NNS 19th June Episode: అరుంధతి ఆత్మను బంధించిన ఘోరా.. మనోహరికి తెలిసిపోయి ఆరు ఆత్మ రహస్యం
NNS 19th June Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ బుధవారం (జూన్ 19) ఎపిసోడ్లో అరుంధతి ఆత్మను ఘోరా బంధిస్తాడు. అతడి చేతిలో అమ్ము కూడా బలయ్యే ప్రమాదం పొంచి ఉంటుంది.
NNS 19th June Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం బుధవారం (జూన్ 19) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. గుప్త వద్దని వారిస్తున్నా వినకుండా అమ్ముని కాపాడటానికి కొండపైకి ఎక్కుతుంది అరుంధతి. పరిగెత్తుకుంటూ వస్తున్న అరుంధతి ఆత్మను చూసి నువ్వు కంటికి రెప్పలా కాపాడుకుంటున్న నీ బంధాలే నిన్ను నా దగ్గరకు రప్పిస్తాయని నాకు తెలుసు, నేను నిన్ను బంధించి ఈ లోకాన్ని శాసించబోతున్నాను. రా.. నన్ను గెలుపువైపు పంపించడానికి పరిగెత్తుకుంటూ రా.. అంటూ సంబరపడతాడు ఘోరా.
అమ్ము జాడ కనిపెట్టిన అమర్
బాలిక ఘోరా దగ్గరకు వెళ్లిన బంధీ అగును, ఇవన్నీ నా కళ్లముందు జరుగుతున్నా ఏమీ చేయలేని సంకటస్థితిలో ఎందుకు ఉంచావు జగన్నాథా! అంటూ బాధపడతాడు గుప్త. అమ్ము కోసం వెతుక్కుంటూ భాగీ మనోహరిని ఫాలో అవుతూ ఉంటుంది. రాథోడ్, అమర్ కూడా అమ్ము, ఘోరా ఉన్నప్రాంతం దగ్గరకు వస్తారు. పోలీసులకు కూడా అమ్ము జాడ తెలియలేదంట అంటాడు రాథోడ్.
అయితే అమ్ముని తప్పకుండా ఇక్కడకే తీసుకొచ్చి ఉంటాడు అంటాడు అమర్. మనోహరి కారు కనపడకుండా పోవడంతో కంగారు పడుతుంది భాగీ. అమర్‌కి ఫోన్ చేయాలని అనుకున్నా ఒకవేళ ఇది మనోహరి పని కాకపోతే వేరేవాళ్ల పని అయితే ఆయన తప్పుగా అనుకుంటారు అని ఆలోచించి ఆగుతుంది.
అమ్మని వేడుకున్న అమ్ము
అమ్ముని కాపాడటానికి కొండపైకి వెళ్లి తనని వెనక్కి లాగడానికి ప్రయత్నించి విఫలమవుతుంది. ఆత్మ ఉనికి కనిపెట్టిన ఘోరా.. నువ్వు నాకు కనిపించవు, వినిపించవు. కానీ నీ ఉనికి నాకు తెలుస్తుంది. నువ్వు నీ కూతురుని కాపాడుకోవడానికి ఇక్కడకు వచ్చావని నాకు తెలుసు. వెంటనే ఈ సీసాలోకి వెళ్లు లేదంటే నీ కూతురు నీ కళ్లముందే చనిపోతుంది అని అమ్ముని మరింత ముందుకు వెళ్లమని చెబుతాడు ఘోరా.
అరుంధతి ఎంత బతిమాలినా పట్టించుకోకుండా ఘోరా చెప్పినట్లే వింటున్న అమ్ముని చూసి చేసేదేంలేక సీసాలోకి వెళ్లేందుకు సిద్ధమవుతుంది అరుంధతి. బాలికా ఆగుము.. నువ్వు ఏం చేసినా జరిగేది జరగవల్సిందేనని చెప్పాను కదా. తొందరపడకు.. ఒక్కసారి ఆ సీసాలోకి వెళ్లి ఘోరాకు బంధీగా మారితే ఎవరూ నిన్ను కాపాడలేరని ఆపుతాడు గుప్త.
నిన్ను వెంట ఉండి కాపాడే శక్తి వచ్చేసిందా.. అయితే నీ కూతురుని కాపాడమని ఆ శక్తిని అడుగు అంటాడు ఘోరా. అమ్మా.. ప్లీజ్ అమ్మా.. నన్ను కాపాడమ్మా, ఆయన చెప్పినట్లు చెయ్యమ్మా అంటుంది అమ్ము. ఘోరా చెప్పినట్టే చేస్తున్న అమ్ముని చూసి తట్టుకోలేకపోతుంది అరుంధతి. నా కూతురు కోసం తప్పదు గుప్తగారు.. చివరిసారిగా ఒక్క సాయం చేయండి. నా పిల్లలకు, కుటుంబానికి అండగా ఉండండి అని వేడుకుంటుంది.
సీసాలోకి అరుంధతి ఆత్మ
బాలికా.. తప్పు చేస్తున్నావు. వీడు నిన్ను బంధీ చేసి అతీతశక్తులు పొంది విశ్వాన్ని నాశనం చేస్తాడు. నీకు మరు జన్మ లేకుండా చేస్తాడు అని ఆపుతాడు గుప్త. నా కూతురును ఎవరూ కాపాడనప్పుడు నేను ఏం చేయాలి గుప్తగారు. మీకు కాపాడే శక్తి ఉన్నప్పటికీ జరిగేది జరగకమానదు అంటూ చూస్తూ ఉన్నారు. నా కూతురు అపాయంలో ఉంటే ఎవరు ఏమైతే నాకేంటి అంటుంది అరుంధతి.
అమర్, రాథోడ్ డ్రోన్ సాయంతో ఘోరా ఉన్న ప్రాంతాన్ని కనుక్కుంటారు. మనోహరి ఘోరా దగ్గరకు వచ్చి ఏం జరుతుందని అడుగుతుంది. ఆత్మను బంధిస్తున్నా అని చెప్పిన ఘోరాతో అయితే ఆత్మ ఇక్కడే ఉందా అంటుంది మనోహరి. ఘోరా అవును అనగానే అయితే ఆరోజు అమ్ముకి నా విషయాలన్నీ ఎలా తెలిశాయో కనుక్కోమంటుంది. పౌర్ణమిరోజున ఆత్మకు వచ్చే శక్తి వల్ల ఇతరుల శరీరంలో ప్రవేశించింది. అదేవిధంగా నీ పెళ్లికి అడ్డుపడింది, అమ్ము రూపంలో నిన్ను హెచ్చరించింది అని ఘోరా చెప్పగానే మనోహరి కోపంతో ఊగిపోతుంది.
చంపినా నన్ను సాధిస్తూ నా సంతోషానికి అడ్డుతగులుతున్నావే అంటూ అరుంధతి ఆత్మను పట్టుకోడానికి ప్రయత్నిస్తుంది. వెంటనే అమ్ముని దూకమని చెప్పమని అంటుంది. మనోహరి మాటలు విని ఏడుస్తుంది అరుంధతి. నేనేం పాపం చేశానని ఇంతలా నన్ను ధ్వేషిస్తోంది గుప్తగారు. నాకు తప్పడం లేదు అంటూ సీసాలోకి వెళ్లిపోతుంది. ఆత్మ బంధీ అవడంతో సంతోషంతో నవ్వుతాడు ఘోరా.
అమ్ము బలితోనే ఆత్మబంధనం పరిసమాప్తమవుతుందంటాడు. అమ్ము ఘోరా చేతిలో బలవుతుందా? అమర్, భాగీ అమ్ముని కాపాడతారా? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు జూన్ 19న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తప్పకుండా చూడాల్సిందే!
టాపిక్