NNS 21st August Episode: పడిపోయిన అంజు.. మిస్సమ్మ ఎంట్రీ.. వీడియో చూసి వణికిపోయిన మనోహరి.. అదిరిపోయిన ట్విస్ట్!
NNS 21st August Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ బుధవారం (ఆగస్ట్ 21) ఎపిసోడ్లో పరుగు పందెంలో అంజు పడిపోతుంది. అప్పుడే సీన్లోకి ఎంట్రీ ఇస్తుంది భాగీ. అటు ఓ వీడియో చూసి మనోహరి వణికిపోతుంది.
NNS 21st August Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం ఈరోజు (ఆగస్ట్ 21) ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. బంటి, ప్రిన్సిపల్ కలిసి అంజుని పరుగు పందెంలో గెలవకుండా ప్లాన్ చేస్తారు. అంజు పక్కనే పరిగెడుతున్న పాప అంజుని పడేస్తుంది. ట్రాక్ మీద పడిపోయిన అంజు అమ్మా.. అని అరుస్తుంది. పిల్లలు అందరూ కంగారు పడతారు. అరుంధతి బాధపడుతూ లే అంజూ.. అని ఏడుస్తుంది. కానీ అంజు అలాగే పడుకుని బాధపడుతూ ఉంటుంది.
మిస్సమ్మ ఎంట్రీ
అప్పుడే మిస్సమ్మ ఎంట్రీ ఇస్తుంది. కమాన్ అంజు.. యు కెన్ డూ ఇట్ అంటూ ఎంకరేజ్ చేస్తుంది. అంజు లేచి మళ్లీ పరుగు మొదలుపెడుతుంది. మిస్సమ్మ సపోర్ట్ తో పందెంలో గెలుస్తుంది అంజు. పిల్లలంతా సంతోషంగా గంతులు వేస్తారు. తన ప్లాన్ వర్కౌట్ అవనందుకు ప్రిన్సిపల్ నిరాశపడుతుంది.
మనోహరి అసహనంగా అటూఇటూ తిరుగుతూ ఉంటుంది. అమర్‌కి నిజం తెలియకుండా ఆపలేకపోయాను. నిజం తెలిశాక అమర్ మనసులో భాగీ పట్ల బంధం బాధ్యతగా మారుతుంది. ఆ బంధం బలపడక ముందే ఏదో ఒకటి చేయాలి అనుకుంటుంది. ఒక్కో సమస్య నుంచి బయటపడాలి, ఒక్కో అడ్డంకిని దాటుకుని అమర్‌ని చేరుకోవాలి అనుకుంటుంది మనోహరి.
వీడియో చూసి వణికిపోయిన మనోహరి
అప్పుడే మనోహరి పిల్లల ఆహారంలో విషం కలిపిన వీడియో వస్తుంది. ఫోన్లో ఆ వీడియో చూడగానే వణికిపోతుంది. అర్జంట్‌గా మాట్లాడాలని ఆ నెంబర్‌కి మెసేజ్ పెడుతుంది. ఫోన్ రాగానే ఎవరు నువ్వు, ఏం కావాలి అని అడుగుతుంది. అదేంటీ.. యాభై లక్షలు కావాలని చెప్పాను కదా.. మర్చిపోయావా? పోనీ.. అమర్‌కి ఈ వీడియో పెట్టనా, ఇంక జీవితంలో నువ్వు అనుకున్నది సాధించలేవు అంటాడు అవతల వ్యక్తి.
బుకాయించాలని ప్రయత్నిస్తుంది మనోహరి. కానీ ఆ వ్యక్తి తనకి మనోహరి నిజస్వరూపం మొత్తం తెలుసని ఏకరవు పెడతాడు. కాసేపట్లో చెప్పినట్లు యాభై లక్షలు పంపకపోతే అరుంధతిని చంపిన విషయం, పిల్లల్ని చంపాలనుకున్న విషయం ఆధారాలతో సహా అమర్‌కి పంపిస్తానంటాడు. భయపడిపోయి వెంటనే అడిగినంత ఇచ్చేందుకు ఒప్పుకుంటుంది మనోహరి. అసలిదంతా చేస్తుంది ఎవరు? అని ఆలోచనలో పడుతుంది.
అరుంధతి సంబరాలు
అంజు పరుగు పందెంలో గెలవడంతో సంబరంతో పరిగెడుతూ ఉంటుంది అరుంధతి. ఎదురుగా వచ్చిన భాగీని చూడకుండా డాష్ ఇస్తుంది. తన పిల్లలు ఇందాక రన్నింగ్ రేస్‌లో పాల్గొని గెలిచారు అనబోయి గెలవలేకపోయారు అని కవర్ చేస్తుంది. నా కూతురు అంజలీనే రన్నింగ్ రేస్‌లో గెలిచింది అంటూ సంబరంగా చెబుతుంది భాగీ.
పరుగు పందెంలో గెలిచానని అతి చేస్తుంది అంజలి. అది చూసిన అరుంధతి, భాగీ నవ్వుకుంటారు. ఒక్క పందెంలో గెలిచి బాగా ఓవర్ చేస్తోందని మిగతా పిల్లలందరూ ఆటపట్టిస్తారు. మిస్సమ్మ కూడా వాళ్లతో చేరి అంజుని ఏడిపిస్తుంది. నావంతుగా నేను డాడీ పరువు నిలబెట్టేశా.. ఇక మిగిలింది మీరే.. అంటుంది అంజు. అందరూ నవ్వడంతో మిస్సమ్మ కావాలనే తనను ఏడిపిస్తుందని కోపం తెచ్చుకుంటుంది.
స్కూల్‌కు బెటాలియన్‌తో అమర్
స్వాతంత్య్ర దినోత్సవాలకు బందోబస్త్ కోసం అమర్ స్కూల్‌కి తన బెటాలియన్‌తో వస్తాడు. అనుమానస్పదంగా ఎవరు కనిపించినా వెంటనే అదుపులోకి తీసుకోమని చెబుతాడు. ఆర్మీని చూసి కంగారు పడుతుంది ప్రిన్సిపల్. ఏమైందని అమర్‌ని అడుగుతుంది. రొటీన్ చెకింగ్ అంటాడు అమర్. ఇందాకే రన్నింగ్ రేస్ అయ్యిందని, తర్వాత చెస్ పోటీలు జరగబోతున్నాయంటుంది ప్రిన్సిపల్.
అంజలి పాపనే గెలిచి ఉంటుంది, అందుకే మీరు అలా పెట్టారు ముఖం అంటాడు రాథోడ్. తక్కువ మంది పార్టిసిపేట్ చేయడంతో అంజలి గెలిచిందంటూ అక్కడ నుంచి విసురుగా వెళ్లిపోతుంది ప్రిన్సిపాల్. అమర్, రాథోడ్ అంజలిని కలవడానికి వెళ్తారు. స్కూల్లో ఏం జరగబోతోంది? స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా వచ్చేది ఎవరు? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు ఆగస్ట్ 21న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తప్పకుండా చూడాల్సిందే!