NNS 1st January Episode: ముసుగులు వేసుకున్న భాగీ, రాథోడ్.. షాకైన అమర్​.. ఆలోచనల్లో ఆరు.. స్పృహ కోల్పోయిన మిస్సమ్మ​!-zee telugu serial nindu noorella saavasam today 1st january episode nns serial today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns 1st January Episode: ముసుగులు వేసుకున్న భాగీ, రాథోడ్.. షాకైన అమర్​.. ఆలోచనల్లో ఆరు.. స్పృహ కోల్పోయిన మిస్సమ్మ​!

NNS 1st January Episode: ముసుగులు వేసుకున్న భాగీ, రాథోడ్.. షాకైన అమర్​.. ఆలోచనల్లో ఆరు.. స్పృహ కోల్పోయిన మిస్సమ్మ​!

Hari Prasad S HT Telugu
Jan 01, 2025 06:00 AM IST

NNS 1st January Episode: నిండు నూరేళ్ల సావాసం బుధవారం (జనవరి 1) ఎపిసోడ్లో ఆరు ఫొటో చూసి భాగీ స్పృహ తప్పి పడబోతుంది. ఆమె ఆత్మ గురించి అమర్ కు భాగీ చెబుతుందా లేదా అన్న ఉత్కంఠ ఈ ఎపిసోడ్లో ఉంటుంది.

ముసుగులు వేసుకున్న భాగీ, రాథోడ్.. షాకైన అమర్​.. ఆలోచనల్లో ఆరు.. స్పృహ కోల్పోయిన మిస్సమ్మ​!
ముసుగులు వేసుకున్న భాగీ, రాథోడ్.. షాకైన అమర్​.. ఆలోచనల్లో ఆరు.. స్పృహ కోల్పోయిన మిస్సమ్మ​!

NNS 1st January Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం ఈరోజు (జనవరి 1) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. మిస్సమ్మ తన ఫొటో చూడకుండా ఏం చేయాలో అర్థం కావట్లేదని గుప్తతో అంటుంది ఆరు. ఈ భయం అంతా మొదలు పెట్టక ముందు ఉండాలి. నీ దశదినకర్మ అయిన వెంటనే మా లోకానికి వస్తే ఇదంతా ఉండేది కాదు కదా అంటాడు గుప్త.

yearly horoscope entry point

ఆందోళనలో ఆరు

నేను మిస్సమ్మకు కనిపిస్తానని కానీ విషయం ఇంత దూరం వస్తుందని కానీ నాకేం తెలుసు.. అన్ని తెలిసి మీరు సైలెంట్‌గా ఉన్నారు కదా ముందు మిమ్మల్ని అనాలి.. అసలు నేను మిస్సమ్మకు మాత్రమే ఎందుకు కనిపిస్తున్నానో అది మాత్రం చెప్పరు అంటుంది ఆరు. అది చెప్పాలి అంటే నీ పుట్టుకతో మొదలుపెట్టాలి అంటాడు గుప్త.

ఏంటి గుప్త గారు నా పుట్టుకతో మొదలుపెట్టాలా..? గుప్త గారు చెప్పండి నా పుట్టుకకు.. మిస్సమ్మకు నేను కనిపించడానికి ఉన్న సంబంధం ఏంటి.. అని అడుగుతుంది. గుప్త వెంటనే మాట మారుస్తాడు. ముందు నువ్వు సమస్యలో ఉన్నావు. ఆ బాలిక నీ చిత్రపటమును చూసినచో లేని పోని ప్రమాదములు వస్తాయి. ప్రస్తుతం తప్పినా పూర్తిగా ప్రమాదం తప్పలేదు అంటూ హెచ్చరించి వెళ్లిపోతాడు గుప్త.

మనోహరికి భాగీ వార్నింగ్

ప్రస్తుతానికి అస్థికలు ఇంట్లో అమర్‌ దగ్గర ఉన్నాయి. ఒక గండం తప్పింది. కానీ రేపు పొద్దున అమర్‌ ఫోటో బయట పెట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి అని మనోహరి ఆలోచిస్తుంటే.. ఘోర ఫోన్‌ చేసి అరుంధతి అస్థికలు స్మశానంలో ఎందుకు లేవు.. ఎక్కడ ఉన్నాయి అని అడుగుతాడు. దీంతో మనోహరి ఆ అస్థికలు తీసుకుని నీకు ఇద్దామని వెళితే అక్కడికి అమర్‌ వచ్చాడు. నన్ను అనుమానించాడు. కొద్దిలో తప్పించుకున్నాను అని చెప్పగానే.. ఏంటి మనోహరి అక్కడ అందరినీ మోసం చేసినట్టు నన్ను మోసం చేస్తున్నావా…? అస్థికలు ఎందుకు తీసుకెళ్లాలనుకున్నావు. నీకు ఇచ్చిన అవకాశాన్ని కోల్పోయావు.. ఇప్పుడిక నా ప్రయాణం నీవైపే అంటూ వార్నింగ్‌ ఇస్తుంటాడు.

ఇంతలో మనోహరి రూంలోకి మిస్సమ్మ వస్తుంది. మిస్సమ్మను చూసి మనోహరి షాక్‌ అవుతుంది. మిస్సమ్మ లోపలికి వచ్చి చేసిన తప్పులు చాలు మను.. అక్క అస్థికలు తీసుకుని ఆ ఘోరాకు ఇవ్వడానికి ప్రయత్నించావు. ఇక నిన్ను ఏం చేస్తానో నాకే తెలియదు అంటూ వార్నింగ్‌ ఇచ్చి వెళ్తుంది మిస్సమ్మ. ఫోన్‌లో లైన్‌లో ఉన్న ఘోరాకు విన్నావా ఘోరా ఇప్పుడైన నా మీద నమ్మకం వస్తుందా..? అని అడుగుతుంది. దీంతో సరే మనోహరి నేను నిన్ను నమ్మాలి అంటే ముందు నువ్వు అస్థికలు నాకు తీసుకొచ్చి ఇవ్వు అప్పుడు నమ్ముతాను అని చెప్పి ఫోన్‌ కట్‌ చేస్తాడు ఘోర.

రాథోడ్, మిస్సమ్మ ముసుగులు

రాత్రికి అందరూ పడుకున్నాక మిస్సమ్మ ప్లాన్‌ ప్రకారం.. రాథోడ్‌, మిస్సమ్మ ముసుగులు వేసుకుని మాట్లాడుకుంటారు. మనం అనుకున్నది అనుకున్నట్టు జరిగితే పౌర్ణమి అయ్యే వరకు మనం గుండెల మీద చేయి వేసుకుని పడుకోవచ్చు అని మాట్లాడుకుంటుంటారు. ఇంతలో అమర్‌ వచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ అని అడుగుతాడు. అమర్‌ ను చూసిన రాథోడ్‌, మిస్సమ్మ షాక్‌ అవుతారు. ఇద్దరూ పలకకుండా ఉంటే.. ఏం జరగుతుంది ఇక్కడ అని అమర్‌ అడుగుతాడు.

ఆ ఎక్స్‌ ప్రెషన్స్‌ ఏంటి.. రాథోడ్ ‌మీ ఇద్దరి గెటప్స్‌ ఏంటి.. అని అమర్‌ అడగ్గానే.. అంటే అది చలికాలం కదా సార్‌ అని రాథోడ్‌ చెప్తాడు. ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారు అని అమర్‌ అడగ్గానే.. అంటే సార్‌ అస్థికలు ఇంట్లో ఉన్నాయి కదా..? సార్‌ వాటికి కాపలా కాస్తున్నాం అని రాథోడ్‌ చెప్పగానే.. అక్క ఆస్థికల విషయంలో చాన్స్‌ తీసుకోలేం కదా అని మిస్సమ్మ చెప్తుంది. సరే అయితే రాథోడ్‌ ఏమైనా అవసరం అయితే నన్ను నిద్ర లేపు అని చెప్పి అమర్‌ వెళ్లిపోతాడు.

ఆరు ఫొటో చూసిన భాగీ

ఆరు ఆర్థరాత్రి గార్డెన్‌లో కూర్చుని గుప్త చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ బాధపడుతుంది. ఇంటి వైపే చూస్తుంది. గుప్త గారు నన్ను అడిగిన ఏ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు. నా మౌనాన్ని గుప్త గారు అర్థం చేసుకోగలడు. కానీ మిస్సమ్మ అర్థం చేసుకుంటుందా..? ఇంత ప్రమాదం ఉంటుందని తెలియక ఈ ఆటను మొదలుపెట్టాను. కానీ ఇప్పుడు కొనసాగించలేను.. ముగించకూడదు అనుకుంటూ ఏడుస్తుంది ఆరు.

ఉదయమే మిస్సమ్మ దేవుడి దగ్గర పూజ చేస్తుంటుంది. ఇంతలో రాథోడ్‌ ఆరు ఫోటో తీసుకుని వచ్చి హాల్‌లో పెడతారు. మేడం ఫోటో దగ్గర అన్ని సిద్దం అయ్యాయి అని నిర్మలకు చెప్పగానే నిర్మల మిస్సమ్మకు హాల్‌లో ఫోటో సిద్దంగా ఉంది. పూజ పూర్తి అయ్యాక వచ్చి ఫోటో దగ్గర దీపం పెట్టు అని చెప్తుంది. అలాగే అత్తయ్య అని పూజ పూర్తి చేసి హారతి తీసుకుని బయటకు వచ్చి అందరికీ ఇస్తుంది మిస్సమ్మ.

హారతి ఇచ్చిన తర్వాత ఆరు ఫోటో చూసి మిస్సమ్మ షాక్ అవుతుంది. భయంతో స్పృహ కోల్పోబోతుంటే అందరూ పట్టుకుంటారు. భాగీ ఆరు ఆత్మ గురించి అమర్​కి చెబుతుందా? నిజం బయటపడకుండా ఉండేందుకు మనోహరి ఏం చేయబోతోంది? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు జనవరి​ 01న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తప్పకుండా చూడాల్సిందే!

Whats_app_banner