NNS 01st May Episode: రాథోడ్‌ని అనుమానించిన అమర్.. మిస్సమ్మతో జీవితం పంచుకోమని అమర్‌కి సలహా ఇచ్చిన మనోహరి!
NNS 01st May Episode: నిండు నూరేళ్ల సావాసం బుధవారం (మే 1) ఎపిసోడ్ లో మిస్సమ్మ వెనుక రాథోడ్ ఉన్నాడని అమర్ అనుమానిస్తాడు. మరోవైపు మిస్సమ్మతో జీవితం పంచుకోవాలంటూ అమర్ ను రెచ్చగొడుతుంది మనోహరి.
NNS 01st May Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం బుధవారం (మే 1) ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఒకసారి చూద్దం. అమర్, భాగీలకు మొదటి రాత్రి కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తుంటారు నిర్మల, శివరామ్. ఇంట్లో జరుగుతున్న హడావుడి చూసి అసూయపడుతుంది అరుంధతి.
వెంటనే గుప్త దగ్గరకు వెళ్లి తనని తీసుకెళ్లకుండా కావాలనే ఇక్కడుంచి ఏడిపిస్తున్నారని గుప్తతో గొడవపడుతుంది. పెళ్లి తర్వాత జరిగే కార్యక్రమాలను కూడా తిలకిద్దువుగాక అంటూ అరుంధతిని ఆటపట్టిస్తూ పాటలు పాడతాడు గుప్త.
మిస్సమ్మ సంగతి చెబుతానన్న అమర్
అమర్ గదిని అలంకరించడానికి పూలు తెస్తాడు రాథోడ్. వాటిని చూసి ఆ పూలను తన రూమ్‌లోకి ఎందుకు తీసుకెళ్తున్నావ్ అని కోప్పడతాడు. అసలు ఆ మిస్సమ్మ చేసిన మోసానికి ఇంట్లోకి రానివ్వడమే ఎక్కువంటే ఇప్పుడు ఈ సోకులు కూడానా అంటూ కోప్పడతాడు అమర్. కానీ ఇప్పుడు నేను వెళ్లినా మళ్లీ అమ్మగారు వచ్చి మీకు నచ్చజెప్పిన తర్వాత అయినా జరిగేది అదే సార్ అంటాడు రాథోడ్.
అసలు మిస్సమ్మ తనని మోసం చేయడం వెనుక నీ హస్తం ఏం లేదు కదా అని రాథోడ్‌ని నిలదీస్తాడు అమర్. మీమీద ఒట్టు సార్.. అసలు మిస్సమ్మ అలా చేస్తుందని నాక్కూడా తెలియదు అంటాడు రాథోడ్. రానీయ్.. ఆ మిస్సమ్మ నాగదిలోకే వస్తుంది కదా.. చెప్తా తన సంగతి అంటాడు అమర్. అయ్యో!.. ఈరోజు మా సార్ చేతిలో నువ్వేమైపోతావో మిస్సమ్మ అని బాధపడతాడు రాథోడ్.
అమర్‌ని రెచ్చగొట్టిన మనోహరి
పిల్లలు తనతో మాట్లాడటం లేదని, తనపై కోపంగా ఉన్నారని కరుణతో చెబుతూ బాధపడుతుంది మిస్సమ్మ. నువ్వు చేసిన పనికి అందరూ కోపంతోనే ఉంటారు కొన్నాళ్లు పోతే అంతా సర్దుకుంటుంది అని చెబుతుంది కరుణ. ఇంతలో నిర్మల వచ్చి అరుంధతి చీర, నగలు మిస్సమ్మకు ఇచ్చి తయారవమని చెబుతుంది. అదంతా కిటికీలో నుంచి చూసి అరుంధతి బాధపడుతుంది.
భాగీని త్వరగా తయారవమని తొందరపెడుతుంది కరుణ. అసలు మిస్సమ్మకు కోడలు నగలు ఎందుకు ఇచ్చావని అంటాడు శివరామ్. ఏదేమైనా మిస్సమ్మకు అమర్‌కి పెళ్లైయింది. వాళ్లని ఒక్కటి చేయాల్సిన బాధ్యత మనదే అంటుంది నిర్మల. అదంతా విన్న మనోహరి కోపంతో అమర్ దగ్గరకు వెళ్లి మిస్సమ్మతో జీవితం పంచుకోమని చెబుతూనే అమర్‌లో కోపం పెంచుతుంది. ఎప్పటికీ ఆ మోసగత్తెతో తన జీవితం పంచుకోనని అరిచి వెళ్లిపోతాడు అమర్. అదంతా వింటున్న రాథోడ్ మనోహరి ప్లాన్‌ని అర్థం చేసుకుని బాధపడతాడు.
అరుంధతిలా మారిన మిస్సమ్మ
అరుంధతి.. గుప్త దగ్గరకు వచ్చి తన చీర, నగలు మిస్సమ్మకు ఎందుకు ఇవ్వాలి అని అసూయగా మాట్లాడుతుంది. అది విని గుప్త నవ్వుతూ ఇప్పుడేముంది.. ముందుంది మొసళ్లపండగ అని ఆటపట్టిస్తాడు. అందరూ మిస్సమ్మ కోసం హాల్లో వేచి ఉంటారు. అప్పుడే మిస్సమ్మ తయారై కిందకి వస్తుంది. అచ్చం అరుంధతిలా కనిపిస్తున్న మిస్సమ్మని చూసి మనోహరితో సహా అందరూ షాకవుతారు.
వాళ్లు అలా చూడటం చూసి ఏమైందే వీళ్లకి అంటుంది మిస్సమ్మ. నువ్వు వాళ్ల కోడలిగా కనిపిస్తున్నావేమో అని చెబుతుంది కరుణ. నిర్మల పాల గ్లాస్ తీసుకొచ్చి మిస్సమ్మకి ఇచ్చి అమర్ గదికి వెళ్లమని చెబుతుంది. కరుణ మిస్సమ్మని తీసుకెళ్లి అమర్ గదిలోకి పంపిస్తుంది. భయపడుతూనే అమర్ గదిలో అడుగుపెడుతుంది మిస్సమ్మ.
తెల్లచీరలో అచ్చం అరుంధతిలా కనిపిస్తున్న మిస్సమ్మను చూసి షాకవుతాడు అమర్. అరుంధతిలా కనిపిస్తున్న మిస్సమ్మను అమర్ భార్యగా అంగీకరిస్తాడా? మనోహరి ప్లాన్‌కి మిస్సమ్మ జీవితం బలికానుందా? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు మే 1న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తప్పకుండా చూడాల్సిందే!
టాపిక్