NNS 19th February Episode: అమర్ ఇంట్లో అడుగుపెట్టిన అనామిక.. షాక్‌లో మనోహరి.. అరుంధతికి గతం గుర్తొచ్చేసిందా?
NNS 19th February Episode: నిండు నూరేళ్ల సావాసం బుధవారం (ఫిబ్రవరి 19) ఎపిసోడ్లో అమర్ ఇంటికి వస్తుంది అనామిక. ఆమె చూసి మనోహరి షాక్ తింటుంది. మరి అనామికలోని అరుంధతికి గత గుర్తుకొస్తుందా?

NNS 19th February Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం ఈరోజు (ఫిబ్రవరి 19) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. అరుంధతి ఆత్మ మానవ శరీరంలోకి వెళ్లిందని, ఆమె తనను వెతుక్కుంటూ వస్తుందని స్వామీజీ చెప్పిన మాటలతో మనోహరి భయంతో కుప్పకూలుతుంది. అటు గుడిలో అమర్ కుటుంబంతో పూర్తిగా కలిసిపోతుంది అనామిక.
ఆమెకు సంబంధించిన వస్తువులు ఏవి ముట్టుకున్నా ఆమెకు గతం గుర్తుకు వస్తుందని, ముఖ్యంగా ఆమె తాళిని ముట్టుకోకుండా చూసుకోవాలని చెప్పి వెళ్లిపోతాడు స్వామీజీ. అది విని మనోహరి కుప్పకూలిపోతుంది. భయంతో వణికిపోతుంది. తనను వెతుక్కుంటూ వచ్చే ఆ వ్యక్తి ఎవరో అన్న ఆందోళన ఆమెలో మొదలవుతుంది.
అమర్ కుటుంబంతో కలిసిపోయిన అనామిక
అటు శివరాత్రి సందర్భంగా గుడికి వెళ్లిన అమర్ కుటుంబాన్ని అనుకోకుండా కలిసిన అనామిక.. తర్వాత వాళ్లతోనే కలిసి అభిషేకం చేయించి ఫ్యామిలీలో కలిసిపోతుంది. ఆ తర్వాత పడిపోతున్న దేవుడి విగ్రహాన్ని పట్టుకున్న భాగీకి సాయం చేసి ఆ కుటుంబానికి మరింత దగ్గరవుతుంది. ఆ దేవుడే ఆమెను తమ కుటుంబం దగ్గరికి పంపించాడేమో అని అమర్ ఫ్యామిలీ ఫీలవుతుంది.
అమర్ ఇంటికి అనామిక
గుడి నుంచి నేరుగా అమర్ ఇంటికే వెళ్తుంది అనామిక. గుడిలోనే తమ కుటుంబంలో ఒకరిగా కలిసిపోయిన ఆమెను.. అందరూ కలిసి తమ ఇంటికి తీసుకెళ్తారు. అనామిక కారులో నుంచి దిగడం చూసి మనోహరి షాక్ తింటుంది. ఆమెను చూడగానే అచ్చూ అరుంధతిని చూసిన భావన మనోకి కలుగుతుంది. స్వామీజీ చెప్పిన విషయం గుర్తుకు వచ్చి మరింత భయపడుతుంది.
అనామిక నేరుగా మనోహరి దగ్గరికే వస్తుంది. ఆమెను షాక్ కు గురవుతూ అలాగే చూస్తున్న మనోహరికి అంజు పరిచయం చేస్తుంది. ఈమె అనామిక అంటూ మనోహరికి.. ఈమె మా మనోహరి ఆంటీ అంటూ అనామికకు పరిచయం చేస్తుంది. ఆమెతో చేయి కలపగానే మనోహరి మరింత వణికిపోతుంది. అరుంధతి ఆత్మ తనను బెదిరించిన గతమంతా గుర్తుకు వస్తుంది.
ఆ తర్వాత అందరూ కలిసి లోనికి వెళ్తారు. అనామిక కూడా అమర్ ఇంట్లోకి అడుగుపెట్టడానికి వెళ్తుంది. ఇంటి తలుపును తాకగానే అనామికకు గతమంతా గుర్తుకువచ్చినట్లుగా ఆగిపోతుంది. మరి అనామికలోని అరుంధతికి గతం గుర్తుకు వస్తుందా? ఆమె మనోహరిని, మిగిలిన వాళ్లను గుర్తు పడుతుందా? అన్నది తెలియాలంటే బుధవారం (ఫిబ్రవరి 19) ప్రసారమయ్యే నిండు నూరేళ్ల సావాసం 494వ ఎపిసోడ్ చూడాల్సిందే.
సంబంధిత కథనం
టాపిక్