి. అనగానే మంగళ రెండు ఎవరికి.. వచ్చింది ఒక్కరే కదా అంటుంది. కనిపిస్తుంది ఒక్కరే అయినా నాకు ఇద్దరు ఉన్నట్లు అనిపిస్తుంది అంటాడు మూర్తి. గుప్త అరుంధతితో మాట్లడుతుంటే మంగళ మేము ఇక్కడ ఉంటే నువ్వు అక్కడ మాట్లాడతావేంటి అని అడుగుతుంది.

దీంతో మూర్తి అక్కడ ఎవరైనా ఉన్నారా అని దగ్గరకు వెళ్లి అరుంధతిని టచ్‌ చేస్తాడు. దీంతో షాక్‌ అవుతాడు రామ్మూర్తి. నాకు ఇక్కడ ఎవరో ఉన్నారనట్టు అనిపిస్తుంది. నీకు కూడా అనిపిస్తుందా? అంటాడు. నాకు అనిపించడం లేదు అంటాడు గుప్త. చెప్పండి నాతో ఏదో మాట్లాడాలని వచ్చారు. అమరేంద్ర బాబు ఏదైనా పంపించాడా? అంటాడు రామ్మూర్తి.

రామ్మూర్తే తన తండ్రి అని తెలుసుకున్న అరుంధతి

నేనే తమరిని ఒక సందేహం అడుగుటకు వచ్చితిని..తమరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారా? అంటే మిస్సమ్మ కాకుండా మీకు వేరొక కుమార్తె ఉన్నదా? అని గుప్త అడుగుతుండగానే మంగళ ఈ వ్యక్తి వేషం మాట చూస్తుంటే తేడాగా ఉంది. కొంపతీసి అరుంధతి వచ్చిందా అని మనసులో అనుకుని భయపడుతుంది. మూర్తి ఏడుస్తూ నేను చేసిన పాపం గుర్తుకు వచ్చింది అంటాడు.

తనకు కూతురు పుట్టిన వెంటనే కొన్ని కారణాల వల్ల అనాథ శరణాలయంలో వదిలేశాను. అంటూ నిజం చెప్పడంతో అరుంధతి ఏడుస్తుంది. నా కూతురు సరస్వతి అనే వార్డెన్‌ దగ్గర పెరిగిందట అని చెప్పగానే అరుంధతి అది నేనే అంటూ ఏడుస్తూ వెళ్లిపోతుంది. గుప్త కూడా బాలికా ఆగుము అంటూ వెళ్లడంతో.. అరుంధతి నిజంగానే వచ్చిందని మంగళ భయపడుతుంది.

మనోహరి పెళ్లి ఆపడానికి మిస్సమ్మ ప్లాన్

మనోహరి పెళ్లి ఎలాగైనా ఆపాలని మిస్సమ్మ ఆలోచిస్తుంది. మనోహరి వచ్చి ఏవమ్మా మిస్సమ్మా ఒక్కదెబ్బకే నీళ్లలొంచి నేల మీద పడ్డ చేపలా గిలగిలా కొట్టుకుంటున్నావేంటమ్మా? వచ్చేసింది చూడు నా రెండో అస్త్రం అంటుంది. అప్పుడే స్కూల్ ప్రిన్సిపాల్‌ అక్కడకు వస్తుంది. మనోహరి ప్రిన్సిపాల్‌ను తీసుకుని లోపలికి వెళ్తుంది.

లోపలకి వచ్చిన ప్రిన్సిపాల్‌ అమర్‌తో పిల్లలకు సమ్మర్‌ క్యాంపు అరెంజ్‌ చేశామని పంపించమని అడుగుతుంది. పిల్లలు వద్దని బాధపడుతుంటారు. ఇంతలో మిస్సమ్మ వచ్చి పిల్లలు ఏ సమ్మర్‌ క్యాంపుకు రారని చెప్తుంది. దీంతో మనోహరి కోపంగా మిస్సమ్మను తిడుతుంది. అమర్‌ కూడా పిల్లలను పంపడం ఇష్టం లేదని చెప్పడంతో మనోహరి షాక్‌ అవుతుంది. అమర్​ పిల్లలను సమ్మర్​ క్యాంప్​కి పంపించడానికి ఒప్పుకుంటాడా? రామ్మూర్తే తన కన్నతండ్రి అని తెలుసుకున్న అరుంధతి ఏం చేయబోతుంది? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు మార్చి 21న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తప్పకుండా చూడాల్సిందే!

Whats_app_banner